Chennai Apollo Hospital
-
ఆస్పత్రిలో రజినీకాంత్.. కోలుకోవాలంటూ విజయ్ ట్వీట్!
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్.. రజినీకాంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని విజయ్ ట్వీట్ చేశారు. రజినీకాంత్ సార్ పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే ఇంటికి తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. అియితే అనారోగ్యంతో తలైవా సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆయనకు చెన్నై అపోలో వైద్యులు చికిత్స అందించారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని డాక్టర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడ ఉందని తెలిపారు. రెండో రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని బులెటిన్ విడుదల చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ చిత్రంతో అభిమానులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. రజినీకాంత్ సైతం ప్రస్తుతం దసరా బరిలో నిలిచారు. టీజీ జ్ఞానవేల్ డైరెక్షన్లో ఆయన నటించిన వేట్టైయాన్ ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டு குணமடைந்து வரும் சூப்பர் ஸ்டார் திரு. @rajinikanth sir அவர்கள் விரைவில் பூரண உடல்நலத்துடன் வீடு திரும்ப வேண்டும் என்று உளமார இறைவனை வேண்டுகிறேன்.— TVK Vijay (@tvkvijayhq) October 1, 2024 -
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
నెలన్నరగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మానందరెడ్డిసాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొల్లం బ్రహ్మానందరెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆయన త్వరలో కోలుకుంటారని, పూర్వపు ఉత్సాహంతో ప్రజాసేవలో అడుగుపెడతారని బంధువులకు జగన్ ధైర్యం చెప్పారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మాజీ మండలాధ్యక్షుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అయిన బ్రహ్మానందరెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతగా కొనసాగుతున్నారు. ఆరోగ్య సమస్యలతో నెలన్నర రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆయన్ను పరామర్శించారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్దిరెpsrడ్డి మిథున్‌రెడ్డి, వి.వరప్రసాదరావు, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సైతం జగన్ వెంట వెళ్లి బ్రహ్మానందరెడ్డిని పరామర్శించారు. పార్టీ నేత బ్రహ్మానందరెడ్డిని పరామర్శించే నిమిత్తం సోమవారం చెన్నైకి వచ్చిన జగన్మోహన్రెడ్డికి తమిళనాడు జనం బ్రహ్మరథం పట్టారు.నేడు నెల్లూరుకు వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: బాణసంచా యూనిట్ దగ్ధమై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు నెల్లూరుకు వెళుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
జయ ఫిజియోథెరపీకి సింగపూర్ రోబో?
అపోలో ఆసుపత్రికి చేరుకున్న యంత్రం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫిజియోథెరపీ ఇచ్చేందుకు సింగపూర్ నుంచి రోబోను తెప్పించినట్లు సమాచారం. చెన్నై అపోలో ఆసుపత్రిలో 65 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి ప్రకటించారు. మైకు సహాయంతో చిన్నగా మాట్లాడుతున్నారని, 90 శాతం వరకు సహజరీతిలో శ్వాసను తీసుకుంటున్నారని తెలిపారు. ఇక నడవడమే తరువారుుగా పేర్కొన్నారు. ఇందుకోసం కొంత ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అపోలో ఆసుపత్రికి ఒక రోబోను తీసుకువచ్చారు. ఈ రోబో సీఎం జయకు చికిత్స కోసమేనని చెబుతున్నారు. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజిబెత్ ఆసుపత్రి రోబోటిక్ ఫిజియోథెరపీకి ప్రపంచ ప్రసిద్ధి. గతంలో ఇదే ఆసుపత్రి నుంచే ఇద్దరు మహిళా ఫిజియోథెరపిస్టులు సీఎం జయ కోసం సింగపూర్ నుంచి వచ్చారు. జయ ఆప్తురాలు శశికళకు అస్వస్థత! తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళ అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విరామం లేకుండా ఆసుపత్రిలో అమ్మను కనిపెట్టుకుని ఉన్న కారణంగా శశికళ అనారోగ్యం పాలుకాగా ఈనెల 23న ఆమె అపోలోలోనే చేరినట్లు తెలుస్తోంది.