Train bogi
-
రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్లో నిందితుని పట్టివేత!
మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం జరిగింది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న బాలికపై రైలులోని బాత్రూమ్లో అత్యాచారం జరిగింది. నిందితుడు బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి యువతి.. కట్నీ నుంచి ఉచెహ్రాకు రైలులో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం నిందితుడు బాత్రూమ్ లోపల దాక్కుని గొళ్లెం పెట్టుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాత్రూం తలుపులు పగులగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒక యువతి కట్నీ నుండి ఉచెహ్రాకు ‘మెము’ రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తోంది. రైలు పకారియా స్టేషన్‌కు చేరుకోగానే ఆ యువతి బాత్రూమ్కి వెళ్లింది. ఈ సమయంలో ఓ యువకుడు బాత్రూంలోకి బలవంతంగా ప్రవేశించాడు. బాత్రూమ్ తలుపును లోపలి నుంచి మూసేశాడు. అనంతరం ఆ యువతిపై దాడిచేసి, అత్యాచారం చేశారు. రైలు సత్నా స్టేషన్‌కు చేరుకోగానే బాధితురాలు కేకలు వేస్తూ బాత్రూమ్ డోరు తెరిచింది. అనంతరం జరిగిన ఘటనపై సత్నా స్టేషన్‌లోని జీఆర్పీకి సమాచారం అందించింది. రైలు తదుపరి స్టేషన్ కీమాలో ఆగింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు కీమా స్టేషన్‌కు చేరుకున్నాయి. వారు రైలులోకి ప్రవేశించగానే, నిందితుడు బాత్రూమ్లోకి వెళ్లి గొళ్లెం పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రైలులో చిరు వ్యాపారం చేస్తుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం సత్నా రైల్వే పోలీసులు నిందితుడిని కట్నీ జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఇది కూడా చదవండి: ‘తండ్రిని చూస్తే వణుకు’... ‘ఆత్మకథ’లో శరద్ పవార్! మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానల్ వీక్షించండి: -
Duvvada Railway Station: శశికళ.. గుండె విలవిల
సాక్షి, తూర్పుగోదావరి: లేకలేక కలిగిన సంతానం ఆ అమ్మాయి. అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలవుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. విధి చిన్నచూపు చూసింది. ఆ అమ్మాయి ప్రాణాలను హరించింది. అనకాపల్లి జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం గుంటూరు – రాయగడ∙ఎక్స్‌ప్రెస్ దిగుతూ జారి పడి, ప్లాట్‌ఫాం – రైలు బోగీ మధ్య ఇరుక్కుపోయి.. గంటన్నర పాటు అంతులేని బాధ పడిన మెరపల శశికళ (22) విశాఖపట్నంలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. శరీరం నలిగిపోయి అంతర్గత రక్తస్రావం కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. ఆమె మృతి సమాచారం తెలియడంతో అన్నవరం వెలంపేటలో విషాద ఛాయలు అలముకొ న్నాయి. ఈ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ మెరపల బాబూరావు, వెంకటలక్ష్మి కుమార్తె శశికళ చిన్నప్పటి నుంచీ చదువులో దిట్ట. బొమ్మలేయడంలో కూడా మంచి ప్రతిభ ప్రదర్శించేది. తుని ఆదిత్యలో బీసీఏ చదివింది. గత నెలలో దువ్వాడ విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంసీఏ కోర్సులో చేరింది. రోజూ అన్నవరం నుంచి దువ్వాడ వరకూ రైలులో వెళ్లి వచ్చేది. ఇలా తిరగడం ఇబ్బందిగా ఉందని, హాస్టల్లో ఉంటానని ఇంట్లో చెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం బయలుదేరి వెళ్లిన శశికళ దువ్వాడలో ట్రైన్ నుంచి జారి పడిపోయింది. కిందకు దిగే ప్రయత్నంలో రైలు కుదుపునకు బోగీ తలుపు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో శశికళ అదుపు తప్పి పడిపోయిందని సమాచారం. ఆమె మృతి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో బంధువులు విశాఖ బయలుదేరారు. తల్లితండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం అనంతరం శశికళ మృతదేహాన్ని గురువారం రాత్రి అన్నవరం తీసుకువచ్చారు. ఆమె మృతదేహాన్ని చూసి, పుట్టెడు దుఃఖంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద పెట్టున విలపించారు. శశికళ మృతికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: (దువ్వాడ రైల్వేస్టేషన్లో గాయపడిన విద్యార్థిని మృతి) -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం
సాక్షి, పర్లాకిమిడి(ఒరిస్సా) : సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. స్థానిక రైల్వేస్టేషన్లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆగి ఉన్న పాసింజర్ రైలులోని 2 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా పర్లాకిమిడి నుంచి రైళ్లు తిరగడం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం పాసింజర్ రైలును స్థానిక స్టేషన్లో నిలుపుదల చేశారు. బోగీలు, ఇంజిన్ వేరుచేసి, పర్లాకిమిడి నుంచి గుణుపురం వరకు ఎలక్ట్రికల్ లైన్‌ను సరి చేస్తున్నారు. చదవండి: నా చావుని త్వరగా మర్చిపోయి.. పెళ్లి చేసుకో అయితే అటుగా వచ్చిన పర్లాకిమిడిలోని గౌరచంద్ర వీధికి చెందిన సూర్యకుమార్ ఎలక్ట్రిక్ ట్రైను బోగి ఎక్కి, సెల్ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ లైన్‌ను పట్టుకున్నాడు. బోగీలుపై కప్పి ఉన్న గోనె సంచులు తగులుకుని మంటలు చెలరేగి, బోగీలకు వ్యాపించాయి. దీంతో బాలుడు కూడా మంటల్లో చిక్కి, కాలిపోయాడు. అగి్నమాపక దళం ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన జీఆర్పీ పోలీసులు.. మృతదేహాన్ని కిందికి దించారు. -
బోగీలే ఐసోలేషన్ వార్డులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లు రద్దు కావడంతో ఆ రైలు బోగీలను కరోనా బాధితులకు చికిత్సనందించే వార్డులుగా రూపొందించాలని ముందుకొచ్చింది. ఇందుకోసం ఒక నమూనా బోగీని కూడా తయారు చేసింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే మరికొద్ది రోజుల్లోనే వారానికి 10 బోగీలు తయారు చేయనున్నట్టు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ వెల్లడించారు. బోగీలను ఐసీయూ కేంద్రాలుగా ఎలా మార్చారంటే ► ఒక కూపేలో ఒకవైపు లోయర్ బెర్త్‌నే మంచం మాదిరి గా రూపొందించి అన్ని బెర్త్‌లను తొలగించారు. ► ఆ బెర్త్ ఎదురుగా రోగుల సామాన్లు, వైద్య పరికరాలు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. ► ప్రతీ కోచ్‌లో ఉండే 4 టాయిలెట్ల స్థానంలో రెండు వాష్‌రూమ్‌లుగా మార్చి ఫ్లోరింగ్ మార్చారు. ప్రతీ బాత్రూమ్లో హ్యాండ్ షవర్, బక్కెట్, మగ్ ఉంచారు. ► ప్రతీ కోచ్‌లోనూ 220 ఓల్టుల ఎలక్ట్రికల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ► బోగీ వెలుపల 415 ఓల్టుల విద్యుత్ సరఫరా. ► బోగీకి 10చొప్పున ఇలా వార్డులు తయారు చేశారు. ► ఇక రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఐసీయూలు, మెడికల్ స్టోర్లు, పాంట్రీలు, అధికారుల కోసం గదులు వంటివి కూడా ఏర్పాటు చేశారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకి కనీసం మూడు పడకలైనా ఉండాలి. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి 0.7 పడకలు ఉన్నట్టుగా అంచనా. -
చిన్నారిని రైలుబోగీ నుంచి తోసేసిన గార్డు
తూర్పుగోదావరి,తుని: రైలు బోగీ నుంచి మూడేళ్ల చిన్నారి బాలుడిని తోసేసిన గార్డుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ ఆదివారం తెలిపారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండపేటకు చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు తలుపులమ్మ దేవ స్థానానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో తుని రైల్వే స్టేషన్లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఖాళీ లేకపోవడంతో వికలాంగ బోగీ ఎక్కారు. అయితే గార్డు ఇది వికలాంగ బోగిఅని, ఎక్క కూడదన్నాడు. దాంతో కిందకు దిగిపోయిన వెంకటేష్ కుటుంబం ప్రయాణికుల రద్దీతో పక్క బోగి ఎక్కలేక ట్రైను కదిలిపోయే పరిస్థితుల్లో అదే వికలాంగబోగీలోకి ఎక్కారు. దాంతో గార్డు విచక్షణ కోల్పోయి వెంకటేష్ మూడేళ్ల కుమారుడిని ప్లాట్‌ఫారంపైకి తోసేశాడు. దాంతో ఆ చిన్నారికి గాయాలయ్యాయి. వెంకటేష్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా రైల్వే పోలీసులు చిన్నారికి రైల్వే ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. -
బోగీల్లో తినుబండారాలు అమ్మితే భారీ ఫైన్
అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఐఆర్సీటీసీ నుంచి అనుమతి పొందిన విక్రయదారులు, నిర్ధారిత సంఖ్యలో ఉండే లెసైన్స్డ్ విక్రయదారులు మినహా మిగిలినవారు ఎవరైనా రైలు బోగిల్లో తినుబండారాలు అమ్ముతూ కనిపిస్తే భారీగా జరిమానా విధించాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఆదేశించారు. అలాగే స్టేషన్లలో కూడా అనుమతి లేని విక్రయదారులను రానీయవద్దని, వస్తే పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులతోపాటు, రైలు బోగీలు, స్టేషన్ పరిసరాలను అపరిశుభ్రంగా మారటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పారు. గురువారం అన్ని డివిజన్ల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. బోగీలు, స్టేషన్ పరిసరాల్లో చెత్త వేసేవారి విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని, టికెట్ లేకుండా ప్రయాణించేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. రైల్వే స్థలాల లీజులు, అద్దెలు, స్టేషన్లలోని దుకాణాల అద్దెలు, ఇతర ఫీజులు, లెవీ తదితరాలను సరిగా వసూలు చేసి రైల్వే ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు.