ఆస్పత్రిలో రజినీకాంత్‌.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్! | Kollywood Star Hero Vijay Tweet On Super Star Rajinikanth Admits In Hospital | Sakshi
Sakshi News home page

Vijay: ఆయన కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా: విజయ్

Published Tue, Oct 1 2024 6:47 PM | Last Updated on Tue, Oct 1 2024 7:16 PM

Kollywood Star Hero Vijay Tweet On Super Star Rajinikanth Admits In Hospital

కోలీవుడ్ స్టార్‌, దళపతి విజయ్.. రజినీకాంత్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని విజయ్ ట్వీట్‌ చేశారు. రజినీకాంత్ సార్‌ పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. అియితే అనారోగ్యంతో తలైవా సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చెన్నై అపోలో  వైద్యులు చికిత్స అందించారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని డాక్టర్స్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ ఉందని తెలిపారు. రెండో రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని బులెటిన్‌ విడుదల చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ చిత్రంతో అభిమానులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రజినీకాంత్ సైతం ప్రస్తుతం దసరా బరిలో నిలిచారు. టీజీ జ్ఞానవేల్‌ డైరెక్షన్‌లో ఆయన నటించిన వేట్టైయాన్ ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement