గాయపడిన చిన్నారి
తూర్పుగోదావరి,తుని: రైలు బోగీ నుంచి మూడేళ్ల చిన్నారి బాలుడిని తోసేసిన గార్డుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ ఆదివారం తెలిపారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండపేటకు చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు తలుపులమ్మ దేవ స్థానానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో తుని రైల్వే స్టేషన్‌లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఖాళీ లేకపోవడంతో వికలాంగ బోగీ ఎక్కారు. అయితే గార్డు ఇది వికలాంగ బోగిఅని, ఎక్క కూడదన్నాడు. దాంతో కిందకు దిగిపోయిన వెంకటేష్ కుటుంబం ప్రయాణికుల రద్దీతో పక్క బోగి ఎక్కలేక ట్రైను కదిలిపోయే పరిస్థితుల్లో అదే వికలాంగబోగీలోకి ఎక్కారు. దాంతో గార్డు విచక్షణ కోల్పోయి వెంకటేష్ మూడేళ్ల కుమారుడిని ప్లాట్‌ఫారంపైకి తోసేశాడు. దాంతో ఆ చిన్నారికి గాయాలయ్యాయి. వెంకటేష్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా రైల్వే పోలీసులు చిన్నారికి రైల్వే ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment