
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం(ఈసీఐ) షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసింది. దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సులే స్పందించారు. ఈ మేరకు సూలే మాట్లాడుతూ..రాహుల్ గాంధీ గొప్ప పోరాట యోధుడని. ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిజాయితీగా, గౌరప్రదంగా తగిన సమాధానం ఇవ్వగలరని ధీమాగా చెప్పారు. ఇలాంటి వాటికి రాహుల్ భయపడడు. ఎందుకంటే? బీజేపీ అతని కుటుంబం గురించి ఎలా మాట్లాడిందో అందరికీ తెలుసు.
అందుకు సంబంధించిన ఎన్నో ఉదాహారణలు ఉన్నాయన్నారు. రాహుల్ తాతా, మహోన్నత వ్యక్తి నెహ్రూ నుంచి ఎవ్వరిని వదలకుండా ఎలా కుటుంబ సభ్యులందర్నీ కించరపరిచారో అందరూ విన్నారు. కాబట్టి రాహుల్ అందుకు కౌంటర్‌గా ఏదైనా మాట్లాడితే.. బీజేపీ ఎందుకు పెడబొబ్బలు పెట్టుకుంటోంది అని మండిపడ్డారు సూలే. అతడి కుటుంబంలోని వ్యక్తులందర్నీ పేరుపేరున అవమానిస్తూ మాట్లాడటం తప్పుగాదా? అని బీజీపీని నిందించారు.
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా బయాతులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పనౌటీ, పిక్‌పాకెట్ వంటి పదాలతో అవమానించాడని బీజేపీ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అలాంటి పదాలతో దూషించడం.. ఎన్నికల ప్రవర్తన నియావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘించడమేనని ఈసీఐకి ఫిర్యాదు చేసింది బీజేపి. ఈ నేపథ్యంలోనే ఈసీఐ గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఆ నోటీస్‌లో ఎన్నికల సంఘం(ఈసీఐ) రాహుల్ తనపై వచ్చిన ఆరోపణలకు ఇంకా ఎందుకు స్పందించలేదో వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘనల ఆరోపణలకు ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడానికి గల కారణాలను కుడా వెల్లడించాలని పేర్కొంది. అలాగే రాహుల్‌ని తన వివరణను ఈ నెల 25న 18 గంట్లలోపు సమాధానం ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొంది ఈసీఐ.
(చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని..)
Comments
Please login to add a commentAdd a comment