USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. వీసా కోసం పేరెంట్స్‌ ఆవేదన | Indian Student Neelam Shinde In Coma After US Accident | Sakshi
Sakshi News home page

USA: ‘కోమా’లో భారత విద్యార్థి.. వీసా కోసం పేరెంట్స్‌ ఆవేదన

Published Thu, Feb 27 2025 11:24 AM | Last Updated on Thu, Feb 27 2025 11:39 AM

Indian Student Neelam Shinde In Coma After US Accident

వాషింగ్టన్‌: అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే(35) తీవ్రంగా గాయపడింది. అనంతరం, కోమాలోకి వెళ్లడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా లభించడం లేదని నీలం తండ్రి తానాజీ శిందే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే కేంద్రాన్ని కోరారు.

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నీలం షిండే (35) గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ ఏడాదితో చదువు పూర్తి కానుంది. అయితే, ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం కారణంగా బాధితురాలి కాళ్లు, చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో, ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగినట్లుగా తమకు తెలిసిందని తండ్రి తనాజీ షిండే పేర్కొన్నారు. అప్పటి నుంచి అత్యవసర వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా లభించడం లేదన్నారు.

ఈ వీసా విషయం ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే దృష్టికి రావడంతో ఆమె తాజాగా స్పందించారు. వీసా ఇప్పించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరినట్లు తెలిపారు. ఈ సమస్యను త్వరగా కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని, తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement