చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్‌ | Donald Trump Speech In Florida After Results In US Presidential Elections 2024, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Trump Florida Speech Video: చరిత్రలో లేని గెలుపు.. ఫలితాలపై స్పందించిన ట్రంప్‌

Nov 6 2024 1:08 PM | Updated on Nov 6 2024 1:55 PM

Trump Speech In Florida After Results In US Elections

ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్‌ 6) ట్రంప్‌ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్‌ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్‌..ట్రంప్‌ నినాదాలతో హోరెత్తించారు. 

తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్‌ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్‌ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.

‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి జేడీ వాన్స్‌, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్‌ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్‌ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్‌ గుర్తు చేశారు. ట్రంప్‌ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్‌ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్‌ కూడా ఉన్నారు.

 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement