
వైఎస్ కుటుంబ సహకారంతోనే జెడ్పీ చైర్మన్ స్థాయికి..
చక్రాయపేట : వైఎస్ కుటుంబ సహకారంతోనే తాను జెడ్పీ చైర్మన్ స్థాయికి ఎదగానని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గండి క్షేత్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, జెడ్పీటీసీ తాటిగొట్ల శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రూ.2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓహెచ్‌ఎస్‌ఆర్ మంజూరు చేయాలని జెడ్పీ చైర్మన్‌కు ఆలయ చైర్మన్, జెడ్పీటీసీ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, ఏపీ ఆగ్రోస్ మాజీ అధ్యక్షుడు నందారపు చెన్నకృష్ణారెడ్డి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె ఎంపీపీలు మాధవీ బాలకృష్ణ, రమణారెడ్డి, వేముల, కమలాపురం జెడ్పీటీసీలు బయపురెడ్డి, సుమిత్ర రాజశేఖరరెడ్డి, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సంబటూరు ప్రసాదరెడ్డి, ఈశ్వరరెడ్డి, శంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, హరినాథ్, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి