
గణేశ్(ఫైల్)
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మండలంలోని తిమ్మాపూర్ తండాకు చెందిన బుక్య గణేశ్(26) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గణేశ్ భార్య లలిత శీత్లా పండుగకు తల్లిగారి ఇల్లయిన నిర్మల్ జిల్లా మామిడ లింగాపూర్‌కు వెళ్లింది. గణేశ్‌ను కూడా రమ్మనగా.. నిరాకరించాడు. తండా శివారులోని వెంకటాద్రి చెరువు పక్కకు వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా గణేశ్ మూడేళ్ల క్రితం దుబాయ్‌వెళ్లి ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చాడు. అక్కడ ఉపాధి లేకపోవడంతో రూ.5 లక్షల అప్పులైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా..? భార్య గొడవైందా..? ఎవరైనా హత్య చేశారా..? అనే కోణం విచారిస్తున్నట్లు మృతదేహాన్ని పరిశీలించిన మెట్‌పల్లి డీఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్పై రాంనాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment