
నటుడు విజయ్ మంగళవారం ఉదయం చెన్నైలో అభిమానులతో సమావేశయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వారీసు. తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. కాగా ఇదే సమయంలో కథానాయకుడుగా నటిస్తున్న తుణివు చిత్రం కూడా విడుదల కానుంది.
అభిమానులు పోటీగా భావిస్తున్న సమవుజ్జీలు అయిన ఇద్దరు స్టార్ నటులు నటిస్తున్న భారీ చిత్రాలు ఒకేసారి విడుదల కావడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదీ కాకుండా విజయ్ చిత్రం వారిసు గురించి ఇప్పటికే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ మంగళవారం ఉదయం చెన్నై, పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమానులతో సమావేశమయ్యారు.
ఇందులో అరియలూర్, పెరంబలూర్ మూడు జిల్లాలకు చెందిన అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ వారితో వారిసు చిత్ర విడుదల తదితర అంశాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇదేవిధంగా ఇటీవల మరికొన్ని జిల్లాలకు చెందిన విజయ్ మక్తల్ ఇరుక్కం ముఖ్య నిర్వాహకులతో సమావేశమైన విషయం తెలిసింది.
Actor vijay meets his fans again in chennai panaiyur residence | #Vijay #VijayFansMeet @actorvijay pic.twitter.com/zmTmqxanHO
— Flash Venkat (@flashvenkat7) December 13, 2022