Republican
-
‘హిట్లర్’ చేతే శెభాష్ అనిపించుకుని..
అత్యంత స్వల్పకాలంలో రాజకీయ పదవీ నిచ్చెనను చకచకా ఎక్కేసి ఉపాధ్యక్షుడిగా అవతరించిన జేడీ వాన్స్ ప్రస్థానం ఆసక్తికరం. ఒకప్పుడు ట్రంప్‌ను హిట్లర్ అంటూ బహిరంగంగా విమర్శించిన వాన్స్‌ను ఇప్పుడు అదే ట్రంప్ పిలిచి మరీ తనకు సహసారథిగా ఎంపికచేయడం విశేషం. ఓహియో నుంచి సెనేటర్‌గా ఉన్న వాన్స్ ఉపాధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న అతిపిన్నవయసు్కల్లో ఒకరిగా, అత్యల్ప పాలనాఅనుభవం ఉన్న నేతగా రికార్డ్ సృష్టించారు. గతంలో తన జీవితంలో చూసిన సంఘటనల సమాహారంగా 2016లో రాసిన ‘హిల్బెల్లీ ఎలిగే’పుస్తకం విశేష ఆదరణ పొందటంతో వాన్స్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ రచనను తర్వాత సినిమాగా తీశారు. ⇒ జేడీ వాన్స్ పూర్తిపేరు జేమ్స్ డొనాల్డ్ బౌమాన్ ⇒ స్కాచ్–ఐరిష్ మూలాలున్న వాన్స్ 1984 ఆగస్ట్ రెండో తేదీన ఓహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. అందుకే తండ్రి వారసత్వంగా వచి్చన బౌమాన్ పేరును తీసేసుకుని అమ్మమ్మ వాన్స్ పేరును తగిలించుకున్నారు. ⇒ పేదరికం కారణంగా 17 ఏళ్ల వయసులో ఒక సరకుల దుకాణంలో క్యాషియర్‌గా పనిచేశాడు. 2003లో అమెరికా మెరైన్ కార్ప్స్లో చేరి మిలటరీ జర్నలిస్ట్‌గా పనిచేశాడు. 2005లో ఇరాక్‌లో అమెరికా సైన్యం సహాయక విభాగంలో పనిచేశారు. ⇒ ఓహియో వర్సిటీలో చదువుకున్నారు. యేల్ వర్సిటీలో లా పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా న్యాయసేవల సంస్థలో పనిచేశారు. తర్వాత ఒక జడ్జి వద్ద లా క్లర్క్‌గా కొనసాగారు. తర్వాత టెక్నాలజీ రంగంలో వెంచర్ క్యాపిటలిస్ట్ అవతారమెత్తారు. తర్వాత న్యాయసేవల సంస్థనూ స్థాపించారు. ⇒ తొలిసారిగా షెరాడ్ బ్రౌన్పై సెనేట్ ఎన్నికల్లో పోటీకి ప్రయతి్నంచినా కుదర్లేదు. 2016లో ట్రంప్‌ను ‘అమెరికా హిట్లర్’అని సంబోధించి పలు విమర్శలు చేశారు. తర్వాత ట్రంప్‌కు సారీ కూడా చెప్పారు. తర్వాత 2021లో రాజకీయాల్లోకి వచ్చారు. ⇒ 2022లో సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ రేయాన్‌ను ఓడించి తొలిసారిగా ఓహియో సెనేటర్ అయ్యారు. తర్వాత ట్రంప్‌కు విధేయునిగా మారారు. దీంతో తన రన్నింగ్మేట్గా వాన్స్‌ను ట్రంప్ ఎన్నుకున్నారు. ⇒ మొదట్లో ట్రంప్ కంటే ముందు వాన్స్‌కే అధ్యక్ష అభ్యరి్థత్వం విషయంలో మద్దతు పలకాలని వ్యాపారవేత్తలు ఎలాన్ మస్‌్క, డేవిడ్ ఓ సాక్స్‌లు భావించారని గతంలో వార్తలొచ్చాయి. యేల్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన ఉషను పెళ్లాడారు. ⇒ శ్వేతజాతి కార్మికుల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడే వాన్స్ విదేశాంగ విధానంలో చైనాకు బద్ద వ్యతిరేకిగా పేరుంది. ట్రంప్ పేరులోనూ వాన్స్ పేరులోనూ డొనాల్డ్ అనే పేరు ఉండటం గమనార్హం. – వాషింగ్టన్ -
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి?
అగ్రరాజ్యం అమెరికాలో మరో తెలుగమ్మాయి ఉషా చిలుకూరి అరుదైన ఘనతను సాధించనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్, డెమోక్రటిక్‌లు తలపడనున్నాయి. ఈ తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ ఖారారు కాగా..వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా ఒహాయో రిపబ్లికన్ సెనేటర్, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎంపికయ్యారు. మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ వేదికగా ట్రంప్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా జేడీ వాన్స్‌ను ప్రకటించారు.జేడీ వాన్స్ భార్యే ఉషా చిలుకూరి వాన్స్. ఈ ఎన్నికల్లో వాన్స్ గెలిస్తే అమెరికాకి ఉషా చిలుకూరి సెకండ్ లేడీ (రెండో మహిళ)గా చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా ఉషా చిలుకూరి ఎవరు? ఆమె తల్లిదండ్రులు, భర్త జేడీ వాన్స్ ఎవరు? అనే వివరాల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.ఎవరీ ఉషా చిలుకూరి? న్యూయార్క్ టైమ్స్ ప్రకారం..అమెరికాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన న్యాయవాది ఉషా చిలుకూరి. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామమని తెలుస్తోంది. సుధీర్ఘకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లారు. ఉషా శాన్ డియాగో,కాలిఫోర్నియాలో పెరిగారు.ఉషా చిలుకూరి ఏం చదువుకున్నారు?ఉషా చిలుకూరి శాన్ డియాగో, కాలిఫోర్నియాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.ఆమె లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో చదివారు.ఆధునిక చరిత్ర ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీలో బీఏ హిస్టరీ పూర్తి చేశారు.ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలో డిగ్రీ చదివారు.యేల్ యూనివర్సిటీలో చదివే సమయంలో యేలే లా జర్నల్,టెక్నాలజీ విభాగానికి ఎగ్జిక్యూటీవ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా, మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు.అదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టులో కేసుల్ని ఎలా వాదించాలి? కేసులో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి?కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాల్ని కోర్టులో సబ్మిట్ చేయాలనే అంశాలపై అమెరికా లా యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన సుప్రీం కోర్టు లాయర్లతో సుప్రీం కోర్టు అడ్వకేసీ క్లినిక్ అనే కోర్సును అందిస్తాయి. ఆ కోర్స్‌లో మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్ అండ్ ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్ట్‌పై పని చేశారు. ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు2013లో యేల్ యూనివర్సిటీ లా కాలేజీలో ఉషా చిలుకూరి జేడీ వాన్స్‌ను తొలిసారి కలుసుకున్నారు. లా కాలేజీలో జరిగిన ‘సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా’ అనే సబ్జెట్‌పై జరిగిన డిస్కషన్ గ్రూప్‌లో ఉషా, వాన్స్‌లు కలిసి పనిచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అప్పుడే వారి పరిచయం ప్రేమగా మారింది. ఇరుకుటుంబసభ్యుల అంగీకారంతో ఉషా చిలుకూరి, జేడీ వాన్స్‌లు ఒక్కటయ్యారు. వారిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగింది.జేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలుజేడీ వాన్స్,ఉష దంపతులకు ముగ్గురు పిల్లలు.ఇవాన్,వివేక్ ఇద్దరు కుమారులు కాగా కుమార్తె మిరాబెల్.ప్రముఖ న్యాయవాదిగాకాలికేస్తే మెడకి,మెడకేస్తే కాలికేసే సివిల్ లిటిగేషన్ల పరిష్కారంలో ఆమె దిట్ట. ఉషా 2018లో అమెరికా సుప్రీం కోర్ట్‌కు లా క్లర్క్‌గా పని చేయడం కంటే ముందు 2015 నుండి 2017 వరకు శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ ఈలోని ముంగేర్, టోల్లెస్ అండ్ ఓల్సన్ ఎల్ఎల్పీలో న్యాయవాదిగా పనిచేశారు. రాజకీయాల్లో జేడీ వాన్స్వాన్స్ రాజకీయాల కంటే ప్రముఖ వ్యాపార వేత్తగా, ఇన్వెస్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. 2016లో రాజకీయాల్లోకి వచ్చిన వాన్స్.. 2022లో ఓహియో నుంచి అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను తీవ్రంగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై విమర్శలు గుప్పిస్తూ..ఆయనను ఇడియట్, అమెరికా హిట్లర్ అంటూ విమర్శలు గుప్పించారు. చివరకు ఆయనకు వీరవిధేయుల్లో ఒక్కరిగా మారారు. పుస్తకం కాస్త.. సినిమాగాఇక వాన్స్ తనలోని రాజకీయ నాయకుడితో పాటు మంచి రచయిత ఉన్నాడంటూ ‘హిల్‌బిల్లీ ఎలెజీ’తో నిరూపించారు. హిల్‌బిల్లీ ఎలెజీ పుస్తకం ద్వారా సంక్షోభంలో ఉన్నశ్వేతజాతి అమెరికన్ల సంస్కృతి, ఉద్వేగం, వ్యక్తిగతం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. వాన్స్ తన జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన సంఘటనలు, అనుభవాల్ని వివరించారు. పేదరికం, వ్యసనం, అస్థిరతతో అతని కుటుంబం, పోషణ కోసం పోరాటాలు, చివరికి తన ప్రయాణం ఎలా సాగిందో వివరించారు. ఆ పుస్తకం ఎక్కువగా అమ్ముడు పోవడంతో అది సినిమాగా తెరక్కిక్కింది. 2020లో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించారు. ట్రంప్‌ను అమెరికా అధ్యక్షుడిని చేసిన వాన్స్అంతేకాదు ఈ పుస్తకం ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహదం చేసింది. ముఖ్యంగా ట్రంప్ ప్రచారంలో తన సందేశాన్ని బలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద తెల్లజాతి, అమెరికా ఉద్యోగుల ఓటర్లను ఆకర్షించేలా, తనవైపుకు తిప్పుకునేందుకు సహకరించింది. మధ్య అమెరికాలో సాంస్కృతిక, ఆర్థిక అంశాలను లోతుగా విశ్లేషించేందుకు ఉపయోగపడింది. కాగా, 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంలో ఈ ఓటర్లే కీలకమయ్యారు. జనవరి 6, 2021లో అమెరికా క్యాపిటల్ భవంతిపై ట్రంప్ మద్దతుదారులు జరిపిన దాడిలో ఈయన కీలక పాత్ర పోషించడం గమనార్హం.జేడీ వాన్స్ విజయంలో ఉషా తన భర్త జేడీ వాన్స్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.తరచూ రాజకీయ కార్యక్రమాలకు అతనికి దిశానిర్ధేశం ఇస్తూ మద్దతుగా నిలిచారు. ఆమె 2016,2022లో సెనేట్ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రచారం చేశారు. సెనేటర్ అంటే అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని కలిపి వారు అమెరికన్ కాంగ్రెస్‌గా పిలుచుకుంటారు. ప్రతినిధుల సభ బిల్లులను రూపొందిస్తే ఆ చట్టాలను సెనేట్ ఆమోదించవచ్చు లేదా నిరోధించవచ్చు. -
ఆయనకు అభినందనలా.. ఇదేం పని ట్రంపూ!
న్యూయార్క్ : రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలుపడంపై ఇటు సొంత పార్టీలోనూ, అటు విపక్షాలనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పుతిన్‌కు ట్రంప్ అభినందనలు తెలుపడాన్ని సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. సిగ్గుపడాల్సిన రీతిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నియంతలను అభినందనలు తెలుపడం సరైంది కాదని, ఇలా చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు స్వేచ్ఛాయుత ప్రపంచానికి నాయకత్వం వహించజాలడని ఆరిజోనా రిపబ్లికన్ సెనేటర్ జాన్ మెక్కెయిన్ అన్నారు. సెనేటర్ జెఫ్ ఫ్లేక్, కెంటకీకి చెందిన సెనేట్ మెజారిటీ లీడర్ మిట్చ్ మెక్‌కన్నెల్ కూడా ట్రంప్ తీరును తప్పుబట్టారు. పుతిన్‌కు ట్రంప్ అభినందనలు తెలుపడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తం కావడానికి కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకొని.. ట్రంప్‌కు అనుకూలంగా పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తనకు అత్యంత మిత్రదేశమైన బ్రిటన్‌లో ఒక గూఢచారిపై రష్యా విష రసాయన దాడి జరుపడంతో.. ఆ దేశంపై అమెరికా మండిపడింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ట్రంప్ యంత్రాంగమే ప్రకటనలు చేసింది. ఇక రష్యా ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా జరగలేదని అమెరికా అంటోంది. ఈ విమర్శలు, వివాదాలు ఎలా ఉన్నా.. పుతిన్‌ను బహిరంగంగా అభినందించడంలో ట్రంప్ ఏమాత్రం జంకకపోవడం.. ఆయన విమర్శకులను సైతం విస్మయ పరుస్తోంది. -
ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ!
అలబామా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి డౌగ్ జోన్స్ విజయం సాధించారు. గత 25 ఏళ్లుగా అధికార రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉన్న అలబామాలో డెమొక్రాట్లు విజయం సాధించడం ఇదే తొలిసారి. ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రిపబ్లికన్ అభ్యర్థి రాయ్ మూర్‌ను ఓడించి.. డౌగ్ జోన్స్ విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి మూర్ ససేమిరా అంటుండటం గమనార్హం. హోరాహోరీ పోరు..! సంప్రదాయవాద ఓటర్లు అధికంగా ఉన్న అలబామాలో గత 25 ఏళ్లలో ఒక డెమొక్రాట్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడ తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అయితే, ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రాయ్ మూర్కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు ఆరోపణలు వెలుగుచూడటం, బాలికలపై ఆయన లైంగిక వేధింపులు పాల్పడ్డట్టు కథనాలు రావడం రిపబ్లికన్లను కుదిపేసింది. ఈ క్రమంలో ఉదారవాద డెమొక్రాట్లకు బ్లాక్ ఓటర్ల అండ లభించడంతో డౌగ్ జోన్స్ విజయం సాధించినట్టు భావిస్తున్నారు. అలబామాలో డెమొక్రాట్ విజయం.. డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ విజయంతో అమెరికా సెనెట్ పెద్దలసభ (అప్పర్ చాంబర్)లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ 51-49కి తగ్గిపోయింది. వచ్చే ఎడాది జరగనున్న కాంగ్రెషనల్ ఎన్నికల్లో పెద్దలసభలో రిపబ్లికన్లు మెజారిటీ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. అధ్యక్షుడు ట్రంప్ అజెండా అమలుకు సెనెట్ ఆమోదం లభించడం కష్టమే. -
వారి చూపు ట్రంప్ వైపే!
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని శ్వేతజాతీయులు అక్కడ పెరిగిపోతున్న విభిన్న జాతుల కల్చర్ పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఉన్నటువంటి భయాలు రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు లాభం చేకూరుస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైకాలజిస్ట్ బ్రెండా మేజర్ నిర్వహించిన పరిశీలనలో తేలింది. మల్టీ కల్చరల్ విధానం పట్ల అమెరికన్లంతా సంతృప్తిగా లేరని, ఇలాంటి వారు ట్రంప్‌వైపు చూస్తున్నారని ఆమె తెలిపారు. శ్వేతజాతీయులు చాలా వరకు జాతి విభిన్నతను ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారని ఆమె వెల్లడించారు. ట్రంప్ మొదటి నుంచీ చెబుతున్న మాటలు, చేస్తున్న వాగ్దానాలు ఇలాంటి వర్గాలకు చేరువచేసేలా ఉన్నాయి. ముస్లింలను దేశంలోకి రానివ్వొద్దు అని చెప్పడం, మెక్సికో సరిహద్దులో గోడకడతాననడం, విదేశీయులు అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని పదేపదే చెప్పడం లాంటి యాంటి ఇమ్మిగ్రెంట్ విధానాలతో ట్రంప్ శ్వేతజాతి సాంప్రదాయవాదులకు చేరువయ్యారు. -
మంచినీళ్లలా ప్రచార ఖర్చు
వాషింగ్టన్/డెలవేర్: అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు వెదజల్లుతున్నారు.ప్రచారం, ఉద్యోగుల కోసం మంచినీళ్లలా డబ్బు ఖర్చుపెడుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నెల వ్యవధిలో ప్రచార ఖర్చును రెండింతలు చేశారు. ప్రచార ఖర్చు, నిధుల సేకరణలో మాత్రం హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. సెప్టెంబర్‌లో ట్రంప్ రూ. 477 కోట్లు ఖర్చుపెట్టారు. సెప్టెంబర్ నెల ముగిసేసరికి తన వద్ద రూ. 236 కోట్లు ఉన్నాయంటూ ట్రంప్ ఎన్నికల సంఘానికి తెలిపారు. ఆగస్టులో ట్రంప్ రూ. 284 కోట్ల నిధుల్ని సేకరించారు. ట్రంప్ ప్రచారం శిబిరంలో 350 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ సెప్టెంబర్ నెలలో ఏకంగా రూ. 561 కోట్లు ఖర్చుచేశారు. సెప్టెంబర్ ముగిసేనాటికి తన వద్ద రూ. 406 కోట్లు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో హిల్లరీ రూ. 501 కోట్ల నిధులు సేకరించారు. ఆమె 800 మందికి జీతాలు చెల్లిస్తున్నారు. ఆగస్టులో ఆమె 337 కోట్లు ఖర్చుపెట్టగా రూ. 404 కోట్ల నిధులు సేకరించారు. ఫలితాన్ని సవాల్ చేసే హక్కుంది: ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తాను గెలిస్తేనే ఫలితాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తానని ట్రంప్ చెప్పారు. ‘ఎన్నికల ఫలితం ప్రశ్నార్థకమైనప్పుడు దానిని సవాల్ చేసే హక్కు తనకు ఉంటుందన్నారు. అక్రమ వలసదారులు డ్రైవింగ్ లెసైన్స్ కలిగివుంటే ఎన్నికల్లో ఓటు వే యొచ్చని హిల్లరీ శిబిరం పేర్కొన్నట్లు వికీలీక్స్ చెప్తోందన్నారు. ట్రంప్‌పై ఆగని ఆరోపణలు 18 ఏళ్ల క్రితం ట్రంప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ యోగా శిక్ష కురాలు కరెనా వర్జినియా ఆరోపించారు. 1998లో యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ స్టేడియం వెలుపల తనను గట్టిగా లాగి ఛాతిపై చేయి వేశాడన్నారు. -
రిపబ్లికన్ వైపు భారత ఓటర్లు!
డెమోక్రటిక్ ఓటు బ్యాంకుకు దెబ్బ ట్రంప్ బృందం అంచనా వాషింగ్టన్: ‘హిందువులకు నేను పెద్ద అభిమాని’నంటూ ఇటీవల ర్యాలీలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ చేసిన ప్రసంగం... డెమోక్రటిక్ పార్టీకున్న బలమైన సంప్రదాయ భారత సంతతి ఓటు బ్యాంకును దెబ్బ కొట్టినట్టు రిపబ్లికన్ పార్టీ భావిస్తోంది. వీరంతా క్రమంగా రిపబ్లికన్ల వైపు మొగ్గుతున్నట్టు ఆ పార్టీ భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఉండకపోయినా... భవిష్యత్తులో భారత సంతతి వారు తమ ఓటు బ్యాంకుగా మారతారన్న అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయిలో భారతీయ అమెరికన్లు ఇటీవల న్యూజెర్సీలో నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించడం తెలిసిందే. హిల్లరీ నేర సంస్థ నడిపిస్తున్నారు: ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ‘నేర సంస్థ’ నడిపిస్తున్నారని, ఎన్నికల్లో తనను ఓడించడానికి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశం, ప్రజల భద్రతను ఫణంగా పెట్టిందని, దానికి అమెరికా ప్రభుత్వం కూడా సహకరిస్తోందన్నారు. -
ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అగ్రపీఠాన్ని వరించబోయేది ఎవరా.. అని ఓటర్లలో తెగ ఉత్కంఠ నెలకొంటోంది. జాతీయ పోల్ సర్వేల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు వెల్లడవుతోంది. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై స్వల్పంగా 4 పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ కొనసాగుతున్నారని తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ పోల్ పేర్కొంది. తగ్గాపోరుగా ఈ ఇద్దరి నేతలు అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాతీయ పోల్స్ అన్నింటిలో కూడా హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో ఉన్నట్టు వెల్లడైంది. తాజా పోల్ సర్వేలో ఆధిక్య పాయింట్లను హిల్లరీ కోల్పోయినప్పటికీ, 4 పాయింట్లతో ముందంజలోనే ఉన్నారని ప్యూ సర్వే తెలిపింది. ఒకవేళ అమెరికాకు నేడే ఎన్నికలు జరిగితే 41 శాతం మంది రిజిస్ట్రర్ ఓటర్లు హిల్లరీకే మద్దతు పలుకుతారని ప్యూ సర్వేలో వెల్లడైంది. 37 శాతం ట్రంప్‌కు మొగ్గుచూపుతున్నట్టు సర్వే తెలిపింది. ఈ ఏడాది మొదటి వరకు చాలామంది ఓటర్లు అమెరికా అభ్యర్థిత్వానికి క్లింటన్ లేదా ట్రంప్‌ల్లో ఎవరు సరియైన వారో పోల్చుకోవడంలో సందిగ్థతలో ఉండేవారని.. ప్రస్తుతం క్లారిటీతో ఓటర్ల అభిప్రాయాలు వెల్లడవుతున్నట్టు సర్వే వివరించింది. కేవలం 27 శాతం మందే ట్రంప్‌ను అమెరికాకు గ్రేట్ ప్రెసిడెంట్‌గా అభివర్ణిస్తుంటే.. దానికి డబుల్ శాతం మంది అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ట్రంప్‌ను పోల్చుతున్నారని సర్వే తెలిపింది. 15 శాతం మంది ట్రంప్..యావరేజ్ ప్రెసిడెంటని చెబుతున్నట్టు పేర్కొంది. ట్రంప్ కంటే ఆధిక్యంలో గ్రేట్ ప్రెసిడెంట్‌గా హిల్లరీనే ఓటర్ల మన్ననలను పొందుతున్నారని.. 31 శాతం మంది హిల్లరీ గ్రేట్ ప్రెసిడెంట్ అంటూ తెగ పొగిడేస్తున్నారట. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు 9-16 మద్యలో 2,010 మందితో(1,567 రిజిస్ట్రర్ ఓటర్లు కలిపి) ప్యూ రీసెర్చ్ ఈ తాజా సర్వే నిర్వహించింది. . -
'ట్రంప్ అప్పుడు కూడా స్వలాభం కోసమే'
ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై సీనియర్ డెమోక్రటిక్ నాయకుడు క్రోలీ విరుచుకుపడ్డారు. అత్యంత దారుణమైన 9/11 దాడుల సమయంలోనూ ట్రంప్ తన బిజినెస్ గురించి మాత్రమే ఆలోచించాడని క్రోలీ ఆరోపించారు. దాడి జరిగిన అనంతరం నెలలు, సంవత్సరాల వరకు అసలు ట్రంప్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. దాడిలో తన ప్రాపర్టీస్ ప్రభావితం కాలేదని ట్రంప్ భావించాడని ఆయన విమర్శించారు. 9/11 దాడుల అనంతరం హిల్లరీ క్లింటన్ బాధితుల సహాయానికి కృషి చేసిన విషయాన్ని ఆయన ప్రస్థావించారు. అమెరికాపై దాడి జరిగిన సమయంలో అందరూ దానిని ఒక దుర్దినంగా భావిస్తున్న సమయంలో.. ట్రంప్ మాత్రం దానిని వ్యాపారపరంగానే చూశారని క్రోలీ ఆరోపించారు. -
క్యాంపెయిన్ మేనేజర్‌ను తొలగించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్... తన ప్రచార కార్యక్రమాల నిర్వాహకుడు(క్యాంపెయిన్ మేనేజర్) కోరే లెవాండోస్కిని బాధ్యతల నుంచి తొలగించారు. ‘లెవాండోస్కి చేసిన కృషికి , అతని అంకిత భావానికి కృతజ్ఞతలు. ఇకపై అతను మా బృందానికి సేవలు అందించరు’ అని ట్రంప్ బృందం అధికార ప్రతినిధి హోప్ హిక్స్ చెప్పారు. జాతీయ మీడియా సభ్యులతో లెవాండోస్కికి విరోధం ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ముఖ్య వ్యూహకర్త పాల్ మనఫోర్ట్తో కూడా లెవాండోస్కికి విభేదాలున్నాయి. -
'ట్రిగ్గర్ సరిగా నొక్కితే.. చైనా పని చెప్తా'
పిట్స్బర్గ్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద ఉత్తమ దుర్వినియోగురాలు అని ఆరోపించారు. అమెరికాలో తమ దేశానికి సంబంధించిన వస్తువులన్నింటిని కుమ్మరిస్తూ అమెరికా కంపెనీలో చైనాలో వ్యాపారం చేసేందుకు వెళితే భారీ మొత్తంలో పన్నులు విధిస్తోందని ఆయన మండిపడ్డారు. చైనాకు మెక్సికో చిరురూపం అని ఎద్దేవా చేశారు. పిట్స్ బర్గ్ లో ఆయన తన పార్టీ మద్దతుదారులు నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను స్వేచ్ఛా వ్యాపారాన్ని సమర్థిస్తానని, అయితే, అది అనుకూలంగా ఉండాలే తప్ప దోచుకునేలా ఉండకూడదని అన్నారు. అవతలి వ్యక్తి ఏమనుకున్నా సరే తాను మాత్రం ఉత్తమ ఒప్పందాలు చేసుకొని, ఉత్తమ వ్యాపారాలు చేస్తానని చెప్పారు. చైనా ఉక్కునంతా అమెరికా కుమ్మరించడం తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. ఎందుకంటే చైనా అలా చేస్తూ తమ మేథోసంపత్తిని దోచుకుంటుందని ఆరోపించారు. వచ్చే నవంబర్ లో అమెరికా ప్రజలు సరైన ట్రిగ్గర్ (ఎన్నికల బటన్) నొక్కితే, ఎలాంటి తమాషా జరుగుతుందో చూస్తారని అన్నారు. చైనాతో మంచి సంబంధాలు ఏర్పరుస్తానని, అమెరికాకు మేలును చేకూర్చే వాణిజ్యం చేస్తానని అన్నారు. చైనాకు ఒబామా అంటే గౌరవం లేదని, హిల్లరీని కూడా పెద్దగా పట్టించుకోదని, కానీ, తానంటో వారికి తెలుసని అన్నారు. వారితో ఉత్తమ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తానని చెప్పారు. గతంలో కూడా చైనా తమ దేశాన్ని ఆర్థికపరంగా రేప్ చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల చైనా కూడా ట్రంప్ ముఖ చిత్రంతో కూడిన టాయిలెట్ పేపర్లు తయారు చేసి విక్రయించిన విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
హిల్లరీ, ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందంజలో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన కీలకమైన విస్కాన్సిన్ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో హిల్లరీ, ట్రంప్ ప్రత్యర్థులు బెర్నీ సాండర్స్, టెడ్ క్రూజ్ ఘన విజయాలు సాధించారు. తద్వారా రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో దూసుకుపోతున్న ట్రంప్, హిల్లరీలకు గట్టి సందేశమే పంపారు. అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తాము తప్పుకోలేదనే విషయాన్ని చాటారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇప్పటివరకు ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు టెక్సాస్ సెనేటర్ అయిన క్రూజ్ గట్టి దెబ్బ కొట్టారు. కెనడా సరిహద్దుల్లో ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రైమరీ రేసులో క్రూజ్ 49శాతం ఓట్లు సాధించి ముందంజలో ఉండగా.. ట్రంప్ కేవలం 35శాతం ఓట్లు మాత్రమే సాధించాడు. ఈ రేసులో ఉన్న మరో పోటీదారు ఓహి గవర్నర్ జాన్ కసిష్ 14శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. తాజా ప్రైమరీ ఫలితాలు.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం తహతహలాడుతున్న ట్రంప్ తలరాతను తారుమారు చేసే అవకాశముందని భావిస్తున్నారు. విస్కాన్సిన్ లో బిలియనీర్ ట్రంప్ విజయం ఖాయమని, దీంతో రిపబ్లికన్ నామినేషన్ కోసం కావాల్సిన 1237 మంది డెలిగేట్స్ మద్దతు ఆయనకు లభించినట్టు అవుతుందని అంతా భావించారు. అయితే ఇక్కడ ఓటమితో ఆయనకు మెజారిటీ డెలిగేట్స్ మద్దతు లభిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులోనూ ప్రధాన పోటీదారు హిల్లరీ క్లింటన్ కు ఎదురుదెబ్బ తగిలింది. విస్కాన్సిన్ ప్రైమరీలో వెర్మంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్ కు 57శాతం ఓట్లు లభించగా.. హిల్లరీ కేవలం 43శాతం ఓట్లు మాత్రమే సాధించి వెనుకబడ్డారు. అయితే, త్వరలో జరుగనున్న న్యూయార్క్, పెన్సిల్వేనియా ప్రైమరీల్లో హిల్లరీ విజయావకాశాలు మెండుగా ఉండటంతో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ ఆమెనే వరించే అవకాశముందని వినిపిస్తోంది. -
'ఐదుగురు మహిళలతో సంబంధాలు లేవు'
అగ్రరాజ్యం అమెరికాలోనూ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నట్లు కనిపిస్తున్నాయి. భార్యలపై కామెంట్లు చేసుకోవడం, అభ్యర్థులు తమ ప్రత్యర్థుల భార్యల న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియలో షేర్ చేయడం లాంటివి చేస్తూ చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, ట్రెడ్ క్రూజ్ ల మధ్య ఉన్న పోటీ వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దారితీస్తుంది. ట్రెడ్ క్రూజ్ కు ఐదుగురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పార్టీకే చెందిన ఓ ప్రముఖ ప్రత్యర్థి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఆ నాటా ఈ నోటా పాకి మీడియాకు చేరింది. వార్త పత్రికల్లో ఈ విషయాలు ప్రచురితమవ్వడంతో ట్రెడ్ క్రూజ్ ఈ పుకార్లపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తనకు ఐదుగురు మహిళలతో సంబంధాలున్నాయిని వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని, అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ఆ వార్తలు నిజమని నిరూపించాలంటూ ట్రంప్ కు సవాలు విసిరారు. రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలతో తనకు లింకు లేదని అంటున్నారు. -
అమెరికా బీద దేశం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి పోటీకి రిపబ్లికన్ పార్టీ తరపున ముందు వరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం సాల్ట్ లేక్ సిటీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఇప్పుడు తృతీయ దేశాల వరుసలో చేరిపోయిందన్నారు. చైనా, దుబాయ్‌లలో ఉన్నటువంటి రైలు, రోడ్డు సదుపాయాలు చూస్తే అమెరికా వెనుకబడినట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఆ దేశాల్లోని బుల్లెట్ రైళ్లు గంటకు వందల మైళ్ల వేగంతో దూసుకుపోతుంటే.. న్యూయార్క్‌లో మాత్రం ప్రజలు వంద ఏళ్ల క్రితం వారిలా వెనుకబడిపోయారన్నారు. అమెరికా పేద దేశం కాబట్టి వ్యాపారం విషయంలో తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. అమెరికా పరిస్థితి ఇప్పుడు ఏమంత గొప్పగా లేదని, దానికి మరోసారి పూర్వ వైభవం తీసుకురావాలని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యం ఇప్పుడు లోటులో ఉందని, అయితే ఈ విషయాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు. వేగవంతంగా, తెలివిగా వ్యవహరించే వ్యక్తులు ఇప్పుడు అమెరికాకు నాయకులు కావాలన్న ట్రంప్.. ఇప్పుడున్న వారు అలాంటి వారు కాదని విమర్శించారు. -
ట్రంప్ కంపు హెచ్చరిక!
వాషింగ్టన్: రిపబ్లికన్ అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో హెచ్చరికలు చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో తాను వరుస విజయాలు సాధించిన నేపథ్యంలో తనకు పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం ఇవ్వకపోతే.. అమెరికాలో అల్లర్లు చెలరేగుతాయని ఆయన హెచ్చరించారు. న్యూయార్క్ చెందిన బిలియనీర్ అయిన ట్రంప్ మంగళవారం జరిగిన ఫ్లోరిడా, ఇల్లినాయిస్, నార్త్ కరోలినా ప్రైమరీల్లో ఘనవిజయం సాధించారు. దీంతో అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించడానికి అవసరమైన 1,237 డెలిగేట్స్ మద్దతు దాదాపుగా ఆయనకు లభించినట్టే. అయితే, అత్యంత కీలక రాష్ట్రమైన ఓహిలో మాత్రం ట్రంప్ చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్ 8న జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్‌కు అభ్యర్థిత్వాన్ని నిరాకరించే అవకాశముందని తెలుస్తోంది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి కావాల్సిన మెజారిటీని ట్రంప్ సాధించనిపక్షంలో ఆయనను కాకుండా మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం రిపబ్లికన్ పార్టీకి ఉంటుంది. జూలైలో జరిగే సదస్సులో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారు. ట్రంప్ చేస్తున్న అర్థంపర్థంలేని వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది. ముఖ్యంగా కోటిమంది వలసదారులను అమెరికా నుంచి వెళ్లగొడతానని, ముస్లింలు అమెరికా రాకుండా తాత్కాలికంగా నిషేధిస్తామని, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని ఆయన పేర్కొన్న వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అభ్యర్థిత్వాన్ని కట్టబెడతారా? అన్నది ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే, తనకు లక్షలాది మంది ప్రజలు మద్దతు ఉందని, తనకు అభ్యర్థిత్వాన్ని కేటాయించకపోతే, పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతాయని సీఎన్ఎన్ చానెల్‌తో ట్రంప్ తెలిపారు. -
అనని సూక్తిని గాంధీకి ఆపాదించిన ట్రంప్
వాషింగ్టన్: విచ్ఛిన్నకరమైన ప్రచారం చేస్తూ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి మహాత్మాగాంధీ అనని వ్యాఖ్యలను ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేశారు. 'మొదట వాళ్లు నిన్ను విస్మరిస్తారు. ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆపై నీతో పోరాడుతారు. అనంతరమే నువ్వు గెలుస్తావు' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అలబామాలో తన ర్యాలీ ఫొటోను పెట్టి.. ఇది మహాత్మా గాంధీ అన్నట్టు ఆపాదించారు. నిజానికి ఈ మాట గాంధీ చెప్పింది కాకపోయినప్పటికీ, చాలా సందర్భాల్లో ఆయనకు ఆపాదిస్తూ వస్తున్నారని అమెరికా మీడియా స్పష్టం చేసింది. 2011లో క్రిస్టియన్ సైన్స్ మానిటర్ మ్యాగజీన్ 'పొలిటికల్ మిస్ కోట్స్' పేరిట తప్పుగా ఆపాదించబడిన ప్రముఖమైన పది సూక్తులను వెల్లడించింది. ఇందులో గాంధీ అన్నట్టు ప్రచారంలో ఉన్న ఈ వ్యాఖ్యను కూడా ప్రస్తావించింది. 'గాంధీజీ తాత్వికత అయిన సత్యాగ్రహానికి సారాంశంగా ఈ సూక్తి పేరొందింది. కానీ నిజానికి ఈ మాట మహాత్ముడు అన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు' అని పేర్కొంది. ఇలాంటి సూక్తినే ఒకదానిని అమెరికా కార్మిక హక్కుల నాయకుడు నికోలస్ క్లీన్‌కు కూడా ఆపాదించారని ఆ మ్యాగజీన్ స్పష్టం చేసింది. గాంధీజీని ట్రంప్ వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. ట్రంప్ మద్దతుదారు, అలస్కా మాజీ గవర్నర్ సారా పాలిన్ కూడా గతంలో ఇదే సూక్తిని గాంధీజీకి తప్పుగా ఆపాదిస్తూ వాడారు. ఇటలీ ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలిని సూక్తిని ట్రంప్ రీ ట్వీట్ చేయడం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ట్రంప్ గాంధీ సూక్తులను ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. అయితే గాంధీజీ అనని మాటను ఆయనకు ఆపాదించడంపై ట్విట్టర్లో ట్రంప్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ముస్సోలిని సూక్తులను ప్రస్తావించిన ట్రంప్ త్వరలోనే హిట్లర్ సూక్తులను కూడా వాడుకొని లబ్ధి పొందేలా కనిపిస్తున్నాడని ఆయన తీరుపై ధ్వజమెత్తుతున్నారు. -
ఆమెను అమెరికా నుంచి వెళ్లగొట్టాలి!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్, రిపబ్లికన్ గవర్నర్ నిక్కీ హెలీపై అదే పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు విద్వేషాన్ని ఎగజిమ్ముతున్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వలసవచ్చే ప్రజల విషయంలో అనుసరిస్తున్న విపరీత ధోరణిని పరోక్షంగా తప్పుబడుతూ నిక్కీ హెలీ వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వలస వచ్చిన తమ కుటుంబం అమెరికాలో ఎలా స్థిరపడిందో చెప్తూ.. అలా సక్రమంగా అగ్రరాజ్యానికి వలసవచ్చే వారికి భరోసా కల్పించాలిగానీ, అమెరికా తమను గెంటివేస్తుందన్న భావన కలిగించరాదని ఆమె పేర్కొన్నారు. దేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన చివరి ప్రసంగంపై సౌత్ కరోలినా రాష్ట్రం గవర్నర్ అయిన నిక్కీ హెలీ 9 నిమిషాలపాటు తన ప్రతిస్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా తన భారత్, అమెరికా మూలాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ (వలస) విధానాన్ని సంస్కరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అంతేకానీ అమెరికాకు రాకుండా భయపెట్టేలా ఆగ్రహపూరితమైన ధ్వనులు వినిపించడం సరికాదని పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అలా జరిగితే అమెరికా చట్టాలకు కట్టుబడి ఇక్కడ చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయబోరని, అమెరికా తమను స్వాగతించడం లేదన్న భావన వారిలో కలుగుతుందని అన్నారు. అక్రమ వలసను నిరోధిస్తూనే.. అన్ని పత్రాలతో చట్టబద్ధంగా అమెరికాకు వచ్చేవారిని మతం, జాతితో సంబంధం లేకుండా స్వాగతించేలా ఈ విధానం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. పారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాకు ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిక్కీ హెలీ వ్యాఖ్యలు ట్రంప్ మద్దతుదారులకు ఆగ్రహం కలిగించాయి. ట్రంప్ గట్టి సపోర్టర్, టీవీ కామెంటర్ ఆన్ కౌల్టర్ ఏకంగా 'నిక్కీ హెలీని అమెరికా నుంచి ట్రంప్ వెళ్లగొట్టాలి' అని ట్విట్టర్లో అన్నారు. అదేవిధంగా ట్రంప్ మద్దతుదారులు పలువురు సోషల్ మీడియాలో నిక్కీకి వ్యతిరేకంగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. -
'ఐఎస్ఐఎస్ తల నరికేస్తాను'
న్యూయార్క్: 'నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఎస్ఐఎస్ తల నరికేస్తాను. వారి చమురును మన అధీనంలోకి తీసుకుంటాను'.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ తన మొదటి టీవీ ప్రకటనలో పేర్కొన్న హామీలివి. అంతేకాకుండా ఈ ప్రకటనలో తాను గతంలో చేసిన వివాదాస్పద హామీలను సైతం ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలని, దేశంలో ఏం జరుగుతున్నదో స్పష్టంగా తెలుసుకొనే వరకు ఇది కొనసాగాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఫొటోలతో మొదలయ్యే ఈ ప్రకటనలో యుద్ధరంగంలో అమెరికా క్రూయిజ్ క్షిపణిని పేల్చడం, కాలిఫోర్నియాలో ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితుల ఫొటోలు, అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలస దృశ్యాలు, ఇస్లామిక్ స్టేట్ దృశ్యాలు కనిపిస్తాయి. నేపథ్య వ్యాఖ్యాత గంభీరమైన గొంతుతో ఈ దృశ్యాలకు అనుగుణంగా మాట్లాడుతూ 'అందుకే దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేవరకు అమెరికాలో ముస్లింలు ప్రవేశించకుండా తాత్కాలిక నిషేధం విధించాలని ఆయన కోరుతున్నారు. ఐఎస్ఐస్ తలను ఆయన నరికేస్తారు. వారి చమురును అధీనంలోకి తీసుకుంటారు. మెక్సికోలోని దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మించడం ద్వారా ఆయన అక్రమ వలసను అడ్డుకుంటారు' అని చెప్తారు. 'అమెరికాను మళ్లీ గొప్పదిగా మేం మారుస్తాం' అంటూ ఎన్నికల ర్యాలీల్లో ట్రంప్ చేసే వ్యాఖ్యలు చివరగా వినిపిస్తాయి. -
ఆ భయమే ఆయనకు కలిసివస్తోంది!
వాషింగ్టన్: అమెరికన్లు మరీ భయపడిపోతున్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత మళ్లీ ఇప్పుడు తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశముందని బెదిరిపోతున్నారు. వారిలో రోజురోజుకు పెరిగిపోతున్న ఈ భయమే డొనాల్డ్ ట్రంప్ కు కలిసివస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి పోటీపడుతున్న ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తెచ్చుకోవడానికి అమెరికన్లలో నెలకొన్న 'ఉగ్ర'భయమే కారణమని న్యూయార్క్ టైమ్స్-సీబీఎస్ న్యూస్ సర్వేలో తేలింది. పారిస్, కాలిఫోర్నియాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల అనంతరం ఉగ్రవాదం విషయంలో అమెరికన్ల అభిప్రాయంలో మార్పు వచ్చింది. వారు ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉగ్రవాద ముప్పేనని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలకు ముందు ఉగ్రవాదం ప్రధాన సమస్య అని 4శాతం మంది అభిప్రాయపడగా.. ఇప్పుడు 19శాతం మంది అదే అత్యంత తీవ్ర సమస్య అని చెప్తున్నారు. ప్రజల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళనకర వాతావరణం నుంచి సహజంగానే డొనాల్డ్ ట్రంప్ లబ్ధి పొందుతున్నారు. మసీదులపై పర్యవేక్షణ ఉంచాలని, ముస్లింలు అమెరికాకు రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిజాయితీ, సహానుభూతి, అనుభవం ఉన్న బలమైన నాయకత్వం ఉండాలని రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లలో ప్రతి 10మందిలో నలుగురు భావిస్తున్నారు. ఈ అభిప్రాయమున్న ఓటర్లు డొనాల్డ్ ట్రంప్ కు బలంగా మద్దతు పలుకుతున్నారు. ముస్లింలు అమెరికా రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం కన్నా ముందే ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ట్రంప్ దేశభక్తుడని, అమెరికాలోకి ముస్లింల వలసను ఆయన నిరోధిస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. రానున్న కొన్ని నెలల్లో అమెరికాలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం అధికంగా ఉందని ఈ సర్వేలో 44శాతం అభిప్రాయపడగా.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో అమెరికా భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మంది అమెరికన్లలో ఏడుగురు అభిప్రాయపడ్డారు. -
అధ్యక్ష రేసు నుంచి తప్పుకొన్న బాబీ జిందాల్
లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. 2016లో జరగనున్న అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీలో ఉన్న ఆయన.. మంగళవారం తన ప్రచారాన్ని నిలిపివేశాడు. ఈ సందర్భంగా జిందాల్ మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ తరపున మరో అభ్యర్థిని తాను బలపరచదలచుకోలేదన్నారు. అయితే పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇస్తానని తెలిపారు. అధ్యక్ష రేసు కోసం ఎంతో సమయాన్ని విధానాల తయారీకి, ఇతరత్రా విషయాల కోసం వెచ్చించినట్లు వెల్లడించాడు. అయితే ఇది తనకు సరైన సమయం కానందున రేసు నుంచి తప్పుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలిపాడు. బాబీ జిందాల్ తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ తరపున ఇంకా బరిలో 14 మంది అభ్యర్థులు మిగిలారు. బాబీ జిందాల్ తన ప్రచారంలో మొదటగా ఎన్నికలు జరిగే లోవా ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అయితే అక్కడి ఓటర్ల నుంచి ఆశించినంత మేర ఆదరణ జిందాల్‌కు లభించలేదు. అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న బలమైన ఇతర అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, బెన్ కార్సన్ల నుంచి ఎదురవుతన్న పోటీలో జిందాల్ వెనుకబడ్డాడు. నిధుల సమీకరణలో కూడా జిందాల్‌కు నిరాశ తప్పలేదు. వీటన్నింటి దృష్ట్యా ప్రాక్టికల్‌గా ఆలోచించి జిందాల్ పోటీ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
భారత్‌కి ఏటా 1.8 లక్షల కోట్ల నష్టం!
న్యూఢిల్లీ: అమెరికాలో ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ బిల్లు .. భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు గానీ పాసయితే.. భారత ఎకానమీకి ఏటా సుమారు రూ.1.8 లక్షల కోట్ల మేర (30 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లనుంది. అగ్రరాజ్యంపై ఆధారపడిన ఐటీ రంగం అత్యధికంగా నష్టపోనుంది. భారత్‌కి సంబంధించిన విషయాలపై అమెరికా ప్రతినిధుల సభకు సలహాలు, సూచనలు ఇచ్చే ఇండియన్ అమెరికన్ అడ్వైజరీ కౌన్సిల్ (ఐఏఏసీ) ఈ అంశాలు వెల్లడించింది. కొన్ని ప్రత్యేక కేటగిరీ వీసాలపై పనిచేసే ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకున్న ఇమ్మిగ్రేషన్ బిల్లు గానీ అమల్లోకి వస్తే భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఏటా 30 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఏఏసీ చైర్మన్ శలభ్ కుమార్ చెప్పారు. దీంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. దేశీయంగా సుమారు 1 కోటి ఐటీ ప్రొఫెషనల్స్‌పైన, అమెరికాలో 5,00,000 మంది నిపుణులపైన ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని, వారికి ఉపాధి లేకుండా పోతుందని కుమార్ పేర్కొన్నారు. నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిల్లు ఏక్షణమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందని.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా అధికార, ప్రతిపక్షాలు మూడు రోజుల్లో దీనిపై పరస్పర అంగీకారానికి రావొచ్చని కుమార్ పేర్కొన్నారు. సమయం మించిపోతున్నందున మరింత జాప్యం చేయకుండా భారత్ తన బాణీని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు వివాదం ఇదీ .. భారత ఐటీ రంగం ఆదాయాల కోసం అత్యధికంగా అమెరికాపైనే ఆధారపడిన సంగతి తెలిసిందే. మన వారు అక్కడ ఉద్యోగం చేసేందుకు ఉపయోగపడే వీసా కేటగిరీలు కొన్ని ఉన్నాయి. ఇందులో హెచ్1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ ప్రొఫెషనల్స్‌ని నియమించుకోవచ్చు. ఇక ఏదైనా అంతర్జాతీయ కంపెనీ.. అమెరికాలోని తమ అనుబంధ సంస్థకు ఉద్యోగిని తాత్కాలికంగా బదిలీ చేసేందుకు ఎల్1 వీసాలు ఉపకరిస్తాయి. ఈ రెండు కేటగిరీల వీసాలను అత్యధికంగా పొందుతున్నది భారత కంపెనీలే. అంతేగాకుండా చౌక సేవల కారణంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎక్కువగా ఇక్కడికి తరలివస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగాలను భారత్ కొల్లగొడుతోందన్న ఆరోపణలు అమెరికాలో మొదలయ్యాయి. దానికి తగ్గట్లుగానే వీసాల వినియోగంపై ఆంక్షలు విధించేలా ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని రాజకీయ పార్టీలు తెరపైకి తెచ్చాయి. బిల్లు కారణంగా భారతీయ కంపెనీలు.. అమెరికాలో ఎక్కువగా స్థానిక ఉద్యోగులను తీసుకోవాల్సి రానుంది. దీంతో ఆయా సంస్థల వ్యయాలు పెరిగి, మార్జిన్లు దెబ్బతింటాయి.