
దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అభిమానుల అత్యుత్యాహం ప్రమాదానికి దారి తీసింది. విజయ్ 50వ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో భాగంగా చెన్నై విజయ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు ఈసీఆర్ శరవణన్ ఫ్యాన్స్ కోసం ఒక ట్రిక్రీ షోను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ షోలో ఓ యువకుడు కిరోసిన్ ఉపయోగించి స్టంట్ చేస్తున్నాడు.
చేతికి మంటలు అంటించుకొని టైల్స్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ కమ్రంలో ప్రమాదం జరిగింది. టైల్స్ పగలగొట్టిన తర్వాత యువకుడి చేతి మంటలు ఆరిపోలేదు. అది కాస్త ఎక్కువై చేయి మొత్తం కాలిపోయింది. ఈవెంట్‌లో పక్కనే ఉన్నవారు త్వరగా స్పందించి.. మంటలు ఆర్పేశారు. అనంతరం అంబులెన్స్‌లో యువకుడిని ఆస్పత్రికి తరలించారు.