ప్రాణం తీసిన ఈత సరదా
Published Thu, Nov 3 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
ఆముదాలపల్లిలో యువకుడి మృతి
నిజాంపట్నం: స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్ళి యువకుడు చెరువులో గల్లంతైన సంఘటన నిజాంపట్నం మండలంలోని ఆముదాలపల్లిలోయ చోటు చేసుకుంది. ఆముదాలపల్లికి చెందిన పిల్లిబోయిన గోపి(23) హైదరాబాద్‌లో కానిస్టేబుల్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటూ దీపావళి పండుగకు ఇంటికి వచ్చాడు. ఇద్దరు స్నేహితులు మరకా ఏడుకొండలు, అశోక్‌కుమార్‌లతో కలసి చెరువులో స్నానం చేసేందుకు గురువారం వెళ్ళాడు. స్నేహితులిరువురు ఈతకు చెరువులోకి వెళ్ళగా గోపి స్నానం చేసేందుకు కొంత లోతుకు వెళ్ళాడు. ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఉండటంతో ఒక్కసారిగా గోపి మునిగిపోయాడు. స్నేహితులు గమనించి అతనిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికి కనిపించలేదు. గ్రామస్తులు చెరువులో గాలించగా మృతదేహం సాయంత్రం లభ్యమైంది.
Advertisement
Advertisement