
గోల్కొండ కోటలో పటిష్ఠ భద్రత
స్వాతంత్ర్య దిన వేడుకలకు గోల్కొండ కోటలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నాటి వేడుకలకు 5వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత కల్పించారు. గోల్కొండ కోట లోపల 1200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
మొదటి దశలో సీఆర్పీఎఫ్, ఆక్టోపస్, సీఏఆర్ పోలీసుల బలగాలు, రెండో దశలో తెలంగాణ పోలీసులు ఉంటారు. అదనపు కమిషనర్ అంజనీకుమార్ నేతృత్వంలో డీసీపీ, ఇద్దరు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్‌ఐలు, 20 మంది ఏఎస్‌ఐలతో పాటు 200 సిబ్బందితో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేశారు.