![Indian Student Dies in Australia while Try for Selfie - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2018/05/21/Australia-Ankit-Selfie-Deat.jpg.webp?itok=T_BQJEqr)
కొండపై సెల్పీ దృశ్యం (ఇన్‌సెట్‌లో అంకిత్.. పాత చిత్రం)
మెల్‌బోర్న్: సెల్ఫీ సరదాకి మరో ప్రాణం బలైపోయింది. ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కొండపై సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో కాలు జారి సముద్రంలో పడి మృతి చెందాడు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బెనీ పట్టణంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
20 ఏళ్ల అంకిత్ పెర్త్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. తన ఫ్రెండ్స్‌తో సరదాగా షికారుకు వెళ్లాడు. ఈ ప్రయత్నంలో 40 మీటర్ల ఎత్తైన కొండ రాయిపై సెల్ఫీకి యత్నించి.. జారి సముద్రంలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంట తర్వాత అతని మృతదేహాన్ని బయటకు తీశారు. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, రెండేళ్ల క్రితం మూసివేసినప్పటికీ తరచూ కొందరు అక్కడికి వస్తున్నారని అధికారులు వెల్లడించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment