ఈ బుడ్డోడికి హర్భజన్‌ ఫిదా.. | Harbhajan Singh Shares Video Of Young Boy Doing Kick Ups | Sakshi
Sakshi News home page

ఈ బుడ్డోడికి హర్భజన్‌ ఫిదా..

Published Sat, Jul 11 2020 3:36 PM | Last Updated on Sat, Jul 11 2020 3:51 PM

Harbhajan Singh Shares Video Of Young Boy Doing Kick Ups - Sakshi

సాక్షి, ముంబై: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్  మరో అద్భుతమైన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఒక బాలుడు కిక్-అప్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పోస్ట్‌ చేశారు. ఇంత చిన్న వయసులో ఆ చిన్నోడు  బాల్‌ తో ఆడుకున్న తీరుకు ముగ్ధుడై తన అభిమానులతో పంచుకున్నారు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అత్యంత  చురుగ్గా వుంటూ, విభిన్న వీడియోలతో ఆకట్టుకునే భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ఇటీవల రాహుల్ ద్రావిడ్  అద్భుతమైన క్యాచుల వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా తన వీడియోల  పరంపరంలో మరో ఆణిముత్యం లాంటి వీడియోను షేర్‌ చేశారు. ఈ వయసులో నమ్మశక్యంకాని నైపుణ్యమంటూ ఆ బుడ్డోడికి ఫిదా అయిపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement