indian voters
-
విదేశాల్లో భారతీయులకు పోస్టల్ బ్యాలెట్
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉండే భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వర్తింప జేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) యోచిస్తోంది. కేంద్రం అనుమతిస్తే.. ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ఈటీపీబీఎస్)ను విదేశాల్లోని అర్హులైన భారతీయ ఓటర్లు కూడా వినియోగించుకునే వీలుం టుంది. ఈ మేరకు ఈసీ నవంబర్ 27వ తేదీన న్యాయశాఖకు లేఖ రాసింది. ఇప్పటికే భద్రతా బలగాలకు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందున విదేశాల్లోని భారతీ యులకు కూడా అందుబాటు లోకి తేగలమనే నమ్మకం ఉందని అందులో తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్– జూన్ నెలల్లో అస్సాం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సదుపాయాన్ని అమలు చేసేందుకు సాంకేతికంగా, పాలనాపరంగా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. విదేశాల్లో ఉండే అర్హులైన భారతీయ ఓటర్లు ఓటు హక్కు వినియో గించుకునేందుకు స్వదేశానికి రావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహా రమని, బదులుగా పోస్టల్ బ్యాలెట్ వెసులు బాటును కల్పించాలం టూ పలు విజ్ఞప్తులు అందాయని వివరించింది. కోవిడ్–19 ప్రోటోకాల్స్ నేపథ్యంలో ఈ సమస్య మరింత సంక్లిష్టమైందని న్యాయశాఖకు తెలిపింది. ఈటీపీబీఎస్ కోసం విదేశాల్లో ఉండే భారతీయులు ముందుగా తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తు న్నట్లు రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించాలి. అప్పుడే వారికి పోస్టల్ బ్యాలెట్ అందుతుంది. ఓటరు ఆ బ్యాలెట్‌ను డౌన్లోడ్ చేసుకుని ప్రత్యేక ఎన్వలప్లో తన ఓటు నమోదై ఉన్న నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు ఆ బ్యాలెట్ చేరుకుంటుంది. లెక్కింపు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే మొదలవుతుంది. -
రిపబ్లికన్ వైపు భారత ఓటర్లు!
డెమోక్రటిక్ ఓటు బ్యాంకుకు దెబ్బ ట్రంప్ బృందం అంచనా వాషింగ్టన్: ‘హిందువులకు నేను పెద్ద అభిమాని’నంటూ ఇటీవల ర్యాలీలో అమెరికా అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ చేసిన ప్రసంగం... డెమోక్రటిక్ పార్టీకున్న బలమైన సంప్రదాయ భారత సంతతి ఓటు బ్యాంకును దెబ్బ కొట్టినట్టు రిపబ్లికన్ పార్టీ భావిస్తోంది. వీరంతా క్రమంగా రిపబ్లికన్ల వైపు మొగ్గుతున్నట్టు ఆ పార్టీ భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఉండకపోయినా... భవిష్యత్తులో భారత సంతతి వారు తమ ఓటు బ్యాంకుగా మారతారన్న అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయిలో భారతీయ అమెరికన్లు ఇటీవల న్యూజెర్సీలో నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించడం తెలిసిందే. హిల్లరీ నేర సంస్థ నడిపిస్తున్నారు: ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాటల తూటాలు పేల్చారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ‘నేర సంస్థ’ నడిపిస్తున్నారని, ఎన్నికల్లో తనను ఓడించడానికి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశం, ప్రజల భద్రతను ఫణంగా పెట్టిందని, దానికి అమెరికా ప్రభుత్వం కూడా సహకరిస్తోందన్నారు. -
సంక్లిష్ట సమస్యల వలయంలో..
సంపాదకీయం: భారత ఓటర్లు ఎలాంటి సందిగ్ధతకు తావులేవుని విధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడనున్న ఎన్డీయే ప్రభుత్వానికి ఐదేళ్ల సుస్థిర పాలనను అందించే అవకాశాన్ని కల్పించారు. మిత్రపక్షాలు సహా మరెవ రిపైనా ఆధారపడాల్సిన అవసరం లేని బలాన్ని బీజేపీకి సమకూర్చారు. గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన ఆర్థిక వృద్ధి క్షీణత నూతన ప్రభు త్వానికి తక్షణమే పెను సవాలై నిలుస్తుంది. 2008కి ముందు ఐదేళ్ల కాలంలో సగటున ఏడాదికి 9 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2011 నుంచి వేగంగా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం కనిష్ట స్థాయికి చేరింది. ఈ ఏడాది 5.5 శాతానికి చేరే ఆశ లేదు. అన్ని వర్గాలను సంతృప్తిపరచగలగాలంటే తక్షణమే ఆర్థిక వృద్ధి పుంజుకునేట్టు చేయక తప్పదు. అయితే గత ఏడాదితో పోలిస్తే పరి స్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి జీడీపీలో 6.5 శాతానికి చేరిన కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) ఈ ఏడాది అదే కాలానికి జీడీపీలో 0.9 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 1.8 శాతానికి పరిమితమవుతుందని అంచనా. ద్రవ్య (ఫిస్కల్) లోటు సైతం జీడీపీలో 4.6 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. సామాన్యులకు ఊరట కలిగేలా ద్రవ్యో ల్బణం జోరు తగ్గింది. పైగా విదేశీ పెట్టుబడుల రాకతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఒడిదుడుకులను తట్టుకోవడా నికి జపాన్ నుంచి 5,000 కోట్ల రుణ హామీ సిద్ధంగా ఉంది. ఆర్థిక సంస్కరణలకు అనుకూలునిగా గుర్తింపు పొందిన మోడీ ప్రధాని కాను న్నారని తెలిసి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ‘మంచి రోజులు వస్తున్నా’యని మోడీ తన ప్రచారంలో అడుగడుగునా చెప్పారు. ఆ మాటలను అన్ని వర్గాల ప్రజలు విశ్వసించారు, ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. తక్షణమే ఆర్థిక వృద్ధి పుంజుకోవాలని, ద్రవ్యో ల్బణం మటుమాయమై పోవాలని, ఉపాధి కల్పన ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరగాలని ఆశిస్తారు. మోడీ పరిపాలన మొదటి ఆరు నెలల్లోనే నేడున్న అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులుగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎల్ నినో ప్రభావంతో మన వ్యవ సాయ రంగానికి కీలకమైన జూన్ - సెప్టెంబర్ మాసాల్లో అల్ప వర్షపా తం తప్పక పోవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రభావంతో ఈ ఏడాది ఆర్థిక వృద్ధిలో 0.50 నుంచి 0.90 శాతం పాయింట్ల కోత తప్పక పోవచ్చు. పైగా ఆహార ద్రవ్యోల్బణం, వినియో గవస్తు ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించవచ్చు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడమే మోడీ సర్కారుకు మొదటి అగ్ని పరీక్ష కావచ్చు. ధరలను అదుపు చేయలేని అసమర్థతే కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీసింది. ఆ విషయాన్ని మోడీ విస్మరించడం కష్టం. ద్రవ్యోల్బణం అదు పునకు ప్రాధాన్యం ఇచ్చి ఆర్బీఐ వ్యాపార, పారిశ్రామిక వర్గాల ఆకాం క్షలకు విరుద్ధంగా అధిక వడ్డీ రేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. ఆర్బీ ఐతో ఏకీభవిస్తే మోడీ సర్కారు వ్యాపార వర్గాలను నిరుత్సాహపరచి నట్టవుతుంది. లేక పెట్టుబడులకు ప్రోత్సాహం పేరిట వడ్డీ రేట్ల తగ్గింపు నకు పట్టుబడితే గత ప్రభుత్వంలా ఆర్బీఐతో సంఘర్షణ తప్పక పోవ చ్చు. ఇంచుమించుగా ఇలాంటి సందిగ్ధ పరిస్థితే వినియోగదారుల సబ్సిడీల సమస్యపై కూడా ఎదురుకాక తప్పదు. పెట్రో, ఫెర్టిలైజర్, ఆహార సబ్సిడీలు ప్రణాళికేతర వ్యయంలో అత్యధిక భాగంగా ఉంటు న్నాయని, వాటిని పూర్తిగా నిర్మూలిస్తే తప్ప ద్రవ్య లోటు సమస్య పరిష్కారం కాదని సంస్కరణల సమర్థకుల వాదన. వ్యాపార, పారిశ్రా మిక వర్గాలు సైతం చాలా కాలంగా అదే డిమాండు చేస్తున్నాయి. గత ప్రభుత్వం కోతలను విధించి 2012-13 ఏడాదికి సబ్సిడీలను జీడీపీలో 2 శాతానికి తగ్గించింది. 2015-16 నాటికి వాటిని 1.75 శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన సందర్భంగా మోడీ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం గత ప్రభుత్వ ఆర్థిక విధానాల కొనసాగింపును ధ్వనించింది. సబ్సిడీల విషయంలో యూపీఏ వైఖరిని కొనసాగిస్తే పెట్రో, గ్యాస్ ధరలు, ఆహార ధరలు పెరగక తప్పవు. సంస్కరణలను, సంక్షేమాన్ని జోడించే విభిన్నమైన మార్గాన్ని చేపడితే మరో సమస్య ప్రత్యక్షం కావచ్చు. నేడు వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులన్నీ ‘హాట్ మనీ’గా పిలిచే తాత్కాలికమైన చంచల పెట్టుబడులే. అనుకూల వాతావరణాన్ని పసిగడితే వచ్చి పడతాయి. ప్రతికూలమనిపిస్తే ఎగిరిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అదే జరిగితే ఐఎంఎఫ్ రుణమే శరణ్యమ వుతుంది. నేటి విదేశీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థను తాత్కాలికంగా స్థిరీకరించి దీర్ఘకాలికమైన ఉత్పత్తి రంగ పెట్టుబడులను పెట్టి వృద్ధిని పెంపొందించే అవకాశాన్ని కల్పిస్తాయే తప్ప అవే వృద్ధిని సాధించి పెట్టలేవు. పైగా ఐఎంఎఫ్ 2015 ఆర్థిక వృద్ధి ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిగా అంచనా వేస్తున్న 3.4 శాతం కంటే 0.3 శాతానికి మించి పెరగదనే నిరాశాజనకమైన అంచనాను వెలువరించింది. దీనికి తోడు అమెరికా కేంద్ర బ్యాంకు బాండ్ల కొనుగోళ్లను తగ్గించి ప్రపంచ వడ్డీ రేట్లు పెరగడానికి కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. నేడు మనకు దీర్ఘకాలిక పెట్టుబడి వ్యయాల గణనీయమైన పెరుగుదల అవసరం. ప్రైవేటు పెట్టుబడులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పని చేయగలవ నిపించదు. ద్రవ్య లోటు అదుపు తప్పకుండా చూస్తూ ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలను పెంచడమంటే కత్తి మీద సామే. మొదటి రోజు నుంచే నిశిత పరిశీలనకు గురికానున్న మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ లాగా ‘సంకీర్ణ ధర్మం’లాంటి కుంటిసాకులను చూపే అవకాశం లేదు. ఆశలను రేకెత్తించిన వారిపైనే వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉం టుంది. సంక్లిష్ట సమస్యల గుండా మోడీ దేశాన్ని ఎలా నడిపిస్తారనేది వేచి చూడాల్సిందే. -
అసలు ఓటెందుకు వేయాలి?
ఓటు.. వజ్రాయుధం. ఈ మాట కొన్ని దశాబ్దాల నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడు మన దేశంలో ఎన్నికలు జరిగినా 70 శాతం పోలింగు నమోదైంది అంటేనే అదో పెద్ద ఘనతలా భావిస్తున్నాం. చాలా సందర్బాలలో 60 శాతనికి దగ్గర్లోనే పోలింగు నమోదవుతుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని అందరికీ తెలిసినా, చదువుకున్నవాళ్లు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే ఇలా తక్కువ పోలింగు నమోదవుతోంది. అంటే, నిరక్షరాస్యులు కూడా ఓటు విలువ తెలుసుకుని వయోవృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేస్తుంటే, సూటు బూటు వేసుకున్న ‘పెద్దోళ్లు’ మాత్రం ఓటుహక్కు వినియోగించుకోడానికి చాలా దూరంగా ఉండిపోతున్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 25వ తేదీన ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన సందర్భంగా ప్రతియేటా ఈ దినోత్సవం చేస్తూ.. ఆ రోజున ఓటర్లలో చైతన్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఓటు ఎందుకు వేయాలి, వేస్తే లాభమేంటి, వెయ్యకపోతే నష్టమేంటో చూద్దాం.. 400 పైచిలుకు భాషలు, వివిధ కులాలు, మతాలు కలిగి ఉన్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం చాలా కష్టం. అందుకు ఏకైక మార్గం.. అందరూ ఓట్లు వేయడమే. ఓ ఎన్నికలో 60 శాతం పోలింగ్ నమోదైందని అనుకుందాం. అందులో 10 మంది అభ్యర్థులుంటే, వారి మధ్య ఓట్లు చీలగా.. మహా అయితే 10-15 శాతం లోపు ఓట్లు (మొత్తం ఓటర్లలో) సాధించిన వాళ్లు కూడా ఎన్నికైపోయే అవకాశముంది. అంటే, దాదాపు 85-90 శాతం మంది అక్కర్లేదనుకున్నవాళ్లు సైతం ప్రజాప్రతినిధి అవుతారన్నమాట. అలా కాకుండా నూటికి నూరుశాతం లేదా.. 80-90 శాతం వరకు పోలింగ్ జరిగితే, నిజమైన ప్రజాభిప్రాయం ఫలితాలలో ప్రతిబింబిస్తుంది. ఎక్కువ మంది ప్రజలు కావాలనుకున్నవాళ్లే ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు. ఇటీవలి కాలంలో ఓటర్ల నమోదు ఎక్కువగానే జరుగుతోంది. నాయకులు దగ్గరుండి చేర్పించడమో, ఆన్ లైన్లో ఓటరుగా నమోదుచేసుకునే ప్రక్రియ ఎక్కువమందికి తెలియడమో.. ఏదైనా ఓటర్ల నమోదు గణనీయంగా పెరిగింది. కానీ ఓటరు గుర్తింపుకార్డును కేవలం ఫొటో గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవడం మాని.. ఎన్నికలలో ఓట్లు తప్పనిసరిగా వేయాలి. చదువుకున్నవాళ్లు తమ సొంత ఆలోచనతో ఓటు వేస్తారు తప్ప ఎలాంటి ప్రలోభాలకు లోనుకారు కాబట్టి, ఇలాంటి వాళ్లంతా ఓట్లు వేస్తే.. డబ్బుపెట్టి కొనుక్కునేవాళ్లు కాకుండా.. నిజంగా రాజకీయాలను బాగుచేద్దాం అనుకునే వాళ్లకు అవకాశం వస్తుంది. కేవలం ఓట్లు వేయడమే కాదు.. రాజకీయాలు కుళ్లిపోయాయి అనుకోవడం మానేసి, ఆ కుళ్లును దగ్గరుండి కడగాలని అనుకోవడం కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది. అంటే, యువత రాజకీయాల్లోకి ప్రవేశించాలి. స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.