న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర ప్రస్తుతం రాజస్తాన్‌లో కొనసాగుతుంది. ఇంతవరకు రాహుల్ యాత్రలో ఎంతోమంది సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అందులో భాగంగా రాహుల్ భారత్ జోడో యాత్రలో తాజాగా భారత్ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో... ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసేందుకు సాగుతున్న ఈ యాత్రలోకి జాయిన్ అయ్యే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. కాబట్టి మేము తప్పక విజయం సాధిస్తాం అని ట్వీట్ చేశారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్‌తో రఘరామ్ రాజన్ ఏదో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రలో పాల్గొనడంపై బీజీపీ పలు విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన తనను తాను తదుపరి మన్మోహన్ సింగ్‌గా అభివర్ణించుకుంటున్నారని పేర్కొంది. రఘురామ్ రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన్ను అవకాశవాదిగా బీజేపీ నేత అమిత్ మాల్వియా పేర్కొన్నారు.
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్‌లో ముగియునున్న భారత్ జోడో యాత్రలో ఇప్పటి వరకు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్థార్‌లు జాయిన్ అయ్యారు. వారిలో ఉద్యమకారిణి మేధా పాట్కర్, స్వయం-స్టైల్ గాడ్ మాన్ నామ్‌దేవ్ దాస్ త్యాగి (కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందారు), నటి స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఉన్నారు.
Former Governor of RBI, Dr. Raghuram Rajan joined Rahul Gandhi in today’s #BharatJodoYatra pic.twitter.com/BQax4O0KSF
— Darshnii Reddy ✋🏻 (@angrybirddtweet) December 14, 2022
(చదవండి: పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!.. ప్రతిపక్ష నేత ఎంపికపై ఉత్కంఠ)
Comments
Please login to add a commentAdd a comment