ప్రస్తుత రాజకీయాలపై కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శనివారం చెన్నైలో పదో తరగతి, పన్నెండో తరగతి పాసైన విద్యార్థులకు నిర్వహించిన సన్మానం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయపార్టీల పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆలోచనతో ఓటేయాలని ప్రజలను ఆయన కోరాడు. డబ్బుల కోసం ఓట్లను అమ్ముకోవద్దని విద్యార్థులకు సూచించాడు.
#WATCH | Tamil Nadu: Actor Vijay felicitates the top three toppers of Class 10 and 12 board examinations of each constituency of the state, at the RK Convention Center in Chennai pic.twitter.com/R9y69I8R1G
— ANI (@ANI) June 17, 2023
‘రేపటి ఓటర్లు మీరే. మీరు భవిష్యత్ నాయకులను ఎన్నుకుంటారు. ఓట్లను డబ్బులకు అమ్ముకొని మన చేతితో మన కళ్లనే పొడుచుకుంటున్నాం. ఒక రాజకీయ నాయకుడు ఓటుకు రూ.1000 చొప్పున నియోజకవర్గం మొత్తం పంచితే దాదాపు రూ.15 కోట్లు అవుతుంది అనుకుందాం. ఒక వ్యక్తి రూ.15 కోట్లు లంచం ఇస్తే అంతకు ముందు ఎంత సంపాదించి ఉంటాడో ఆలోచించండి!
ఇవన్నీ మీ విద్యా విధానంలో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఓటుకు డబ్బులు తీసుకోవద్దని మీ తల్లిదండ్రులకు వెళ్లి చెబితే మార్పు వస్తుంది’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. రాజకీయాలపై విజయ్ ఈ స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి. రాజకీయాల్లోకి వస్తాడా? లేదా? అనేది నేరుగా చెప్పకుండా విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సన్మాన కార్యక్రమం ‘తలపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్' సంఘం తరపున జరిగింది. ఇది విజయ్ అభిమానుల సంఘం.
Comments
Please login to add a commentAdd a comment