rahul ghandhi
-
మోదీది ‘మ్యాచ్ ఫిక్సింగ్ ’.. రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న 400 లోక్‌సభ సీట్ల గెలుపు నినాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి లోక్‌తత్ర బచావో (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) పేరుతో చేపట్టిన ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపకై ఒత్తిడి పెంచటల చేయకుండా బీజేపీ కనీసం 400 సీట్లు గెలవలేదని అన్నారు. అలా చేయకుండా ఉంటే బీజేపీ కనీసం 180 సీట్లు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. ‘ఐపీల్ మ్యాచ్‌ల్లో అంపైర్లపై ఒత్తిడి పెంచి, ప్లేయర్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లు మ్యాచ్ గెలుస్తారు. దీన్ని క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. రాజకీయాల్లోకూడా అలాగే.. లోక్ సభ ఎన్నికల్లో ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది. అంపైర్లు ప్రధాని మోదీని ఎంచుకుంటారు. ఇద్దరు ప్లేయర్లను మా టీం నుంచి అరెస్ట్ చేస్తారు. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవడానికి ప్రధాని మోదీ, కొంతమంది ధనవంతులు కుట్రతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు’ అని రాహుల్ గాంధీ సెటైర్లు చేశారు. ‘ఇవి సాధారణ ఎన్నికలు కావు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలు. భారీ మద్దతు ఓట్లు వేయకపోతే... వాళ్లు(బీజేపీ) మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మరీ గెలుస్తారు. అప్పడు రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. రాజ్యాంగం అనేది ప్రజల గొంతుక. ఏదోరోజు ఆ రాజ్యాంగం కనుమరుగు చేస్తారు. అప్పడు దేశం కూడా నాశనం అవుతుంది’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పాల్గొన్నారు. -
కచ్చితంగా గౌరవప్రదంగా బదులిస్తారు! సుప్రియా సూలే
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం(ఈసీఐ) షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసింది. దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సులే స్పందించారు. ఈ మేరకు సూలే మాట్లాడుతూ..రాహుల్ గాంధీ గొప్ప పోరాట యోధుడని. ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిజాయితీగా, గౌరప్రదంగా తగిన సమాధానం ఇవ్వగలరని ధీమాగా చెప్పారు. ఇలాంటి వాటికి రాహుల్ భయపడడు. ఎందుకంటే? బీజేపీ అతని కుటుంబం గురించి ఎలా మాట్లాడిందో అందరికీ తెలుసు. అందుకు సంబంధించిన ఎన్నో ఉదాహారణలు ఉన్నాయన్నారు. రాహుల్ తాతా, మహోన్నత వ్యక్తి నెహ్రూ నుంచి ఎవ్వరిని వదలకుండా ఎలా కుటుంబ సభ్యులందర్నీ కించరపరిచారో అందరూ విన్నారు. కాబట్టి రాహుల్ అందుకు కౌంటర్‌గా ఏదైనా మాట్లాడితే.. బీజేపీ ఎందుకు పెడబొబ్బలు పెట్టుకుంటోంది అని మండిపడ్డారు సూలే. అతడి కుటుంబంలోని వ్యక్తులందర్నీ పేరుపేరున అవమానిస్తూ మాట్లాడటం తప్పుగాదా? అని బీజీపీని నిందించారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బయాతులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పనౌటీ, పిక్‌పాకెట్ వంటి పదాలతో అవమానించాడని బీజేపీ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అలాంటి పదాలతో దూషించడం.. ఎన్నికల ప్రవర్తన నియావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘించడమేనని ఈసీఐకి ఫిర్యాదు చేసింది బీజేపి. ఈ నేపథ్యంలోనే ఈసీఐ గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీస్‌లో ఎన్నికల సంఘం(ఈసీఐ) రాహుల్ తనపై వచ్చిన ఆరోపణలకు ఇంకా ఎందుకు స్పందించలేదో వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘనల ఆరోపణలకు ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడానికి గల కారణాలను కుడా వెల్లడించాలని పేర్కొంది. అలాగే రాహుల్‌ని తన వివరణను ఈ నెల 25న 18 గంట్లలోపు సమాధానం ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొంది ఈసీఐ. (చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని..) -
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి!
రాజస్తాన్ ఎన్నికల ప్రచారాలు తుది అంకానికి వచ్చేశాయి. నేటితో పార్టీల ప్రచార ర్యాలీలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తారాస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అల్లర్లకు ఆధ్యం పోశారే గానీ నియత్రించేలా కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. గహ్లోత్ ప్రభుత్వం హయాంలో బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటాయి. గత ఐదేళ్లలో ఛబ్రా, కరౌలీ, భిల్వారా, జోధ్‌పూర్, చిత్తోర్‌గఢ్, నోహర్, వేవాత్, మల్పురా, జైపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లే అందుకు ఉదాహారణ అని ఆరోపించారు. బుల్డోజర్లతో సలాసర్‌లోని రామ్ దర్బార్ని, ఆవుల షెడ్డుని ఎలా కూలదోసిందో చెప్పుకొచ్చారు. అలాగే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కచ్చితంగా విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసంగా చెప్పారు. రాజస్తాన్‌లో తమ పార్టీ ప్రతి మూలన సమూలమైన మార్పు తీసుకువస్తుందని, ముఖ్యంగా నేరాల తీవ్రత తగ్గిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ కూడా చివరి రోజు ర్యాలీలో బీజేపీపై విమర్శల దూకుడును పెంచేశారు. అదాని వంటి ఇష్యులను అస్త్రాలుగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. పైగా ఇరు పార్టీలో పోటాపోటీగా తమ అగ్ర నాయకులను ప్రచార ర్యాలీల బరిలోకి దింపారు. ఇటు బీజేపీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటిని ప్రచారంలోకి దించితే..అటు కాంగ్రెస్ కూడా పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని దింపింది. కాగా, ఈ నెల 25న 200 అసెంబ్లీ స్థానాలున్నా రాజస్తాన్‌లో ఈసారి 199 స్థానాల్లోనూ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. (చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని.) -
ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ సడెన్ ఎంట్రీ! నోటీసులు పంపుతామని వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్‌ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్‌కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్‌లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు. ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలాఉండగా రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. -
రాహుల్ గాంధీ యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్ర ప్రస్తుతం రాజస్తాన్‌లో కొనసాగుతుంది. ఇంతవరకు రాహుల్ యాత్రలో ఎంతోమంది సెలబ్రెటీలు, ప్రముఖులు పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అందులో భాగంగా రాహుల్ భారత్ జోడో యాత్రలో తాజాగా భారత్ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో... ద్వేషానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసేందుకు సాగుతున్న ఈ యాత్రలోకి జాయిన్ అయ్యే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. కాబట్టి మేము తప్పక విజయం సాధిస్తాం అని ట్వీట్ చేశారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రాహుల్‌తో రఘరామ్ రాజన్ ఏదో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ రాహుల్‌గాంధీ చేపట్టిన జోడోయాత్రలో పాల్గొనడంపై బీజీపీ పలు విమర్శలు ఎక్కుపెట్టింది. ఆయన తనను తాను తదుపరి మన్మోహన్ సింగ్‌గా అభివర్ణించుకుంటున్నారని పేర్కొంది. రఘురామ్ రాజన్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన్ను అవకాశవాదిగా బీజేపీ నేత అమిత్ మాల్వియా పేర్కొన్నారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున కాశ్మీర్లో ముగియునున్న భారత్ జోడో యాత్రలో ఇప్పటి వరకు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు, స్థార్లు జాయిన్ అయ్యారు. వారిలో ఉద్యమకారిణి మేధా పాట్కర్, స్వయం-స్టైల్ గాడ్ మాన్ నామ్‌దేవ్ దాస్ త్యాగి (కంప్యూటర్ బాబాగా ప్రసిద్ధి చెందారు), నటి స్వర భాస్కర్, బాక్సర్ విజేందర్ సింగ్ తదితరులు ఉన్నారు. Former Governor of RBI, Dr. Raghuram Rajan joined Rahul Gandhi in today’s #BharatJodoYatra pic.twitter.com/BQax4O0KSF — Darshnii Reddy ✋🏻 (@angrybirddtweet) December 14, 2022 (చదవండి: పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ దూరం!.. ప్రతిపక్ష నేత ఎంపికపై ఉత్కంఠ) -
‘విమర్శిస్తే.. అర్బన్ నక్సల్ ముద్రవేస్తారు’
న్యూఢీల్లీ: బీజేపీ అసమర్థ పాలనను, ద్వేషపూరిత ఎజెండాను విమర్శించినవారిపై అర్బన్ నక్సలైట్ అనే ముద్రవేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ట్విటర్ వేదికగా ఆయన బీజేపీ విధానాలపై విమర్శలు చేశారు. భీమా- కోరెగావ్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసందే. ప్రతిఘటనకు చిహ్నమైన భీమా- కోరెగావ్ యుద్ధ స్మారకం ప్రాముఖ్యాన్ని కేంద్రానికి తొత్తుగా పనిచేసే ఎన్ఐఏ తగ్గించలేదని ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : పోరాట చైతన్య దీప్తి ‘కోరేగావ్’) ఈ కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం పుణె సీనియర్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో కేంద్రం నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శివసేన ప్రభుత్వం భీమా- కోరెగావ్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్తలు, మేధావులపై కేసును ఉపసంహరించుకుంటున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పందించారు. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. -
‘లౌకికత్వం’లో ఇద్దరూ ఇద్దరే!
విశ్వాసం, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజల సంఖ్యాధిక్యతతో అధికారం పొందిన మోదీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా తీర్పులిచ్చారని తాను భావిస్తున్న న్యాయమూర్తులను అనుమాన దృక్పథంతో చూస్తుంటుంది. రాజకీయాల్లో దీనికి భిన్నమైన దాన్ని మనం చూడలేం. బీజేపీ దాని భావజాలానికి సన్నిహితంగా ఉంటున్నవారు దీపావళి పటాసులను కాల్చడంపై కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ కాంగ్రెస్ మాత్రం మౌనం పాటిస్తుంది. ఇలాంటి వైరుధ్యాలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నాయి. మహిళలందరినీ శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతించాలని రాహుల్ చెబుతూంటారు. కానీ, ఆయన పార్టీ వైఖరి మాత్రం భిన్నంగా ఉంటుంది. అయిదేళ్ల క్రితం నా జాతిహితం కాలమ్‌కి ‘వారు వర్సెస్ వీరు’ అనే శీర్షిక పెట్టాను. దాంట్లో భారత్‌లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న కులీనవర్గాల బహిరంగ చర్చలో ఒక కొత్త భిన్నాభిప్రాయ రేఖ చోటుచేసుకున్నట్లు నేను ప్రతిపాదించాను. అదేమిటంటే అధికారం చలాయిస్తున్న వర్గాలు వర్సెస్ పాలక వర్గాలు. అధికారం చలాయిస్తున్న కులీ నులు ఎవరంటే రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, న్యాయవ్యవస్థ, సాంప్రదాయిక మేధావులు, జర్నలిస్టులు, పోలీసులు, సాయుధ బలగాల ఉన్నతాధికారులు. ఇక పాలకవర్గాల కులీనులు అంటే సాంప్రదాయిక వ్యవస్థకు వెలుపల నుంచి ఆర్థికపరంగా ఎదిగి ముందుకొచ్చిన వారు. అంటే కార్పొరేట్లు, ప్రత్యేకించి ఐటీ, బ్యాకింగ్, ఫైనాన్స్ రంగాల నుంచి వచ్చిన కొత్త తరహా వృత్తిజీవులు, మునుపటి తరాలకు చెందిన పాలక కులీనులు, ధార్మిక సంస్థల నిధులతో పనిచేసే కార్యకర్తలు ఈ కోవకు చెందుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే, సాంప్రదాయిక కులీ నులు, నూతన తరహా కులీనులు చాలా తక్కువ ఉమ్మడి లక్షణాలను కలిగి ఉండటమే. వీరు రెండు సార్వభౌమాధికార రిపబ్లిక్ల వంటివారు. వీరు పరస్పరం అనుమానించుకుంటూ, శత్రుపూరితంగా వ్యవహరిస్తుం టారు. అందుకే ఈ లక్షణాన్ని ‘వారు వర్సెస్ వీరు’ అని పిలిచాం. దాదాపు 7 శాతం అభివృద్ధిని చవిచూసిన ఈ అయిదేళ్లలో, నరేంద్రమోదీ విభజన రాజకీయాల వాతావరణంలో మనం ఆ సులభతరమైన సమీకరణం నుంచి ముందుకు వెళ్లిపోయాం. ఈ రెండు కులీనవర్గాలు కూడా దూరాన్ని పాటిస్తూ వచ్చాయి కానీ మార్పుకు గురయ్యాయి. వీటిలో మొదటి రకం కులీనులు తమను తాము కులీనతను దూరం చేసుకునే విషయంలో బాగా శ్రమించారు. రాజకీయవాదులు, బ్యూరోక్రాట్లు మరింత నమ్రతగా, నిగర్వంగా జీవిస్తున్నారు. ఈ మోదీ శకం తరహా వ్యవస్థాపన.. సంస్థాపక నియమ నిబంధనల ప్రకారం కాకుండా ఎక్కువగా వీధుల్లోంచే అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక రెండో తరహా కులీనవర్గం కూడా మార్పులకు గురైంది. ఎందుకంటే మొరటుదనం, అనాగరికత, ఉదారవాద వ్యతిరేకతతోపాటు చివరకు హిందీలో చెప్పుకునే ‘మోటుతత్వం’ వంటి మోదీ–బీజేపీ ప్రభుత్వం శైలి, స్వభావం నుంచి వేరుపడిపోయామని ఇది ప్రధానంగా భావి స్తూనే తమ రక్షిత యుద్ధాల్లోకి మరింత లోతుగా వెళ్లిపోయింది. ఈ రెండు కులీనవర్గాలు కూడా తమ స్థానాలు మార్చుకున్నాయి. కార్పొరేట్లు పాలక వర్గాలనుంచి దూరం జరిగాయి, దాని స్థానంలో ఉన్నత న్యాయాధికార వర్గం వచ్చి చేరింది. ఇక జర్నలిస్ట్–యాక్టివిస్ట్ అనే కొత్తగా ఆవిర్భవించిన వర్గం కూడా పాలకవర్గంలో చేరిపోయింది. ఇది తనదైన యోగ్యతను, పరిమితిని కలిగి ఉంది. మనం ఈ స్వల్ప లేక పరిమితమైన భావనను కాస్సేపు మర్చిపోయి ఈ ఘర్షణను, పెనుగులాటను ‘వారు వర్సెస్ వీరు’ అనే పేరుతో పిలుద్దాం. దీన్నే మనం కన్వారియా మరియు హాలోవెన్ వర్గాల మధ్య జగడంగా పిలుద్దాం. కన్వరియాలు అంటే లక్షలాదిమంది శివభక్తులు. వీరు గంగానది నుంచి పవిత్ర జలాన్ని తీసుకుపోవడానికి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో హరిద్వార్ వైపు వస్తుంటారు. ఇక హాలోవెన్ అంటే అక్టోబర్ 31 రాత్రి వేలాది అమెరికన్ చిన్నారులు దయ్యాలు, భూతాల వేషం ధరించి చేసుకునే వేడుక. ఈ రెండు ప్రజా సమూహాలూ వర్గానికి ప్రతీక. అదే సమయంలో ఇది పరిశుద్ధ పండుగకు ప్రతీక కూడా. ఈ రకం కన్వారియాలను ఎలా నాగరికులను చేస్తామన్నదే నా ప్రశ్న. మన రెండు అసలు సిసలు యుద్ధవీరుల ఆందోళనలు విస్తృతార్థంలో ఒకటే. కానీ వాటిని పరిష్కరించే వైఖరే భిన్నంగా ఉంటుంది. ఒకటేమో తనపైతాను అంటే ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉంటుంది. రెండోది ప్రభుత్వానికి దూరంగా ఉంటుంది. అంటే తన సొంత వనరులకు అంటే, డివైస్‌లు, ప్రైవేట్ డీజెస్ జెన్సెట్లు, బోర్ వెల్స్, ప్రైవేట్ భద్రత, పాఠశాలలు, ఆసుపత్రులు, విమానమార్గాలు, కార్లు వంటివాటికి ఇది పరిమితమై ఉంటుంది. అయితే ఈ రెండు వర్గాలు కూడా సులభంగా చెప్పాలంటే, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, రైల్వేలు, ప్రజా రవాణాలో భాగస్వామ్యం పుచ్చుకోవు. ఇప్పుడు మోదీ అయిదో సంవత్సరం పాలనలో, ప్రభుత్వ వ్యవస్థ మరింత జనరంజకంగా తయారవడమే కాకుండా, తన నియోజకవర్గంలోని మధ్య, దిగువ తరగతులతో నేరుగా సంభాషించేదిగా, ఓట్లు ఉన్న చోట మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూనే ఆర్థిక–మేధోపరమైన కులీనులను ఒక అల్పస్థాయి క్షుద్ర వర్గంగా చూస్తోంది. అంటే తన విమర్శకులందరినీ అది సులువుగానే రాక్షసులుగా, క్రూరులుగా భావిస్తుంది. రాజకీయాల్లో దీనికి భిన్నమైన దాన్ని మీరు చూస్తున్నట్లయితే మీరు అసంతృప్తికి గురవుతారు. ఈ అంశంలో రెండు రకాల ఏకాబిప్రాయం ఉంది. చూడండి. బీజేపీ దాని భావజాలానికి సన్నిహితంగా ఉంటున్నవారు శబరిమలపై, దీపావళి పటాసులను కాల్చడంపై కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. కానీ కాంగ్రెస్ మాత్రం మౌనం పాటిస్తుంది. దీనిలో వైరుధ్యాలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉన్నాయి. మహిళలందరికీ వయసుతో పనిలేకుండా శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతించాలని రాహుల్ గాంధీ చెబుతూంటారు. అదే సమయంలో ఆయన పార్టీ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలోనే రాహుల్ అభిప్రాయాన్ని తోసిపుచ్చడానికి ఆయన పార్టీ సాహసిస్తుంది.ఇక్కడ సమస్య ఏమిటంటే, రాహుల్ మరీ ఆధునికుడు, తన పార్టీ అభిప్రాయాన్ని సొంతం చేసుకోవడానికి సైతం సిగ్గుపడుతుంటారు. కానీ కేరళలో, ప్రతిచోటా హిందూ ఓటర్లలో అధికులు కోర్టు తీర్పులను తమ విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు బాధ వ్యక్తం చేస్తుం టారు. ట్రిపుల్ తలాక్ అంశంపై కూడా రాహుల్, ఆయన పార్టీ ఒకేరకమైన ఉదారవాద అభిప్రాయాన్ని కలిగి లేవు. కానీ బీజేపీ వైఖరి మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. ఇరు పక్షాల్లోనూ పూర్తి ‘సెక్యులర్’గా ఉంటోంది ఈ కపటత్వమే మరి. వామపక్షం మినహా ఇతర లౌకికవాద పార్టీలకు మల్లే కాంగ్రెస్ పార్టీ దీపావళి పటాసులను కాల్చే సమయం విషయంలో మౌనంగా ఉంటూ వస్తోంది. ఇక ఐపీసీ 377 సెక్షన్ విషయంలో అది మూగపోయింది. ఎందుకంటే ఈ పార్టీలకు కూడ తమ ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలుసు. వీరిలో చాలమంది విశ్వాసాలకు ప్రాముఖ్యతనిచ్చే ‘కన్వారియా వర్గాల్లో’నే ఉన్నారు. సమీప భవిష్యత్తులోనే ఈ క్రమాలు ఆగ్రహం, గందరగోళం మధ్య ఐక్యమవుతాయి.ఒకవేళ విశ్వాసం, ఆధ్యాత్మికత అపరిష్కృతమైన తికమకపెట్టే అంశాలైతే జాతీయవాదం మరోటి. ఇవి కొన్ని కోర్టు తీర్పులు వీగిపోయినా, మరికొన్నిటిని ఉపసంహరించుకున్నప్పటికీ కొనసాగుతూనే వుండే సున్నితమైన వ్యంగ్యాస్త్రాలను సంధిస్తాయి. సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శన విషయాన్ని పరిశీలిస్తే అన్ని పార్టీలు మౌనం వహించాయి. తర్వాత కోర్టు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ సినిమాహాళ్లు జాతీయ గీతం ప్రదర్శనను నిలిపివేయలేదు. ఈవిషయమై పెద్ద ఎత్తున ఫిర్యాదులేమీ రాకపోవడమే అందుకు కారణం. మన జాతీయ గీతం కోసం కాసేపు నిలబడటంలో సమస్యేముంటుంది అనేది ఇక్కడ వాదన. ఇదే తర్కాన్ని గోవధ నుంచి నక్సలిజం వరకు అన్వయిస్తారు. అందుకే మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ మౌనం వహించాయి. ఇప్పుడు మోదీ బస్తర్ వెళ్లి కాంగ్రెస్ అర్బన్ నక్సలైట్ల సానుభూతి పార్టీ అని విమర్శిస్తారు. దీనికి ఎలా స్పందించాలో కాంగ్రెస్‌కు తెలియదు. విప్లవం కోసం పనిచేస్తూ ఆయుధాలు చేపట్టనంత కాలం, ప్రజలు ఏదో ఒక భావజాలాన్ని నమ్మొచ్చని కాంగ్రెస్ భావించినా, కన్వారియా బందం దాన్ని పక్కకు నెట్టేస్తుంది. చత్తీస్‌గఢ్‌లోని ఓటర్ల విషయానికి వస్తే కాంగ్రెస్ రాష్త్ర నాయకత్వమంతా నక్సలైట్ల చేతిలో హతమైంది. సాయుధ మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకు పెద్ద ముప్పని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఎవరి ఆకాంక్షలకు మద్దతివ్వాలనే విషయంలో ఇది మేథావులనీ, అధికారంలో వున్నవారినీ ఇరు కున పెడుతుంది. ఇటువంటి సందర్భంలో రాజ్ బబ్బర్ వారిని విప్లవకారులని కీర్తించడాన్ని, గతంలో మావోయిస్టులపై విరుచుకుపడాలనుకున్న చిదంబరాన్ని దిగ్విజయ్ సింగ్ అడ్డుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం తెలియడంతో ఈ వర్గం ఊపందుకుంది. ప్రధాన రాజకీయాలకు, అధికార కేంద్రాలకు వీరు మరింత దూరం వుండాల్సిన అవసరం ఉంది. తీవ్ర ఒత్తిడిలో వున్న నేటి స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. బీజేపీ వారిని శత్రువులుగా చూస్తుంది, కాంగ్రెస్ వారిని బాధ్యు లుగా భావిస్తుంది. వారు, బీజేపీని ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగుగా, మోదీని మీసం లేని హిట్లర్‌గా చూస్తుంది. అలాగే కాంగ్రెస్ నేత తన వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా దేవాలయాల చుట్టూ తిరుగుతుండటంతో ఆ పార్టీని బీజేపీ రాజీపడిన, అయోమయ స్థితిలో వున్న ట్టుగా చూస్తుంది. కేవలం వామపక్ష పార్టీలు మాత్రమే వీటికి దూరంగా వున్నాయి. అందుకే అవి ఇంగ్లీషు మీడియాకు కేంద్రంగా వుండటంతోపాటు ట్విట్టర్, హాలోవీన్ పార్టీలతో హడావిడి చేస్తున్నాయి. గత నెలలో ఈ పార్టీవారు మోదీ, రాహుల్‌లాగే దుస్తులు ధరించడంతోపాటు సోమాలియా దొంగలుగా ముఖాలకు నల్లరంగు పూసుకోగా, ఒకరు గ్రేటర్ నోయిడాగా కూడా హాలోవీన్ పార్టీలకు హాజరయ్యారు. రాఫెల్గా దుస్తులు ధరించడం కూడా కొత్త హాలోవీన్ ఒరవడిగా ముందుకు వస్తుంది. కానీ, కన్వారియాగా రావడానికి మాత్రం ఎవరూ ప్రయత్నించకపోవచ్చు. ఇంతకంటే అప్రతిష్ట ఏముంటుంది? శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
మొదటి విడతగా 30-40 మంది అభ్యర్థుల జాబితా..
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలకు హై కమాండ్ నుంచి పిలుపొచ్చింది. టీ కాంగ్రెస్ ముఖ్యనేతలతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో భేటీ కానున్నారు. కోమటి రెడ్డి సోదరులు, డీకే అరుణతో సహా పలువురు ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకోనున్నారు. గతంలో రాహుల్‌ను కలిసిన సీనియర్లు రాష్ట్ర పరిస్థితులను వివరించారు. పార్టీలో సమన్వయం లోపించిందని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. కొందరు నేతలు టీడీపీ పొత్తు, సీట్ల కేటాయింపుపై పలు అభ్యంతరాలను లేవనెత్తారు. రాహుల్ గాంధీ.. సమన్వయ లోపం, పార్టీలో పెండింగ్‌లో ఉన్న పదవులపై నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. మొదటి విడతగా 30 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. -
రాహుల్ ‘నవ కాంగ్రెస్’ నినాదం
సింగపూర్ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం సింగపూర్‌లో భారత సంతతికి చెందిన సీఈఓలతో భేటీ అయ్యారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు సహా పలు వాణిజ్య అంశాలపై సీఈఓల సమావేశంలో రాహుల్ చర్చించారు. 2012 నుంచి కాంగ్రెస్ పార్టీ పలు ఎదురుదెబ్బలు తిన్నదని..వాటి పరిణామాలను ఇప్పుడు చూస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. తాము ఇప్పుడు పార్టీ ప్రక్షాళనతో ముందుకొచ్చామని నవ కాంగ్రెస్‌తో నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాలక బీజేపీకి శాంతి, సౌభ్రాతృత్వంలపై విశ్వాసం లేదని, కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థను సమన్వయంతో నడిచేలా చూసే బాధ్యత ఉన్నదని చెప్పుకొచ్చారు. గ్రామాల నుంచి నగరాలకు వలసలు ప్రధాన సవాల్‌గా ముందుకొచ్చిందన్నారు. -
‘ఈ మోదీ అండతోనే ఆ మోదీ చెలరేగాడు’
సాక్షి, న్యూఢిల్లీ : వేల కోట్ల స్కామ్‌కు సూత్రధారి, బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ విదేశాలకు చెక్కేశారనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. దేశాన్ని ఎలా లూటీ చేయాలో ఈ సందర్భంగా సూచనలు చేస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోదీని కౌగిలించుకోండి..దావోస్‌లో ఆయనతో కనిపించండి..ఆ బిల్డప్‌తో రూ 12,000 కోట్లు కొట్టేసి, మాల్యా తరహాలో విదేశాలకు చెక్కేయండి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఇదే వ్యవహారంపై మోదీ సర్కార్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. ఈ కుంభకోణంలో బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ జోక్యం లేకుండా నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు దేశం విడిచిపెట్టి వెళ్లారంటే నమ్మగలమా..? అంటూ ప్రశ్నించారు. నీరవ్ మోదీ తమను నిలువునా ముంచేశాడని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసిన ఫిర్యాదుతో సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. బ్యాంకు రుణాలతో నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారా..? అక్రమంగా ఆస్తులు కూడబెట్టారా..? అనే కోణంగా ఈడీ కూపీ లాగుతోంది. -
రాహుల్ గాంధీ.. (యేనా)?
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీయేనా? ఒకవేళ నిజమే అయితే అతను ఎలా ఉంటాడు? తల వెంట్రుకలు ఏ రంగులో ఉంటాయి? కనుగుడ్లు నల్లగా ఉంటాయా లేక బ్రౌన్ కలర్లో ఉంటాయా?.. వెర్రితనానికి పరాకాష్టలా ఏమిటీ వింత ప్రశ్నలు అంటారేమో! మరి ఈ ప్రశ్నలన్నింటికీ సావధానంగా సమాధానాలిచ్చిన రాహుల్ గాంధీ ఏమనుకొని ఉంటారో ఊహించగలమా! ఇంతకీ ఈ ప్రశ్నావళిని రూపొందించింది ఎవరోకాదు.. ఘనత వహించిన ఢిల్లీ పోలీసులు! వ్యక్తిగత కారణాలతో పార్లమెంటుకు సెలవుపెట్టి మరీ విశ్రాంతి తీసుకుంటున్న రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం కొద్దిరోజుల క్రితం ఆయన కార్యాలయంలో కలిసింది. అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితాను రాహుల్ ముందుంచింది. ప్రశ్నలు విని ఒక్కసారిగా అవాక్కయిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. కాసేపటికి తేరుకొని వాటన్నింటికి ఓపికగా సమాధానమిచ్చారట. గతవారం జరిగిన ఈ ఘటనపై స్పందించేందుకు ఢిల్లీ పోలీసు అధికారులు నిరాకరించారు. అసలిలాంటి దర్యాప్తు అవసరం ఏంటన్న మీడియా ప్రశ్నలకు మాత్రం పోలీసులు మౌనాన్నే సమాధానంగా పేర్కొన్నారు. అయితే ఈ ఉదంతంపై కాంగ్రెస్ వర్గాలు మాత్రం అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. పోలీసులు నిర్వహించిన దర్యాప్తును మతిలేని చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్ నాయకుడొకరు ఈ వ్యవహారం వెనక అధికార పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. 'మా నాయకుడు రాహుల్ గాంధీ ఓ ఎంపీ అన్న సంగతి ఢిల్లీ పోలీసులకు తెలియదా? రాహుల్ గురించి ఇంటర్నెట్లో కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అదీ సరిపోదనుకుంటే పార్లమెంటు అధికారుల్ని సంప్రదించాలి కానీ ఇలా కార్యాలయానికి వచ్చి అర్ధంలేని విధంగా ప్రశ్నించడం ఎంతవరకు సబబు?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు మరో కాంగ్రెస్ నేత. కొసమెరుపు ఏమంటే.. ప్రశ్నల పరంపర పూర్తయిన తర్వాత దర్యాప్తు బృందంలోని పోలీసులందరూ రాహుల్ గాంధీతో ఫొటోలు దిగడంతోపాటు, ఆటోగ్రాఫ్ లూ తీసుకున్నారట! రాహుల్ గాంధీను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.