road accident in america
-
టెక్సాస్‌లో ముగ్గురు కృష్ణా జిల్లా వాసుల మృతి
పామర్రు : అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన తానా బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. దీంతో కురుమద్దాలిలో విషాదఛాయలు నెలకొన్నాయి. కురుమద్దాలి గ్రామానికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల నిమిత్తం 1995లో అమెరికా వెళ్లారు. చదువు అనంతరం అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. పీడియాట్రిక్ కార్డియో వాసు్క్యలర్ సర్జన్, అనస్తీషియాలజిస్ట్‌గా మంచి పేరుపొందారు. ఆయన భార్య వాణిశ్రీ ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్య, రెండో కుమార్తె 11వ తరగతి చదువుతున్నారు. కుమార్తెలు ఆదివారం కళాశాల వద్దకు వెళ్లగా, వాణిశ్రీ కారులో వారిని ఇంటికి తీసుకుని వస్తుండగా టెక్సాస్‌లోని వాలర్ కౌంటీ వద్ద వారి కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాణిశ్రీ, ఆమె ఇద్దరు కుమార్తెలు మరణించారు. భార్యాపిల్లలను కోల్పోవడంతో డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన కురుమద్దాలి గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. డాక్టర్ శ్రీనివాస్ తండ్రి కొడాలి రామ్మోహన్రావు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ టీనేజర్ల మృతి
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఎన్నారై కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోగా తీవ్రంగా గాయపడిన తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపెల్లి రామచంద్రారెడ్డి 20 ఏళ్ల కిందట అమెరికాలో వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయనకి భార్య రజిత, పిల్లలు అక్షరారెడ్డి, ఆర్జిత్రెడ్డిలతో కుటుంబం లాస్ఏంజెలెస్లో నివాసం ఉంటున్నారు. డిసెంబరు 18వ తేదిన స్థానికంగా జరిగిన ఫ్యామిలీ గెట్ టూ గెదర్ పార్టీలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్జిత్‌రెడ్డి ఘటన స్థలిలోనే చనిపోగా అక్షరరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజలు తర్వాత చనిపోయారు. రామచంద్రారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సన్నిహితులు తెలిపారు. ఆటలు, చదువులో ముందుండే ఆర్జిత్, అక్షరల మృతి పట్ల అమెరికన్ ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేశారు. డిసెంబరు 25న స్థానికంగా ఉన్న తెలుగు వారు క్యాండిల్‌లైట్ విజిల్ కార్యక్రమం చేపట్టారు. -
Tesla: ఆటోపైలట్ యాక్సిడెంట్లు... మొదలైన విచారణ
డ్రైవర్ లేకుండా కారు తీసుకొస్తామంటూ ఓ వైపు టెస్లా చెబుతుంటే మరోవైపు ఇప్పటికే టెస్లా కార్లలో ఉన్న ఆటోపైలట్ పనితీరుపై విచారణ మొదలైంది. ఇప్పటి వరకు టెస్లా కార్ల వల్ల జరిగిన ప్రమాదాలు ఎన్ని, జరిగిన నష్టం ఎంత అనే అంశాలపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆటోపైలట్‌పై విచారణ టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌మస్క్ డ్రైవర్ లేకుండా నడిచే కారును తీసుకొస్తామమంటూ తరచుగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు. దీంతో డ్రైవర్ లెస్ కారు, ఆటోపైటల్ టెక్నాలజీపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ డ్రైవర్ లెస్ కారుపై ఎలన్‌మస్క్ రోజుకో అప్డేట్ బయటకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్లా కార్లలో అందుబాటులో ఉన్న ఆటోపైలట్‌పై అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ విచారణ ప్రారంభించింది. ఒకరి మరణం అమెరికాలో 2014 నుంచి ఇప్పటి వరకు టెస్లా అమ్మకాలు జరిపిన 7.65 లక్షల కార్లకు సంబంధించిన డేటాను క్రోడీకరించారు. దీని కోసం 2018 నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మాసాచుసెట్స్, మియామీ, శాన్డియాగోలలో జరిగిన ప్రమాదాల్లో మొత్తం 17 గాయపడగా అందులో ఒకరు మరణించారు. ఇందులో అత్యధిక ప్రమాదాలు రాత్రి వేళలలో జరిగినవే ఉన్నాయి. అంచనా వేయడంలో పొరపాటు? ప్రమాదాలు జరిగినప ప్రదేశాలను పరిశీలించగా ట్రాఫిక్ బోర్డులు, హైవే సూచికలతో పాటు కోన్లు తదితర రక్షణ ఏర్పాట్లు సరిగానే ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాల్లో లైట్ల వెలుతురు కూడా ఎక్కువగా ఉండటాన్ని నమోదు చేశారు. ఈ ప్రమాదాలు జరిగిన సమయంలో సగానికిపైగా కార్లు ఆటోపైలట్ మోడ్‌లోనే ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్లు, హెచ్చరిక బోర్డులను అంచనా వేయడంలో ఆటోపైటల్ వ్యవస్థ వందశాతం సమర్థంగా పని చేయడం లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సహయకారి ఆటోపైలట్ వ్యవస్థ డ్రైవర్‌కు సహాయకారిగా ఉపయోగపడుతుందే తప్ప పూర్తిగా డ్రైవర్ లేకుండా కారును సమర్థంగా నడపలేదని తాము ముందు నుంచే చెబుతున్నామంటోంది టెస్లా. ఎదైనా ప్రమాదాలను, హెచ్చరికలను గుర్తించినప్పుడు డ్రైవర్‌ను అలెర్ట్ చేస్తుందే తప్ప స్వంతగా నిర్ణయాలు తీసుకోదని వెల్లడించింది. అదేవిధంగా డ్రైవర్ లెస్ కార్ల తయారీ అనేది ఇంకా కాన్సెప్టు దశలోనే ఉందంటోంది టెస్లా. -
అమెరికా రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ వాసి మృతి
సాక్షి, అనంతగిరి (వికారాబాద్): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ పట్టణానికి చెందిన నిఖిల్(35) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం గంగారం ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్, హిమజ్యోతి దంపతుల కుమారుడు నిఖిల్ అమెరికాలోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పది రోజుల క్రితం కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వెళ్తుండగా న్యూ మెక్సికో రహదారిలో ఎదురుగా రాంగ్ రూట్ వచ్చిన మరో వాహనం ఇతడి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున ఉదయం నిఖిల్ మృతదేహం వికారాబాద్ చేరుకుంటుందని కుటుంబీకులు తెలిపారు. -
నానీ.. లే తల్లి...నాన్నకు ఫోనెప్పుడు చేస్తావు
నేరేడ్మెట్: ‘నానీ లే తల్లి..బిడ్డా లేమ్మా...నాన్నకు ఫోనెప్పుడు చేస్తావు..తమ్ముడికి ఇక జాగ్రత్తలు ఎవరు చెప్తారు...తాతను పేరుపెట్టి ఎవరు పిలుస్తారమ్మా... గొప్ప దానివవుతావని చెప్పావు..ఇక కనిపించకుండా వెళ్లిపోతున్నావా తల్లీ...మేమేం పాపం చేశాం దేవుడా..మాకు కడుపుకోత మిగిల్చావు’అంటూ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎల్ల చరితారెడ్డి మృతదేహం చూసిన తల్లిదండ్రులు శోభ, చంద్రారెడ్డిలు గుండెలవిసేలా రోదించారు. డిసెంబర్ 27న అమెరికాలోని మిచిగావ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి దుర్మరణం చెందారు. అక్కడ ఆమె గుండె, కాలేయం, మూత్రపిండాలు, నేత్రాలు చావుబతుకుల మధ్య ఉన్న తొమ్మిది మందికి అవయవదానం చేశారు.అనంతరం అమెరికాలో భారతీయ రాయబార కార్యాలయం అనుమతి(ఎన్ఓసీ)తీసుకొని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 8.30గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చరితారెడ్డి మృతదేహం తెచ్చారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, చరితారెడ్డి బంధువులు, పలువురు కార్పొరేటర్లు ఎయిర్పోర్ట్ వద్దకు చేరుకొని, సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంబులెన్స్‌లో ఉదయం 11గంటలకు నేరేడ్మెట్ రేణుకానగర్‌లోని ఆమె ఇంటికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు,కుటుంబీకులు భోరున విలపించారు. నేరేడ్మెట్ భరణి కాలనీలోని శ్మశాన వాటికలో తండ్రి చంద్రారెడ్డి కుమార్తె చితికి నిప్పంటించి అంతిమ క్రియలు చేశారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సుమతీమోహన్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య, వివిధ పార్టీల నాయకులు,కార్పొరేటర్లు, సన్నిహితులు చరితారెడ్డికి నివాళులర్పించారు. -
అమెరికాలో ఇద్దరు భారత విద్యార్ధుల మృతి
వాషింగ్టన్ : అమెరికాలోని టెనెస్సీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత విద్యార్ధులు మరణించారు. థ్యాంక్స్ గివింగ్ డే రోజు జరిగిన ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్ యజమాని పోలీసులకు లొంగిపోయాడని అధికారులు వెల్లడించారు. మరణించిన ఇద్దరు విద్యార్ధులు టెన్నెస్సీ స్టేట్ యూనివర్సిటీలో ఫుడ్ సైన్స్ అభ్యసిస్తున్న జుడీ స్టాన్లీ (23) వైభవ్ గోపిశెట్టి (26)లుగా గుర్తించారు. దక్షిణ నాష్‌విలేలో నవంబర్ 28 రాత్రి నిస్సాన్ సెంట్రాలో వెళుతున్న వీరిద్దరినీ ట్రక్ ఢీకొనడంతో మరణించారని స్ధానిక పోలీసులు తెలిపారు. స్టాన్లీ ఫుడ్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తుండగా, గోపిశెట్టి పీహెచ్డీ చేస్తున్నారని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. వీరిద్దరి మరణం వర్సిటీలో విషాదం నింపిందని ఇది దురదృష్టకర ఘటన అని అధికారులు ఓ ప్రకటలో తెలిపారు. ప్రమాదానికి కారణమైన పికప్ ట్రక్ ఓనర్ డేవిడ్ టోర్స్‌పై లుక్అవుట్ నోటీస్ జారీకాగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరోవైపు ఇండియాలో జరిగే వీరిద్దరి అంత్యక్రియలకు వర్సిటీ విద్యార్ధులు గోఫండ్ మీ ద్వారా విరాళాలు సేకరించారు. ఎన్నో కలలతో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వీరి అకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని పలువురు ప్రవాస భారతీయులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అమెరికాలో పాతబస్తీ యువకుడి మృతి
డబీర్‌ఫురా: అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో పాతబస్తీలోని డబీర్‌పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కాలిఫోర్నియా ప్రీమాంట్‌లోని వాల్నట్ ఏవ్‌లో నివాసముంటున్న సయ్యద్ వసీం అలీ (27) ఆదివారం తాను ప్రయాణిస్తున్న కారు అవెన్యూ కూడలి వద్ద మరో కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సయ్యద్ వసీం అలీ తీవ్ర గాయాలకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు వసీం అలీ కుటుంబ సభ్యులు విదేశాంగ వ్యవహరాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్‌ను కలిసి సయ్యద్ వసీం అలీ మృతదేహన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
యూస్‌లో హైదరాబాద్‌వాసి దుర్మరణం
హైదరాబాద్: అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించి కలల కొలువులో చేరేందుకు సిద్ధమవుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం కేరీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన గొంగళ్ల సాహిత్‌రెడ్డి (25) దుర్మరణం పాలయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు వాకింగ్ కోసం బయలుదేరిన సాహిత్‌రెడ్డిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఢీ కొట్టిన వ్యక్తి తిరిగి రెండు గంటల తరువాత ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి చూడగా అప్పటికే సాహిత్‌రెడ్డి మృతి చెందాడు. దీంతో అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ప్రమాద సమయంలో సాహిత్‌రెడ్డి వద్ద ఐడీకార్డులేవీ లేకపొవడంతో స్థానిక పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా పేర్కొంటూ పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు రోజులుగా దోరకని ఆచూకి.. వాకింగ్ కోసం వెళ్లిన సాహిత్‌రెడ్డి శనివారం సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అతనితో కలసి ఉంటున్న మిత్రులు ఆందోళన చెందారు. దీనికితోడు ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే సాహిత్‌రెడ్డి చివరిసారిగా 11వ తేదీన వారితో మాట్లాడటం, 12వ తేదీన కుమారునికి తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో వారు స్నేహితులను సంప్రదించారు. అప్పటికే రెండు రోజులుగా అతని ఆచూకీ తెలియలేదని వారు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనిపై అతని స్నేహితులు పోలీసులను ఆశ్రయించగా మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని పోలీసులు చూపడంతో అది సాహిత్రెడ్డిదేనని వారు గుర్తించారు. ఉద్యోగంలో చేరాల్సి ఉండగా... నల్లకుంటలోని పద్మాకాలనీకి చెందిన బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి మధుసూధన్‌రెడ్డి, లక్ష్మీరెడ్డిల పెద్ద కుమారుడైన సాహిత్‌రెడ్డి నారాయణగూడలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో పదవ తరగతి వరకు చదివి ఇంటర్ ఫిడ్జ్‌లో, ఇంజనీరింగ్‌ను సీబీఐటీలో పూర్తి చేశాడు. 2016 అగష్టులో ఎంఎస్ కోర్సు కోసం అమెరికా వెళ్లాడు. కనెక్టికట్ రాష్ట్రంలోని సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేశాక ఉద్యోగ అన్వేషణలో విజయం సాధించాడు. ఉత్తర కరోలినీలోని కేరీలో ఉన్న హెచ్‌సీఎల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సోమవారం ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండగా శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందడం అందరినీ కలచి వేసింది. 18లోగా నగరానికి భౌతికకాయం... సాహిత్‌రెడ్డి భౌతికకాయం నగరానికి శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ముందుగా సాహిత్‌రెడ్డి డెత్ సర్టిఫికెట్ తీసుకొని న్యూజెర్సీలోని హిందూ ఫ్యూనరల్ హోంలో సమర్పించాల్సి ఉంటుందని డాక్యుమెంటేషన్ పూర్తయ్యాక బాడీ నగరానికి బయలుదేరుతుందని తెలిసింది. మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని కలిసిన సాహిత్‌రెడ్డి బంధువులు... సాహిత్ భౌతికకాయాన్ని త్వరగా నగరానికి తరలించేలా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాయాలని కోరారు. తలసాని పరామర్శ... నగరంలోని పద్మాకాలనీలో ఉంటున్న సాహిత్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ భౌతికకా యాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరం గా అన్ని చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే అమెరికాలోని తెలంగాణ ఎన్నారై కమిటీతో మా ట్లాడామని, అక్కడి భారత రాయబార కార్యాలయంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి
-
అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి
నార్త్‌కరోలినా : అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లకుంటలోని పద్మ కాలానికి చెందిన బొంగుల సాహిత్ రెడ్డి ఎమ్ఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. అతడి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృత దేహాన్ని ఇక్కడికి తరలించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని సాహిత్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : అమెరికాలో తెలుగు యువకుడు మృతి -
ఎంతపనాయే కొడుకా..!
బెల్లంపల్లి: కుమారుడికి మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో అమెరికా పంపించారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ఆ కుమారుడు సైతం బాగానే చదువుకుంటున్నాడు. సుమారు నాలుగేళ్లుగా అక్కడే విద్యాబోధన చేస్తున్నాడు. త్వరలో మంచి ఉద్యోగం సాధిస్తాడని, ఇక తమ కష్టాలు తీరుతాయని తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. కానీ.. వారి ఆనందం అంతలోనే ఆవిరి అయ్యింది. ఉన్నత చదువుల కోసం అందనంత దూరం వెళ్లి.. అక్కడి నుంచే అటే ఈ లోకాన్నే విడిచాడన్న వార్త వారిని శోక‘సంద్రం’లో ముంచింది. సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లిన ఆ యువకుడు అక్కడే ఈత కొట్టేందుకు సముద్రంలోకి దిగి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన బెల్లంపల్లిలోని అతడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయ్యో కొడుకా.. ఎంత పనాయే అంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరమూ కావడం లేదు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి అశోక్‌నగర్‌బస్తీకి చెందిన రెడ్డి రాజం, మాలతి దంపతుల చిన్న కుమారుడు శ్రావణ్ (27) అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం రిచ్మండ్లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. హైదరాబాద్‌లో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రావణ్ అమెరికాలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్) చేయడానికి 2014లో వెళ్లాడు. 2016లోనే ఎంఎస్ పూర్తి చేసినా.. డబుల్ ఎంఎస్ కోసం అక్కడే ఉండిపోయాడు. ఈస్టర్ సందర్భంగా ఈనెల 19న (భారత కాలమాన ప్రకారం 20వ తేదీ) స్నేహితులతో కలిసి ఫ్లోరిడా ప్రాంతంలోని డెస్టిన్ బీచ్‌కు వెళ్లాడు. సరదా కోసం సముద్రంలో దిగగా.. అలల వేగానికి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించకపోవడంతో అక్కడి పోలీసులు శ్రావణ్ గల్లంతైనట్లు ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్‌చేసి శ్రావణ్ చనిపోయినట్లు నిర్ధారించారు. అదే చివరి ఫోన్‌కాల్.. రాజం రెండో కొడుకు రవికుమార్ వరంగల్‌లో ఇరిగేషన్ శాఖలో డీఈగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె సాత్విక పుట్టినరోజు కావడంతో రాజం, మాలతి మూడురోజుల క్రితం వరంగల్‌కు వెళ్లారు. శ్రావణ్ తన తల్లిదండ్రులతో ఆదివారం ఉదయం ఫోన్లో మాట్లాడాడు. యోగా క్షేమాలు తెలుసుకున్నాడు. కొన్ని గంటల వ్యవధిలోనే శ్రావణ్ విగతజీవి అయ్యాడన్న వార్త విని పించగానే.. వారి శోకానికి అంతులేకుండా పోయింది. శ్రావణ్ మృతిచెందాడన్న వార్తతో అశోక్‌నగర్‌లో తీవ్రవిషాదఛాయలు అలుముకున్నాయి. మూడురోజుల తరువాతే చివరిచూపు శ్రావణ్ మృతదేహం బెల్లంపల్లికి చేరుకోవడానికి మరోమూడు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా లీగల్ వ్యవహారాలు పూర్తయ్యాకే శవాన్ని భారత్‌కు పంపనున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని అక్కడి ఆస్పత్రిలో భద్రపర్చి ఉంచినట్లు సమాచారం. కొడుకు మృతదేహం కోసం ఆతల్లిదండ్రలు, కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. -
అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం
బాపట్ల: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన బాలినేని మాధురి (39) దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మాధురి కుటుంబం11 ఏళ్ల క్రితమే ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. భారత కాలమాన ప్రకారం నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఒకాలా పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందగా..భర్త చేబ్రోలు త్రివిక్రమ్‌కు గాయాలయ్యాయి. వినాయకచవితికి ఇంటికి వస్తామని చెప్పిన తన కుమార్తె విగతజీవిగా మారిందంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మాధురి మృతితో బాపట్లలోని వివేకానంద కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. మాధవి, త్రివిక్రమ్ ఇద్దరూ ఫార్మాసిష్టులుగా పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.