జంబో సెల్ఫీ ఎంత పని చేసిందంటే...
సాక్షి, భువనేశ్వర్: సెల్ఫీ మోజు మరో వ్యక్తి ఒడిషాలో మరో వ్యక్తి ప్రాణాలు బలిగింది. ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయాడు. రూర్కెలా జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కటక్‌కు చెందిన 30 ఏళ్ల అశోక్ భారతి సుందర్‌ఘడ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక మందియాకుదార్ ప్రాంతంలో రెండు వారాలుగా ఓ ఏనుగు సంచరిస్తుందన్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని తరిమేందుకు రంగంలోకి దిగారు. విషయం తెలిసిన అశోక్ గ్రాస్తులతోపాటు ఆ ఘటనను చూసేందుకు వెళ్లాడు.
ఘటననంతా తన కెమెరాలో బంధించిన అశోక్ చివరకు ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. చిర్రెత్తుకొచ్చిన ఏనుగు అతని వెంటపడి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం అతన్ని రూర్కెలా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని కన్జర్వేటర్ సహయ అధికారి జేకే మహంతి తెలిపారు.