అసలు ఓటెందుకు వేయాలి? | why should we vote for democracy | Sakshi
Sakshi News home page

అసలు ఓటెందుకు వేయాలి?

Published Sat, Jan 25 2014 9:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

అసలు ఓటెందుకు వేయాలి?

అసలు ఓటెందుకు వేయాలి?

ఓటు.. వజ్రాయుధం. ఈ మాట కొన్ని దశాబ్దాల నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఎప్పుడు మన దేశంలో ఎన్నికలు జరిగినా 70 శాతం పోలింగు నమోదైంది అంటేనే అదో పెద్ద ఘనతలా భావిస్తున్నాం. చాలా సందర్బాలలో 60 శాతనికి దగ్గర్లోనే పోలింగు నమోదవుతుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని అందరికీ తెలిసినా, చదువుకున్నవాళ్లు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే ఇలా తక్కువ పోలింగు నమోదవుతోంది. అంటే, నిరక్షరాస్యులు కూడా ఓటు విలువ తెలుసుకుని వయోవృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేస్తుంటే, సూటు బూటు వేసుకున్న ‘పెద్దోళ్లు’ మాత్రం ఓటుహక్కు వినియోగించుకోడానికి చాలా దూరంగా ఉండిపోతున్నారు.
ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం. జనవరి 25వ తేదీన ఎన్నికల కమిషన్ ఆవిర్భవించిన సందర్భంగా ప్రతియేటా ఈ దినోత్సవం చేస్తూ.. ఆ రోజున ఓటర్లలో చైతన్యం నింపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఓటు ఎందుకు వేయాలి, వేస్తే లాభమేంటి, వెయ్యకపోతే నష్టమేంటో చూద్దాం..

  • 400 పైచిలుకు భాషలు, వివిధ కులాలు, మతాలు కలిగి ఉన్న దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం చాలా కష్టం. అందుకు ఏకైక మార్గం.. అందరూ ఓట్లు వేయడమే.
  • ఓ ఎన్నికలో 60 శాతం పోలింగ్ నమోదైందని అనుకుందాం. అందులో 10 మంది అభ్యర్థులుంటే, వారి మధ్య ఓట్లు చీలగా.. మహా అయితే 10-15 శాతం లోపు ఓట్లు (మొత్తం ఓటర్లలో) సాధించిన వాళ్లు కూడా ఎన్నికైపోయే అవకాశముంది. అంటే, దాదాపు 85-90 శాతం మంది అక్కర్లేదనుకున్నవాళ్లు సైతం ప్రజాప్రతినిధి అవుతారన్నమాట.
  • అలా కాకుండా నూటికి నూరుశాతం లేదా.. 80-90 శాతం వరకు పోలింగ్ జరిగితే, నిజమైన ప్రజాభిప్రాయం ఫలితాలలో ప్రతిబింబిస్తుంది. ఎక్కువ మంది ప్రజలు కావాలనుకున్నవాళ్లే ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు.
  • ఇటీవలి కాలంలో ఓటర్ల నమోదు ఎక్కువగానే జరుగుతోంది. నాయకులు దగ్గరుండి చేర్పించడమో, ఆన్ లైన్లో ఓటరుగా నమోదుచేసుకునే ప్రక్రియ ఎక్కువమందికి తెలియడమో.. ఏదైనా ఓటర్ల నమోదు గణనీయంగా పెరిగింది.
  • కానీ ఓటరు గుర్తింపుకార్డును కేవలం ఫొటో గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవడం మాని.. ఎన్నికలలో ఓట్లు తప్పనిసరిగా వేయాలి.
  • చదువుకున్నవాళ్లు తమ సొంత ఆలోచనతో ఓటు వేస్తారు తప్ప ఎలాంటి ప్రలోభాలకు లోనుకారు కాబట్టి, ఇలాంటి వాళ్లంతా ఓట్లు వేస్తే.. డబ్బుపెట్టి కొనుక్కునేవాళ్లు కాకుండా.. నిజంగా రాజకీయాలను బాగుచేద్దాం అనుకునే వాళ్లకు అవకాశం వస్తుంది.
  • కేవలం ఓట్లు వేయడమే కాదు.. రాజకీయాలు కుళ్లిపోయాయి అనుకోవడం మానేసి, ఆ కుళ్లును దగ్గరుండి కడగాలని అనుకోవడం కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది. అంటే, యువత రాజకీయాల్లోకి ప్రవేశించాలి. స్వచ్ఛమైన రాజకీయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement