
సింగపూర్ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం సింగపూర్‌లో భారత సంతతికి చెందిన సీఈఓలతో భేటీ అయ్యారు. ఉపాధి కల్పన, పెట్టుబడులు సహా పలు వాణిజ్య అంశాలపై సీఈఓల సమావేశంలో రాహుల్ చర్చించారు. 2012 నుంచి కాంగ్రెస్ పార్టీ పలు ఎదురుదెబ్బలు తిన్నదని..వాటి పరిణామాలను ఇప్పుడు చూస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. తాము ఇప్పుడు పార్టీ ప్రక్షాళనతో ముందుకొచ్చామని నవ కాంగ్రెస్‌తో నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన‍్నారు.
పాలక బీజేపీకి శాంతి, సౌభ్రాతృత్వంలపై విశ్వాసం లేదని, కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థను సమన్వయంతో నడిచేలా చూసే బాధ్యత ఉన్నదని చెప్పుకొచ్చారు. గ్రామాల నుంచి నగరాలకు వలసలు ప్రధాన సవాల్‌గా ముందుకొచ్చిందన్నారు.