అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం | Telugu woman died in road accident in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం

Published Fri, Sep 11 2015 9:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం

అమెరికాలో గుంటూరు మహిళ దుర్మరణం

బాపట్ల: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  గుంటూరుకు చెందిన బాలినేని మాధురి (39) దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన మాధురి కుటుంబం11 ఏళ్ల క్రితమే ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. భారత కాలమాన ప్రకారం నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఒకాలా పట్టణంలో  ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందగా..భర్త చేబ్రోలు త్రివిక్రమ్‌కు గాయాలయ్యాయి.

వినాయకచవితికి ఇంటికి వస్తామని చెప్పిన తన కుమార్తె విగతజీవిగా మారిందంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. మాధురి మృతితో బాపట్లలోని వివేకానంద కాలనీలో  విషాద ఛాయలు అలముకున్నాయి. మాధవి, త్రివిక్రమ్ ఇద్దరూ ఫార్మాసిష్టులుగా పనిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement