కుటుంబ సభ్యులతో విద్యార్థి రిత్విక్‌శీల
జగదేవ్‌పూర్(గజ్వేల్): వయస్సు 17 కుర్రాడు తోటి విద్యార్థులకు సేవ చేయాలన్న సంకల్పంతో సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వయస్తు చిన్నదైనా మనస్సు మాత్రం పెద్దదే.. మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలకు సేవలందిస్తున్న అమెరికా అబ్బాయిపై ప్రత్యేక కథనం...
కుటుంబ నేపథ్యం
నల్గొండ జిల్లా పట్టణానికి చెందిన శీల శంకరయ్య, ధనలక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. శంకరయ్య నల్గొండలో నాగార్జున డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ తన ముగ్గురు కొడుకులు శ్రీనివాస్, రమేష్, హరినాథ్, కూతురు కరుణశ్రీలను ఉన్నత చదువులు చదివించారు.
ముగ్గురు కొడుకులు మెడిసిన్‌లో స్థిరపడగా, కూతురు కరుణశ్రీ స్టాప్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. శీల శ్రీనివాస్ నల్గొండలో 10 వరకు చదివి, ఇంటర్, డిగ్రీ, మెడిసీన్ హైదరాబాద్‌లో చదివారు. అలాగే కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
శ్రీనివాస్ హైదరాబాద్‌లోనే కొన్నేళ్లపాటు సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించి విధులు నిర్వహించారు. అనంతరం 1990లో శంకరయ్య కుటుంబం మొత్తం అమెరికాకు వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ సివిల్ వదులుకుని డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ అక్కడే స్థిరపడ్డారు.
శ్రీనివాస్, అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు రిత్విక్‌శీల, కృత్విక్ శీల, కూతురు సాన్వి. ముందుగా శ్రీనివాస్ తన తల్లి చదివిన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కోప్పోల్ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపణీ చేయడం ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాలో సేవలు చేయాలన్న లక్ష్యంతో అమెరికాలో తనతో పాటు ముగ్గురితో కలిసి ఓ సంస్థను ఏర్పాటు చేశారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనే పేరు పెట్టి సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా తమకు వచ్చే వేతనంలో కొంత జమా చేయడం మొదలు పెట్టారు.
మొదటి సారిగా తెలంగాణ ప్రాంతంలోని కొప్పోల్ గ్రామంలో ప్రారంభించారు. జగదేవ్‌పూర్ మండలంలోని 52 పాఠశాలల విద్యార్థులకు 2016లో నోట్‌బుక్‌లు అందించారు. ఇండియాలో నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్‌కు తన పెద్దమ్మ కొడుకైనా మధుసూదన్ కొఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.
అమ్మనాన్నల స్ఫూర్తితో...
విద్యార్థి రిత్విక్‌శీల ప్రస్తుతం అమెరికాలో డిగ్రీ చదువుతున్నారు. అయితే తను సేవ చేయడానికి అమ్మనాన్నలే స్ఫూర్తిగా నిలిచారు. గత ఐదేళ్ల క్రితం రిత్విక్ నానమ్మ చదివిన పాఠశాలలో విద్యార్థులకు నాన్న నోట్ పుస్తకాలు ఇవ్వడం చూసాడు.
అప్పుడే నేను కూడా సేవ చేయాలే ఆలోచన వచ్చి, అప్పటి నుంచి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. తోటి విద్యార్థులకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు.
అమ్మనాన్నలు పుట్టి పెరిగిన నేలపై సేవలు చేయాలనే ఉద్ధేశ్యంతోనే నల్గొండ జిల్లాలో ప్రారంభం చేసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, మర్కూక్ మండలాల్లో సేవలు ప్రారంభించారు. మూడేళ్లుగా ఇక్కడి విద్యార్థుల లక్షల రూపాయలు ఖర్చు చేసి వేల నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 35 లక్షల విలువ గల నోట్ పుస్తకాలను 1 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు అందించినట్లు తెలిపారు.
ఆనందం చెప్పలేనిది...
ఈ నెల 14న జగదేవ్‌పూర్‌లోని నోట్ పుస్తకాల పంపిణీకి విద్యార్థి రిత్విక్ శీల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే నోట్ పుస్తకాలు అందించారు. రిత్విక్‌శీలను చూసి విద్యార్థులు సంతోషంలో మునిగితేలారు. రిత్విక్‌తో చేతులు కలిపేందుకు పోటీ పడ్డారు.
బాగా చదివి ఉన్నతస్థాయి శిఖరాలకు చేరుకోవాలని హితబోధ చేశారు. రిత్విక్‌తో పోటీ సెల్ఫీ పోటోలు దిగేందుకు విద్యార్థులు పోటీ పడడం, చేతులు కలపడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందం వెల్లివిరిసింది.
సేవ చేయడంలో సంతృప్తి..
సేవ చేస్తే ఏమొస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ సేవలో ఉన్న సంతృప్తి మరెందులో లేదనిపిస్తుంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. నా ఆశయం వెనుక అమ్మనాన్న ఉన్నారు.
వారి కలను నిజం చేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి గోల్ పెట్టుకుని చదువుకోవాలి. అప్పుడే కన్నవాళ్ల కలలు, మా లక్ష్యం నిజం అవుతుంది. రానున్న రోజుల్లో సేవలను విస్తృత్తం చేస్తాను. – రిత్విక్‌శీల
Comments
Please login to add a commentAdd a comment