'కోట'లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన | security observes golkonda fort for independance celebrations | Sakshi
Sakshi News home page

'కోట'లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Published Mon, Aug 10 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

security observes golkonda fort for independance celebrations

గోల్కొండ: పంద్రాగస్టు పతాకావిష్కరణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గోల్కొండ కోటకు రానున్న దృష్ట్యా సెక్యూరిటీ విభాగం అధికారులు కోటలో సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదనపు ఎస్పీ నర్సింహ పతాకావిష్కరణ వేదిక స్థలాన్ని, దాని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేదిక ఎదురుగా వీఐపీ, వీవీఐపీల కోసం సీట్లు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితిల్లో సీఎం కేసీఆర్.. గోల్కొండ కోటకు హెలికాప్టర్‌లో రావాలనుకుంటే హెలిప్యాడ్‌కు అనువైన స్థలాలపై కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement