Shivani Raghuvanshi: మేడ్‌ ఇన్‌ హెవెన్‌.. | Shivani Raghuvanshi Is A Success Story As Made In Heaven | Sakshi
Sakshi News home page

Shivani Raghuvanshi: మేడ్‌ ఇన్‌ హెవెన్‌..

Published Sun, Jul 28 2024 9:11 AM | Last Updated on Sun, Jul 28 2024 9:17 AM

Shivani Raghuvanshi Is A Success Story As Made In Heaven

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌ ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ సిరీస్‌ అనగానే శోభిత ధూళిపాళ సరే.. ఇంకో అమ్మాయి కూడా చటుక్కున గుర్తొస్తుంది. జాజ్‌.. జస్‌ప్రీత్‌గా వీక్షకులను అలరించిన శివానీ రఘువంశీ! తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సంజయ్‌ లీలా భన్సాలీ ‘దేవదాసు’ సినిమా చూసి ముందు డైరెక్టర్‌ కావాలనుకుంది.. తర్వాత అందులోని కథానాయికల భారీ ముస్తాబుకు ముచ్చటపడి సినిమాల్లోకి వెళ్లడమంటూ జరిగితే హీరోయిన్‌గానే అని నిశ్చయించుకుంది. సొంతూరు ఢిల్లీ నుంచి ‘సిటీ ఆఫ్‌ ద డ్రీమ్స్‌’ ముంబైకి ఎలా చేరిందో చూద్దాం..!

  • ‘దేవదాసు’ ఫీవర్‌తో శివానీ.. హీరోయిన్‌ కావాలని కలలు కంటూ చదువును అశ్రద్ధ చేస్తుంటే వాళ్లమ్మ చెవి మెలేసి స్ట్రిక్ట్‌గా వార్న్‌ చేసిందట.. ‘ముందు డిగ్రీ తర్వాతే నీ డ్రీమ్‌’ అని! దాంతో బుద్ధిని చదువు మీదకు మళ్లించింది. అయినా సినిమా  ఆమె మెదడును తొలుస్తూనే ఉండింది.

  • శివానీ డిగ్రీలో ఉన్నప్పుడు..  సినిమా కాస్టింగ్‌ కో ఆర్డినేటర్‌  ఒకరు పరిచయం అయ్యారు. ఆమె కాంటాక్ట్‌ నంబర్‌ తీసుకున్నారు. వారానికే ఓ టీవీ కమర్షియల్‌ కోసం ఆడిషన్స్‌ జరుగుతున్నాయి.. ఆసక్తి ఉంటే అటెండ్‌ అవమని సమాచారమిచ్చారు. వెళ్లింది. అలా ‘వొడా ఫోన్‌’ కమర్షియల్‌తో తొలిసారి స్క్రీన్‌ మీద కనిపించింది. అది ఆమెకు మరిన్ని మోడలింగ్‌ అవకాశాలను తెచ్చిపెట్టింది.

  • టీవీ కమర్షియల్స్‌లో నటిస్తూనే  డిగ్రీ పూర్తి చేసింది. ముందుగానే అమ్మ అనుమతిచ్చేసింది కాబట్టి డిగ్రీ పట్టా పుచ్చుకున్న మరుక్షణమే ముంబై రైలెక్కేసింది.

  • ముంబై చేరితే గానీ తెలియలేదు సినిమా చాన్స్‌ అనుకున్నంత ఈజీ కాదని. ఆ స్ట్రగుల్‌ పడలేక ఎందుకొచ్చిన యాక్టింగ్‌ అనుకుంది. అప్పుడే ‘తిత్లీ’ అనే సినిమాలో హీరోయిన్‌గా సైన్‌ అయింది. కానీ అది తను కోరుకున్నట్టు గ్లామర్‌ రోల్‌ కాదు. పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించలేదు. అందుకే సెట్స్‌ మీద సీరియస్‌నెస్‌ లేకుండా జోకులేస్తూ ఉండసాగింది. ఆమె తీరు ఆ సినిమా డైరెక్టర్‌ కను బహల్‌కి కోపం తెప్పించింది. ‘ఇలాగైతే కెరీర్‌ కొనసాగినట్టే’ అని హెచ్చరించాడు. ఆ సినిమా విడుదలై.. తాను పొందిన గుర్తింపును ఆస్వాదించాక గానీ శివానీకి అర్థంకాలేదు తనకొచ్చిన  చాన్స్‌ ఎంత గొప్పదో అని!

  • అప్పటి నుంచి ఆమె శ్వాస, ధ్యాస అంతా అభినయమే అయింది. ‘అంగ్రేజీ మే కహతే హై’ చిత్రంతో పాటు  ‘జాన్‌ ద జిగర్‌’, ‘జుత్తీ ద షూ’ వంటి షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ నటించింది.

  • ‘తిత్లీ’తో శివానీ క్రిటిక్స్‌ కాంప్లిమెంట్స్‌ అందుకున్నా.. ఫిల్మ్‌ ఫ్రెటర్నిటీ దృష్టిలో పడినా.. ఇంటింటికీ పరిచయం అయింది మాత్రం ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’ జాజ్‌తోనే!  ఆమె ప్రధాన పాత్ర పోషించిన మరో వెబ్‌ సిరీస్‌ ‘మర్డర్‌ ఇన్‌ మాహిమ్‌’ ప్రస్తుతం 
    జీయో సినిమాలో స్ట్రీమ్‌ అవుతోంది.

    గ్లామర్‌ హీరోయిన్‌గా నటించాలనే కల ఇంకా నెరవేరలేదు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా..! – శివానీ రఘువంశీ
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement