2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో ఎన్‌డీఏ మెజారిటీ మార్కును దాటింది. ఎన్డీఏ 288 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 240 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఇండియా అలయన్స్ కూడా మంచి ఫలితాలను రాబడుతోంది. మొదటి రెండు గంటల్లో 211 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్కటే 92+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ప్రారంభ పోకడలు పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని చూపాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
రాజస్థాన్ ట్రెండ్స్ చూస్తుంటే భారీ తిరోగమనం కనిపిస్తోంది. బీజేపీకి పెద్ద దెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ గతసారి బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఈసారి కాంగ్రెస్ ఊహించని రీతిలో దూసుకుపోతూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కంటే ముందుంది.
గతంలో మోదీ హవాతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ దెబ్బతింది. 2014లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019లో 34.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే రాజ్‌సమంద్, జైపూర్, పాలి, అల్వార్ స్థానాలలో బీజేపీ ముందుంది. కరౌలి, బార్మర్, జైపూర్ రూరల్, సవాయ్ మాధోపూర్, టోంక్, భరత్‌పూర్ తదితర స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment