సాక్షి, న్యూఢిల్లీ : వేల కోట్ల స్కామ్‌కు సూత్రధారి, బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ విదేశాలకు చెక్కేశారనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. దేశాన్ని ఎలా లూటీ చేయాలో ఈ సందర్భంగా సూచనలు చేస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోదీని కౌగిలించుకోండి..దావోస్‌లో ఆయనతో కనిపించండి..ఆ బిల్డప్‌తో రూ 12,000 కోట్లు కొట్టేసి, మాల్యా తరహాలో విదేశాలకు చెక్కేయండి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
అంతకుముందు ఇదే వ్యవహారంపై మోదీ సర్కార్‌ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. ఈ కుంభకోణంలో బీజేపీ ప్రమేయం ఉందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ జోక్యం లేకుండా నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు దేశం విడిచిపెట్టి వెళ్లారంటే నమ్మగలమా..? అంటూ ప్రశ్నించారు. నీరవ్ మోదీ తమను నిలువునా ముంచేశాడని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేసిన ఫిర్యాదుతో సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. బ్యాంకు రుణాలతో నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారా..? అక్రమంగా ఆస్తులు కూడబెట్టారా..? అనే కోణంగా ఈడీ కూపీ లాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment