
బయ్యారం(ఇల్లందు): దీపావళి పండుగ సెలవుల్లో ఇళ్లకు వచ్చారు.. సరదాగా మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు అందాలను తిలకించేందుకు వెళ్లారు. చెరువు అలుగు పోస్తుండగా సెల్‌ఫోన్‌తో ఫొటోలు దిగుతున్నారు.. స్నేహితులిద్దరూ సెల్ఫీ దిగుతున్న క్రమంలో ప్రేమ్‌భరత్ ప్రమాదవశాత్తు నీటిలో పడగా రక్షించేందుకు వెళ్లి జయరాజు నీటిలో గల్లంతయ్యాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో వారి కుటుంబాలతో పాటు స్నేహితులు, బంధువుల్లో పెనువిషాదం నింపింది. పట్టణంలోని నెహ్రూసెంటర్ సమీపంలో నివసించే నాగేళ్ల ప్రేమ్‌భరత్, అదే వీధిలో శ్రావణి మెస్ నిర్వహిస్తున్న జయరాజు బాల్యస్నేహితులు.
ప్రేమ్‌భరత్ కాజీపేటలో డిప్లొమా ప్రథమ సంవత్సరం చదువుతుండగా, జయరాజు మెస్‌ను నిర్వహిస్తున్నాడు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన వారిద్దరూ తమ అక్కలు, తోటి స్నేహితులతో చెరువు వద్దకు వచ్చి నీటిలో గల్లంతయ్యారు. విషయాన్ని తెలుసుకున్న గార్ల ఎస్సై వంశీధర్, మహబూబాబాద్‌కు చెందిన అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికి చీకటి పడటంతో లభ్యం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment