సాక్షి, పర్లాకిమిడి(ఒరిస్సా) : సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. స్థానిక రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆగి ఉన్న పాసింజర్ రైలులోని 2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా పర్లాకిమిడి నుంచి రైళ్లు తిరగడం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం పాసింజర్ రైలును స్థానిక స్టేషన్‌లో నిలుపుదల చేశారు. బోగీలు, ఇంజిన్ వేరుచేసి, పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు ఎలక్ట్రికల్ లైన్‌ను సరి చేస్తున్నారు. చదవండి: నా చావుని త్వరగా మర్చిపోయి.. పెళ్లి చేసుకో
అయితే అటుగా వచ్చిన పర్లాకిమిడిలోని గౌరచంద్ర వీధికి చెందిన సూర్యకుమార్ ఎలక్ట్రిక్ ట్రైను బోగి ఎక్కి, సెల్‌ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్‌ను పట్టుకున్నాడు. బోగీలుపై కప్పి ఉన్న గోనె సంచులు తగులుకుని మంటలు చెలరేగి, బోగీలకు వ్యాపించాయి. దీంతో బాలుడు కూడా మంటల్లో చిక్కి, కాలిపోయాడు. అగి్నమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన జీఆర్‌పీ పోలీసులు.. మృతదేహాన్ని కిందికి దించారు.
Comments
Please login to add a commentAdd a comment