
ఆర్‌బీఐ గవర్నర్ మనసు దోచిన గోల్కొండ
హైదరాబాద్ : హైదరాబాద్ నగర ప్రాశస్త్యాన్ని చాటిచెప్పే చారిత్రక గోల్కొండ కోట అందాలు భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మదిని దోచాయి. రాజన్ శుక్రవారం కుటుంబసమేతంగా కోటను సందర్శించారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోట వద్ద ఏర్పాటు చేసిన 'సౌండ్ అండ్ లైట్ షో'ను తిలకించి మంత్రముగ్దులయ్యారు. 'అద్భుతమైన ప్రదర్శనిది. ఇక్కడ గొప్ప వాతావరణాన్ని సృష్టించారు. మీరు చరిత్రను సజీవంగా ఉంచున్నారు' అంటూ పర్యాటక శాఖను కొనియాడుతూ సందర్శకుల పుస్తకంలో రాజన్ తన సందేశాన్ని రాశారు.