
హాంకాంగ్: డేర్‌డెవిల్ ఇన్‌ఫ్లూయెన్సర్ సోఫియా చుంగ్ (32) సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి మరణించింది. వాటర్‌ఫాల్ అందాలు వీక్షించడానికి శనివారం తన స్నేహితులతో కలిసి హాంకాంగ్‌లోని హాపాక్‌లై అనే పార్క్‌కు వెళ్లిన ఆమె అక్కడి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి జలపాతం అంచున సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా పట్టు తప్పి కింద పడిపోయింది. సుమారు 16 అడుగుల ఎత్తు నుంచి పడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సోఫియాను పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధృవీకరించారు.
కాగా సోఫియా కొండలు, గుట్టలు ఎక్కుతూ ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. డేంజరస్ స్టంట్లు చేయడంతో పాటు వాటి ఫొటోలను ఫాలోవర్లతో పంచుకునేది. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో.. అభిమానులందరికీ మంచి వీకెండ్ ఉండాలని ఆశిస్తూ పెట్టిన ఆఖరి పోస్ట్ వైరల్‌గా మారింది. 'అందరికీ మంచి జరగాలని ఆశించిన నువ్వు ఇప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయావు' అంటూ నెటిజన్లు సోఫియాకు నివాళులు అర్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment