
మెల్‌బోర్న్: భారతీయ విద్యార్థి ఒకరు సెల్ఫీ తీసు కుంటూ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయి చనిపోయిన విషాద ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అంకిత్ అనే 20 ఏళ్ల భారతీయ విద్యార్థి పశ్చిమ ఆస్ట్రేలియాలోని అల్బనీ పట్టణం దగ్గర్లోని ప్రఖ్యాత పర్యాటక సముద్ర తీరం వద్ద ఉన్న రాళ్లపై స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఐదుగురు స్నేహితులతో కలిసి గురువారం అక్కడికి వెళ్లిన అంకిత్, అక్కడి రాళ్లపై ఉత్సాహంగా దూకుతూ ఉన్న సమయంలో, 40 అడుగుల ఎత్తైన రాతి శిఖరం నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment