ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది.
అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్‌కాయిన్‌లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.
అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్‌కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్‌మీట్‌లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్‌లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్‌లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.
కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment