అత్యల్పకాలంలో రెండో అత్యున్నత పదవి స్థాయికి ఎదిగిన జేడీ వాన్స్
అత్యంత స్వల్పకాలంలో రాజకీయ పదవీ నిచ్చెనను చకచకా ఎక్కేసి ఉపాధ్యక్షుడిగా అవతరించిన జేడీ వాన్స్ ప్రస్థానం ఆసక్తికరం. ఒకప్పుడు ట్రంప్‌ను హిట్లర్ అంటూ బహిరంగంగా విమర్శించిన వాన్స్‌ను ఇప్పుడు అదే ట్రంప్ పిలిచి మరీ తనకు సహసారథిగా ఎంపికచేయడం విశేషం. ఓహియో నుంచి సెనేటర్‌గా ఉన్న వాన్స్ ఉపాధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న అతిపిన్నవయసు్కల్లో ఒకరిగా, అత్యల్ప పాలనాఅనుభవం ఉన్న నేతగా రికార్డ్ సృష్టించారు. గతంలో తన జీవితంలో చూసిన సంఘటనల సమాహారంగా 2016లో రాసిన ‘హిల్‌బెల్లీ ఎలిగే’పుస్తకం విశేష ఆదరణ పొందటంతో వాన్స్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ రచనను తర్వాత సినిమాగా తీశారు.
⇒ జేడీ వాన్స్ పూర్తిపేరు జేమ్స్ డొనాల్డ్ బౌమాన్
⇒ స్కాచ్–ఐరిష్ మూలాలున్న వాన్స్ 1984 ఆగస్ట్ రెండో తేదీన ఓహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. అందుకే తండ్రి వారసత్వంగా వచి్చన బౌమాన్ పేరును తీసేసుకుని అమ్మమ్మ వాన్స్ పేరును తగిలించుకున్నారు.
⇒ పేదరికం కారణంగా 17 ఏళ్ల వయసులో ఒక సరకుల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేశాడు. 2003లో అమెరికా మెరైన్ కార్ప్స్‌లో చేరి మిలటరీ జర్నలిస్ట్‌గా పనిచేశాడు. 2005లో ఇరాక్‌లో అమెరికా సైన్యం సహాయక విభాగంలో పనిచేశారు.
⇒ ఓహియో వర్సిటీలో చదువుకున్నారు. యేల్ వర్సిటీలో లా పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా న్యాయసేవల సంస్థలో పనిచేశారు. తర్వాత ఒక జడ్జి వద్ద లా క్లర్క్‌గా కొనసాగారు. తర్వాత టెక్నాలజీ రంగంలో వెంచర్ క్యాపిటలిస్ట్ అవతారమెత్తారు. తర్వాత న్యాయసేవల సంస్థనూ స్థాపించారు.
⇒ తొలిసారిగా షెరాడ్ బ్రౌన్‌పై సెనేట్ ఎన్నికల్లో పోటీకి ప్రయతి్నంచినా కుదర్లేదు. 2016లో ట్రంప్‌ను ‘అమెరికా హిట్లర్’అని సంబోధించి పలు విమర్శలు చేశారు. తర్వాత ట్రంప్‌కు సారీ కూడా చెప్పారు. తర్వాత 2021లో రాజకీయాల్లోకి వచ్చారు.
⇒ 2022లో సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ రేయాన్‌ను ఓడించి తొలిసారిగా ఓహియో సెనేటర్ అయ్యారు. తర్వాత ట్రంప్‌కు విధేయునిగా మారారు. దీంతో తన రన్నింగ్‌మేట్‌గా వాన్స్‌ను ట్రంప్ ఎన్నుకున్నారు.
⇒ మొదట్లో ట్రంప్ కంటే ముందు వాన్స్‌కే అధ్యక్ష అభ్యరి్థత్వం విషయంలో మద్దతు పలకాలని వ్యాపారవేత్తలు ఎలాన్ మస్‌్క, డేవిడ్ ఓ సాక్స్‌లు భావించారని గతంలో వార్తలొచ్చాయి. యేల్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన ఉషను పెళ్లాడారు.
⇒ శ్వేతజాతి కార్మికుల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడే వాన్స్ విదేశాంగ విధానంలో చైనాకు బద్ద వ్యతిరేకిగా పేరుంది. ట్రంప్ పేరులోనూ వాన్స్ పేరులోనూ డొనాల్డ్ అనే పేరు ఉండటం గమనార్హం. – వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment