Kollywood Star Hero Vijay Wife Sangeeta Sornalingam Watch Maveeran Amid Divorce Rumours - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay Divorce Rumours: విజయ్- సంగీతపై విడాకుల రూమర్స్.. థియేటర్లో ప్రత్యక్షమైన భార్య!

Published Sat, Jul 15 2023 8:39 AM | Last Updated on Sat, Jul 15 2023 10:33 AM

Kollywood Star Hero Vijay Wife  Sangeeta Sornalingam Watch Maveeran - Sakshi

మావీరన్‌( తెలుగులో మహావీరుడు) చిత్రానికి ఇప్పుడు కొత్తగా పబ్లిసిటీ వచ్చేసింది. నటుడు శివకార్తికేయన్‌, అదితి శంకర్‌ జంటగా నటించిన చిత్రం మావీరన్‌ ఈనెల 14న థియేటర్లలో విడుదలైంది. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి సరిత ముఖ్యపాత్రను పోషించడం విశేషం. చాలా గ్యాప్‌ తర్వాత ఈమె ఇందులో తల్లి పాత్రలో నటించారు . దర్శకుడు మిష్కిన్‌, టాలీవుడ్‌ నటుడు సునీల్‌ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని అరుణ్‌ విశ్వ భారీస్థాయిలో నిర్మించారు. దీన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థ విడుదల చేసింది.

(ఇది చదవండి: స్లిమ్‌ కోసం కసరత్తులు.. హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్!)

అయితే ఈ చిత్రాన్ని తొలి రోజు మొదటి షోను చూడడానికి స్టార్ హీరో విజయ్‌ సతీమణి సంగీత థియేటర్‌కు రావడం విశేషం. ఇటీవల విజయ్‌, సంగీత దంపతుల గురించి పలు రకాల రూమర్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సంగీత విజయ్‌ నిర్వహించిన ఏ కార్యక్రమానికి హాజరుకాలేదు. విజయ్‌ విద్యార్థులకు ప్రోత్సాహకాల అందించిన కార్యక్రమంలో కూడా సంగీత పాల్గొనలేదు. కారణం ఆమె తన బిడ్డల సంరక్షణ బాధ్యతలను కోసం విదేశాల్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. 

అలాంటిది ఒక్కసారిగా శుక్రవారం సంగీత ముఖానికి ముసుగేసుకుని శివకార్తికేయన్‌ నటించిన మావీరన్‌ చిత్రాన్ని చూడ్డానికి చైన్నెలోని ఒక థియేటర్‌కు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె రావడం ఈ చిత్రానికి అదనపు ప్రచారాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. దీంతో విజయ్‌ అభిమానులు ఆనంద పడిపోతున్నారు. కారణం ఇటీవల విజయ్‌ నిర్వహించిన ఏ కార్యక్రమానికి సంగీత హాజరు కాకపోవడంతో పలు రకాల వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరలైన సంగతి తెలిసిందే. కాగా విజయ్‌ తాజాగా నటిస్తున్న లియో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఈ వేడుకల్లో సంగీత కచ్చితంగా పాల్గొంటారనే విశ్వాసాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఓ వైపు విజయ్ అభిమానులు మావీరన్‌పై నెగిటివ్ రివ్యూలు ఇస్తూనే.. మరోవైపు శివకార్తికేయన్‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతలో సంగీత థియేటర్‌లో శివకార్తికేయన్ భార్య ఆర్తితో కలిసి ఆమె చేయి పట్టుకుని చాలా సంతోషంగా మాట్లాడింది. ఈ సినిమా గురించి శివకార్తికేయన్‌ను కూడా అడిగినట్లు కోలీవుడ్‌ సమాచారం.

(ఇది చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్‌ కూతురితోనే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement