నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
నెలన్నరగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మానందరెడ్డి
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొల్లం బ్రహ్మానందరెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆయన త్వరలో కోలుకుంటారని, పూర్వపు ఉత్సాహంతో ప్రజాసేవలో అడుగుపెడతారని బంధువులకు జగన్ ధైర్యం చెప్పారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మాజీ మండలాధ్యక్షుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ అయిన బ్రహ్మానందరెడ్డి రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతగా కొనసాగుతున్నారు. ఆరోగ్య సమస్యలతో నెలన్నర రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆయన్ను పరామర్శించారు. సుమారు గంటసేపు అక్కడే గడిపారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు పెద్దిరెpsrడ్డి మిథున్‌రెడ్డి, వి.వరప్రసాదరావు, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సైతం జగన్ వెంట వెళ్లి బ్రహ్మానందరెడ్డిని పరామర్శించారు. పార్టీ నేత బ్రహ్మానందరెడ్డిని పరామర్శించే నిమిత్తం సోమవారం చెన్నైకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డికి తమిళనాడు జనం బ్రహ్మరథం పట్టారు.
నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: బాణసంచా యూనిట్ దగ్ధమై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు నెల్లూరుకు వెళుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.