బాలుడిని లైంగికంగా వేధించినందుకు ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ధారావికి చెందిన ఓ మహిళ(20)కు ఓ బాలుడి(17)తో సోషల్ మీడియాతో 2020లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. అతడికి తన లవ్ ప్రపోజ్‌చేసింది. కానీ, బాలుడు ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు.
ఆమె మాత్రం వేరే ఫోన్ నెంబర్లు, ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అతడిని వేధించింది. ఇదిలా ఉండగా.. బాధిత బాలుడు జనవరి 19న ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ, అతడిని కలవాలని ధారవిలోని తన బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. దీంతో ఆ బాలుడు ఆమె ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా తర్వాత కూడా వాషిలోని ఓ లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు బాలుడిని పిలిపించుకొని ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాలుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్లంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
మరోవైపు.. బాలుడి కుటుంబానికి ఆమె మరో షాకిచ్చింది. బాలుడితో పాటు అతని తండ్రి, నలుగురు మేనమామలు, బంధువు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నవీ ముంబై పోలీసులు కేసును ధారవి పోలీసులకు బదిలీ చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని..
Comments
Please login to add a commentAdd a comment