రిపబ్లికన్ వైపు భారత ఓటర్లు!
డెమోక్రటిక్ ఓటు బ్యాంకుకు దెబ్బ ట్రంప్ బృందం అంచనా
వాషింగ్టన్: ‘హిందువులకు నేను పెద్ద అభిమాని’నంటూ ఇటీవల ర్యాలీలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ చేసిన ప్రసంగం... డెమోక్రటిక్ పార్టీకున్న బలమైన సంప్రదాయ భారత సంతతి ఓటు బ్యాంకును దెబ్బ కొట్టినట్టు రిపబ్లికన్ పార్టీ భావిస్తోంది. వీరంతా క్రమంగా రిపబ్లికన్ల వైపు మొగ్గుతున్నట్టు ఆ పార్టీ భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఉండకపోయినా... భవిష్యత్తులో భారత సంతతి వారు తమ ఓటు బ్యాంకుగా మారతారన్న అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయిలో భారతీయ అమెరికన్లు ఇటీవల న్యూజెర్సీలో నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించడం తెలిసిందే.
హిల్లరీ నేర సంస్థ నడిపిస్తున్నారు: ట్రంప్
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ‘నేర సంస్థ’ నడిపిస్తున్నారని, ఎన్నికల్లో తనను ఓడించడానికి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశం, ప్రజల భద్రతను ఫణంగా పెట్టిందని, దానికి అమెరికా ప్రభుత్వం కూడా సహకరిస్తోందన్నారు.