raghuvamsi
-
యూకే కంపెనీ కొనుగోలు చేసిన హైదరాబాద్ సంస్థ
హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ గ్రూప్.. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు విడిభాగాలను అందించే యూకేకు చెందిన ప్రముఖ ప్రెసిషన్ మెషినింగ్ కంపెనీ 'పీఎంసీ గ్రూపు'ను కొనుగోలు చేసింది.పీఎంసీ గ్రూపు కొనుగోలుతో.. రఘు వంశీ గ్రూపు కీలకమైన పరిశ్రమలకు ఉత్పత్తులు సరఫరా చేయనుంది. కాబట్టి కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని నిరూపించుకోగలుగుతుంది. అంతే కాకుండా ఆయిల్ & గ్యాస్ రంగంలో లేటెస్ట్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది.పీఎంసీ గ్రూపు.. తన ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా ఉన్న గొప్ప అనుభవం కలిగి ఉంది. ఈ కంపెనీ ఎస్ఎల్బీ, బేకర్ హ్యూస్, హాలీబర్టన్, ఎక్స్‌ప్రో, టెక్ ఎఫ్ఎంసీ, వన్ సబ్ సీ వంటి గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ ఓఈఎంలకు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో సుమారు 100 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు.. ఆదాయం రూ. 180 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.పీఎంసీ గ్రూపును.. రఘు వంశీ గ్రూప్ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, మిధాని సీఎండీ డాక్టర్ ఎస్ కే ఝా, ఏఆర్‌సీఐ సైంటిస్ట్ డాక్టర్ ఎల్.రామకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఘువంశీ గ్రూప్ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ.. రఘువంశీ కుటుంబంలోకి పీఎంసీ గ్రూపును స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు ఇప్పుడు మా ఉత్పత్తి బలాలను, సునిశిత మెషీనింగ్‌లో పీఎంసీ గ్రూపువారి నైపుణ్యంతో మిళితం చేస్తుంది. దీనివల్ల మా అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి, అత్యంత సునిశిత ఉత్పత్తుల విస్తృత విభాగాన్ని రూపొందించడానికి సాయపడుతుందని మేము సంతోషిస్తున్నామన్నారు. -
Shivani Raghuvanshi: మేడ్ ఇన్ హెవెన్..
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్ అనగానే శోభిత ధూళిపాళ సరే.. ఇంకో అమ్మాయి కూడా చటుక్కున గుర్తొస్తుంది. జాజ్.. జస్ప్రీత్గా వీక్షకులను అలరించిన శివానీ రఘువంశీ! తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సంజయ్ లీలా భన్సాలీ ‘దేవదాసు’ సినిమా చూసి ముందు డైరెక్టర్ కావాలనుకుంది.. తర్వాత అందులోని కథానాయికల భారీ ముస్తాబుకు ముచ్చటపడి సినిమాల్లోకి వెళ్లడమంటూ జరిగితే హీరోయిన్‌గానే అని నిశ్చయించుకుంది. సొంతూరు ఢిల్లీ నుంచి ‘సిటీ ఆఫ్ ద డ్రీమ్స్’ ముంబైకి ఎలా చేరిందో చూద్దాం..!‘దేవదాసు’ ఫీవర్‌తో శివానీ.. హీరోయిన్ కావాలని కలలు కంటూ చదువును అశ్రద్ధ చేస్తుంటే వాళ్లమ్మ చెవి మెలేసి స్ట్రిక్ట్‌గా వార్న్ చేసిందట.. ‘ముందు డిగ్రీ తర్వాతే నీ డ్రీమ్’ అని! దాంతో బుద్ధిని చదువు మీదకు మళ్లించింది. అయినా సినిమా ఆమె మెదడును తొలుస్తూనే ఉండింది.శివానీ డిగ్రీలో ఉన్నప్పుడు.. సినిమా కాస్టింగ్ కో ఆర్డినేటర్ ఒకరు పరిచయం అయ్యారు. ఆమె కాంటాక్ట్ నంబర్ తీసుకున్నారు. వారానికే ఓ టీవీ కమర్షియల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే అటెండ్ అవమని సమాచారమిచ్చారు. వెళ్లింది. అలా ‘వొడా ఫోన్’ కమర్షియల్‌తో తొలిసారి స్క్రీన్ మీద కనిపించింది. అది ఆమెకు మరిన్ని మోడలింగ్ అవకాశాలను తెచ్చిపెట్టింది.టీవీ కమర్షియల్స్‌లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. ముందుగానే అమ్మ అనుమతిచ్చేసింది కాబట్టి డిగ్రీ పట్టా పుచ్చుకున్న మరుక్షణమే ముంబై రైలెక్కేసింది.ముంబై చేరితే గానీ తెలియలేదు సినిమా చాన్స్ అనుకున్నంత ఈజీ కాదని. ఆ స్ట్రగుల్ పడలేక ఎందుకొచ్చిన యాక్టింగ్ అనుకుంది. అప్పుడే ‘తిత్లీ’ అనే సినిమాలో హీరోయిన్గా సైన్ అయింది. కానీ అది తను కోరుకున్నట్టు గ్లామర్ రోల్ కాదు. పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే సెట్స్ మీద సీరియస్‌నెస్ లేకుండా జోకులేస్తూ ఉండసాగింది. ఆమె తీరు ఆ సినిమా డైరెక్టర్ కను బహల్కి కోపం తెప్పించింది. ‘ఇలాగైతే కెరీర్ కొనసాగినట్టే’ అని హెచ్చరించాడు. ఆ సినిమా విడుదలై.. తాను పొందిన గుర్తింపును ఆస్వాదించాక గానీ శివానీకి అర్థంకాలేదు తనకొచ్చిన చాన్స్ ఎంత గొప్పదో అని!అప్పటి నుంచి ఆమె శ్వాస, ధ్యాస అంతా అభినయమే అయింది. ‘అంగ్రేజీ మే కహతే హై’ చిత్రంతో పాటు ‘జాన్ ద జిగర్’, ‘జుత్తీ ద షూ’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించింది.‘తిత్లీ’తో శివానీ క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ అందుకున్నా.. ఫిల్మ్ ఫ్రెటర్నిటీ దృష్టిలో పడినా.. ఇంటింటికీ పరిచయం అయింది మాత్రం ‘మేడ్ ఇన్ హెవెన్’ జాజ్తోనే! ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరో వెబ్ సిరీస్ ‘మర్డర్ ఇన్ మాహిమ్’ ప్రస్తుతం జీయో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.గ్లామర్ హీరోయిన్గా నటించాలనే కల ఇంకా నెరవేరలేదు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా..! – శివానీ రఘువంశీ -
తల్లి యశోద
కృష్ణుడిని యశోద పెంచింది. యశోదా నందనుడిగానే జీవించాడు. అయితే... కన్నతల్లి దేవకి అనే వాస్తవాన్ని కృష్ణుడి దగ్గర దాచలేదెవ్వరూ. దేవకి కడుపులో పుట్టిన తనను యశోద పెంచిందనే ఎరుకతోనే పెరిగాడు కృష్ణుడు. ఒక తల్లి కడుపున పుట్టి, మరో తల్లి ఒడిలో పెరిగే ప్రతి బిడ్డకీ ఆ వాస్తవం తెలియాలి. ‘ఊహ తెలియని వయసులో దత్తత తల్లి ఒడిని చేరినప్పటికీ, ఊహ తెలిసిన తరువాత లేదా లోకం తెలిసేవయసు వచ్చాక పిల్లలకు ఆ నిజాన్ని చెప్పి తీరాలి’ అంటున్నారు స్మృతి. స్మృతి పుణెలో ఉంటా రు. వయసు 37 ఏళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొంతకాలం యూరప్‌లో వికీమీడియా ఫౌండేషన్‌లో పని చేసి 2014లో ఇండియాకి వచ్చేశారు. ఇద్దరు పాపాయిలను దత్తత తీసుకున్నారు. ఆమె దత్తత తీసుకునే నాటికి ఒక పాపకు ఆరేళ్లు, మరొక పాపాయికి ఐదేళ్లు. ఇప్పుడామె దత్తత గురించి సమాజంలో నెలకొని ఉన్న అపోహలు తొలగించడానికి, పిల్లలు లేని భార్యాభర్తలను చైతన్య వంతం చేయడానికే పూర్తి సమయాన్ని కేటాయించారు. దత్తతకు ఆవైపు ఈవైపు దత్తత అనే మాటకు... మనందరిలో ఒక అభిప్రాయం స్థిరపడిపోయి ఉంది. పిల్లలు లేని భార్యాభర్తలకు పిల్లలు లేని లోటును భర్తీ చేయడానికే దత్తత అనుకుంటాం. వాళ్లకు అమ్మానాన్నా అనే పిలుపు కోసమే అనీ అనుకుంటాం. కానీ దత్తత అంటే.. తనకంటూ ఇల్లు, కుటుంబం లేని బిడ్డకు ఓ కుటుంబాన్ని ఇవ్వడం కూడా. పిల్లలు లేని వారికి ఓ బిడ్డను ఇచ్చి వారిలో సంతోషాన్ని పెంచడం ఒక కోణం అయితే, తల్లిదండ్రులు లేని ఓ బిడ్డకు... అమ్మా, నాన్నలతో ఓ కుటుంబాన్నివ్వడమే మహోన్నతమైన పని. రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య వారధి కట్టి ఆ ప్రపంచాలను దగ్గర చేయడం.చూడనట్లు వెళ్లిపోకండి‘‘మనదేశంలో ఈ వారధి పటిష్టం కావాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను షెల్టర్లకు చేర్చడానికి తెలిసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కన్న తల్లిదండ్రులు లేని కారణంగా ఏ బిడ్డ జీవితమూ అగమ్యంగా, అలక్ష్యంగా మారకూడదు. పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంది. చక్కగా పెరిగి, చదువుకుని ఇష్టమైన వృత్తిలో స్థిరపడి ఫలవంతమైన జీవితాన్ని జీవించే హక్కు కూడా ఉంది. పిల్లలను పోషిస్తూ, దత్తతకు పిల్లలు కావాలని వచ్చే వారితో అనుసంధానం చేయడానికి అనేక సంస్థలున్నాయి’’ అని చెబుతారు స్మృతి. మరో విషయాన్ని ఆమె తరచూ గుర్తు చేస్తుంటారు. అదేంటంటే.. ఆ తండ్రి జాడలేదు పుణెలో జాయ్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నారు స్మృతి. అక్కడికి ఓ వ్యక్తి కొన్ని ఏళ్ల కిందట మూడు నెలల పాపాయితో వచ్చాడు. తన భార్య చనిపోయిందని చెప్పి, మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డను తీసుకెళ్తానని, అప్పటి వరకు సంరక్షించమని కోరాడు. ఏళ్లు గడిచినా అతడు రాలేదు. పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు. ఆ పాపాయి చక్కగా పెరుగుతోంది. అయితే ఆమెను ఎవరికైనా దత్తత ఇవ్వాలంటే నిబంధనలు ఒప్పుకోవు. తండ్రి వచ్చి తన బిడ్డను ఇవ్వమన్నప్పుడు ఇవ్వగలగాలంటే... ఆ బిడ్డను దత్తత ఇవ్వకూడదు. ఆ తండ్రి వస్తాడో రాడో తెలియదు. ఎలా మరి? ఆచరణలో ఎదురయ్యే ఇలాంటి కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు స్మృతి. ఆ బిడ్డకు మంచి జీవితాన్నివ్వగలిగిన అవకాశం ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అది. ఇలాంటి పిల్లల విషయంలో తల్లి, తండ్రి లేదా సంరక్షకులు (ఎవరైతే షెల్టర్‌లో చేరుస్తారో వారు) సంవత్సరాల పాటు బిడ్డ కోసం రాకపోతే, షెల్టర్ హోమ్స్ ఆ పిల్లలను దత్తత ఇవ్వవచ్చు అని సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ నియమావళిలో మార్పులు చేయవచ్చని స్మృతి సూచించారు. ఆ సూచన పరిశీలనలో ఉంది. మనసు విశాలం అవ్వాలి దత్తత కోసం వచ్చే తల్లిదండ్రులకు స్మృతి వేడికోలు ఒక్కటే. ‘‘స్వల్ప అనారోగ్యాలు, మెల్లకన్ను వంటి చిన్న లోపాలు ఉన్న పిల్లలను కూడా దత్తత తీసుకోండి. వారికి వైద్యం చేయించగలిగిన ఆర్థిక స్థోమత మీకున్నప్పుడు అలాంటి పిల్లలను మెరుగ్గా మార్చగలిగిన అవకాశం మీ చేతులో ఉన్నప్పుడు ఆ మేరకు కొంత మీ మనసును విశాలం చేసుకోండి’’ అని అభ్యర్థిస్తున్నారు స్మృతి. ఆమె కౌన్సెలింగ్‌తో కన్విన్స్ అయిన ఒక జంట కాలు లేని పిల్లవాడిని దత్తత తీసుకుని ఆపరేషన్ చేయించి కృత్రిమ కాలు పెట్టించిన సంగతిని కూడా ఆమె గుర్తు చేస్తారు. అలాగే పెద్ద పిల్లలను కూడా దత్తత తీసుకోవలసిందిగా మరీ మరీ చెబుతుంటారు. పెద్ద పిల్లలను దత్తత తీసుకుంటే వాళ్లు తమను అసలైన తల్లిదండ్రులుగా స్వీకరించలేరేమోననే భయం దత్తత తీసుకునే వాళ్లను వేధిస్తుంటుంది. నిజానికి అలాంటిదేమీ ఉండదని, అందుకు తానే నిదర్శనం అంటారు.. తనే పిల్లలకు దత్తతగా వెళ్లిపోయానని ఎప్పుడూ చెబుతుండే.. ఈ మాతృమూర్తి చిరునవ్వులు చిందిస్తూ. అమ్మా.. మా అమ్మ ఎవరు? ‘నేను దత్తత తీసుకున్న చిన్న పాపాయి ఏమీ అడగదు, కానీ పెద్ద పాపాయి అడిగింది... అమ్మా! నాకు నువ్వు అమ్మవు అయ్యే వరకు నాకు అమ్మ ఎవరు? అని. తనకు వివరంగా చెప్పాను. ఆ ప్రశ్నకు ముందు ఎలా ప్రేమగా ఉండేదో ఆ తర్వాతా అలాగే ఉంది నాతో. కాబట్టి పిల్లలు పేరెంట్స్‌గా రిసీవ్ చేసుకోరనే భయం వద్దు. ఊహ తెలిసిన పిల్లలను కూడా దత్తత తీసుకోండి’ అని కోరుతున్నారామె. అలాగే దత్తత తీసుకున్న తల్లులు అంతటితో ఆగిపోకుండా సమాజంలో దత్తత మీద ఉన్న అపోహలను తొలగించే బాధ్యతను కూడా తీసుకోమని అభ్యర్థిస్తుంటారు స్మృతి. – మంజీర -
అంతా కలలా..
స్నేహితులను కాపాడలేకపోయా.. కళ్లెదుటే కొట్టుకుపోయారు పరుగెత్తినా పట్టుకోలేకపోయా.. ప్రత్యక్షసాక్షి రఘువంశీ దొరకని శ్రీనిధి ఆచూకీ ‘అప్పటిదాకా అందరం అక్కడే ఎంజాయ్ చేశాం. ఫొటోలు దిగాం. మేం ఉన్నచోట రాళ్లు చిన్నగా ఉన్నయ్. అక్కడికి కొద్దికొద్దిగా నీళ్లు రావడంతో ఎందుకైనా మంచిదని నాతోపాటు మరో ఇద్దరు మిత్రులు ఒడ్డుకు వచ్చాం. మా వెనకాలే మరొకరు వచ్చారు. ఇంతలో నీళ్లు ఒక్కసారిగా వరదలా వచ్చాయి. అతడు మునిగిపోతుంటే పట్టుకున్నాం.మిగతావారిని మాత్రం కాపాడలేకపోయాం. అసలు ఏం జరిగిందో అర్థంకాలేదు.అంతా కలలా అయిపోయింది. వారు బతికిరావాలని కోరుకుంటున్నా..’ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ జిల్లా కేంద్రానికి చెందిన కొక్కుల రఘువంశీ మంగళవారం ఇంటికి చేరుకున్నాక చెప్పిన మాటలు. ఆనాటి ప్రమాదం జరిగిన తీరు అతడి మాటల్లోనే... ‘ఈ నెల 8న ఆదివారం అందరం కలిసి కులుమనాలి వెళ్లడానికి నిర్ణయించుకుని, మధ్యలో బియాస్ నది వద్ద ఆగాం. మొత్తం 49మందిమి కిందికి దిగి గ్రూపులు గ్రూపులుగా అటూ... ఇటూ వెళ్లాం. నది అందంగా కనిపించడంతో సాయంత్రం 6.15గంటల సమయంలో బియాస్‌నదిలోకి ఫొటోలు దిగేందుకు వెళ్లాం. కొందరు ఒకవైపు...మరికొందరు ఇంకోవైపు వెళ్లాం. 20నిమిషాల అనంతరం మేం ఉన్న చోట చిన్నచిన్న రాళ్లు కొంచెంకొంచెం మునుగుతుండడంతో ఎందుకైనా మంచిదని మేం త్వరగా నడుచుకుంటూ ఒడ్డుకు వచ్చాం. మాతోపాటు ఉన్న ఒకరు నీటిలో పడిపోతుంటే పట్టుకుని పైకి లాగాం. మాకు సమీపంలోనే 24 మంది మూడు గ్రూపులుగా విడిపోయి పెద్దపెద్ద రాళ్లు ఎక్కి ఫొటోలు దిగుతున్నరు. నీటి లెవల్ పెరగడంతో వారు ఒడ్డుకు చేరలేకపోయారు. అటూ.. ఇటూ... తిరుగుతూ బయటపడేందుకు ప్రయత్నం చేసి నా.. క్షణాల్లోనే వేగంగా వచ్చిన నీటిలో కొట్టుకుపోయారు. రక్షిద్దామని అరుచుకుంటూ ఒడ్డు వద్దకు కొందరితో కలిసి చేరినం. ఒడ్డు వెంట పరిగెత్తినా కూడా లాభం లేకపోయింది. అంతా మునిగిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. చా లాసేపటి దాకా కోలుకోలేకపోయాం. మాకు తెలిసినవారందరికీ సమాచారం అం దించాం. ప్రమాదం జరిగిన రెండున్నర గంటల తర్వాత పోలీసులు వచ్చారు. చీకటి కావడంతో గాలింపు చేపట్టలేమని ఉదయం చూద్దామని చెప్పి కొందరు సిబ్బందిని అక్కడ ఉంచి వెళ్లిపోయారు. ఉదయం దాకా అక్కడే పడిగాపులు పడ్డాం. తెల్లారి 10 గంటలకు గాలింపు మొదలుపెట్టారు. అప్పటికే నది ఇంకా వేగంగా ప్రవహిస్తోంది. ఒడ్డు వద్ద ఎవరైనా ఉంటారని ఆశగా గాలించినా లాభం లేకపోయింది. అప్పటిదాకా కేరింతలతో ఆనందంగా గడిపిన మిత్రులు గల్లంతయ్యారంటే ఇప్పటికీ నమ్మలేకున్నా... అధికారులు నాతోపాటు 24 మందిని సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. రాత్రి 12 గంటలకు హైదరాబాద్ వచ్చినా... ఆ ఘటన తల్చుకుంటేనే.. చాలా భయంగా అనిపిస్తోంది.’