సంపాదకీయం: భారత ఓటర్లు ఎలాంటి సందిగ్ధతకు తావులేవుని విధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడనున్న ఎన్డీయే ప్రభుత్వానికి ఐదేళ్ల సుస్థిర పాలనను అందించే అవకాశాన్ని కల్పించారు. మిత్రపక్షాలు సహా మరెవ రిపైనా ఆధారపడాల్సిన అవసరం లేని బలాన్ని బీజేపీకి సమకూర్చారు. గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన ఆర్థిక వృద్ధి క్షీణత నూతన ప్రభు త్వానికి తక్షణమే పెను సవాలై నిలుస్తుంది. 2008కి ముందు ఐదేళ్ల కాలంలో సగటున ఏడాదికి 9 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2011 నుంచి వేగంగా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం కనిష్ట స్థాయికి చేరింది.
ఈ ఏడాది 5.5 శాతానికి చేరే ఆశ లేదు. అన్ని వర్గాలను సంతృప్తిపరచగలగాలంటే తక్షణమే ఆర్థిక వృద్ధి పుంజుకునేట్టు చేయక తప్పదు. అయితే గత ఏడాదితో పోలిస్తే పరి స్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి జీడీపీలో 6.5 శాతానికి చేరిన కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) ఈ ఏడాది అదే కాలానికి జీడీపీలో 0.9 శాతానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 1.8 శాతానికి పరిమితమవుతుందని అంచనా. ద్రవ్య (ఫిస్కల్) లోటు సైతం జీడీపీలో 4.6 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. సామాన్యులకు ఊరట కలిగేలా ద్రవ్యో ల్బణం జోరు తగ్గింది. పైగా విదేశీ పెట్టుబడుల రాకతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఒడిదుడుకులను తట్టుకోవడా నికి జపాన్ నుంచి 5,000 కోట్ల రుణ హామీ సిద్ధంగా ఉంది. ఆర్థిక సంస్కరణలకు అనుకూలునిగా గుర్తింపు పొందిన మోడీ ప్రధాని కాను న్నారని తెలిసి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి.
‘మంచి రోజులు వస్తున్నా’యని మోడీ తన ప్రచారంలో అడుగడుగునా చెప్పారు. ఆ మాటలను అన్ని వర్గాల ప్రజలు విశ్వసించారు, ఆయనపై ఆశలు పెట్టుకున్నారు. తక్షణమే ఆర్థిక వృద్ధి పుంజుకోవాలని, ద్రవ్యో ల్బణం మటుమాయమై పోవాలని, ఉపాధి కల్పన ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరగాలని ఆశిస్తారు. మోడీ పరిపాలన మొదటి ఆరు నెలల్లోనే నేడున్న అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులుగా పరిణమించే ప్రమాదం ఉంది. ఎల్ నినో ప్రభావంతో మన వ్యవ సాయ రంగానికి కీలకమైన జూన్ - సెప్టెంబర్ మాసాల్లో అల్ప వర్షపా తం తప్పక పోవచ్చని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆ ప్రభావంతో ఈ ఏడాది ఆర్థిక వృద్ధిలో 0.50 నుంచి 0.90 శాతం పాయింట్ల కోత తప్పక పోవచ్చు. పైగా ఆహార ద్రవ్యోల్బణం, వినియో గవస్తు ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించవచ్చు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడమే మోడీ సర్కారుకు మొదటి అగ్ని పరీక్ష కావచ్చు. ధరలను అదుపు చేయలేని అసమర్థతే కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీసింది. ఆ విషయాన్ని మోడీ విస్మరించడం కష్టం. ద్రవ్యోల్బణం అదు పునకు ప్రాధాన్యం ఇచ్చి ఆర్‌బీఐ వ్యాపార, పారిశ్రామిక వర్గాల ఆకాం క్షలకు విరుద్ధంగా అధిక వడ్డీ రేట్ల విధానాన్ని అనుసరిస్తోంది. ఆర్‌బీ ఐతో ఏకీభవిస్తే మోడీ సర్కారు వ్యాపార వర్గాలను నిరుత్సాహపరచి నట్టవుతుంది.
లేక పెట్టుబడులకు ప్రోత్సాహం పేరిట వడ్డీ రేట్ల తగ్గింపు నకు పట్టుబడితే గత ప్రభుత్వంలా ఆర్‌బీఐతో సంఘర్షణ తప్పక పోవ చ్చు. ఇంచుమించుగా ఇలాంటి సందిగ్ధ పరిస్థితే వినియోగదారుల సబ్సిడీల సమస్యపై కూడా ఎదురుకాక తప్పదు. పెట్రో, ఫెర్టిలైజర్, ఆహార సబ్సిడీలు ప్రణాళికేతర వ్యయంలో అత్యధిక భాగంగా ఉంటు న్నాయని, వాటిని పూర్తిగా నిర్మూలిస్తే తప్ప ద్రవ్య లోటు సమస్య పరిష్కారం కాదని సంస్కరణల సమర్థకుల వాదన. వ్యాపార, పారిశ్రా మిక వర్గాలు సైతం చాలా కాలంగా అదే డిమాండు చేస్తున్నాయి. గత ప్రభుత్వం కోతలను విధించి 2012-13 ఏడాదికి సబ్సిడీలను జీడీపీలో 2 శాతానికి తగ్గించింది.
2015-16 నాటికి వాటిని 1.75 శాతానికి తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన సందర్భంగా మోడీ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం గత ప్రభుత్వ ఆర్థిక విధానాల కొనసాగింపును ధ్వనించింది. సబ్సిడీల విషయంలో యూపీఏ వైఖరిని కొనసాగిస్తే పెట్రో, గ్యాస్ ధరలు, ఆహార ధరలు పెరగక తప్పవు. సంస్కరణలను, సంక్షేమాన్ని జోడించే విభిన్నమైన మార్గాన్ని చేపడితే మరో సమస్య ప్రత్యక్షం కావచ్చు. నేడు వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులన్నీ ‘హాట్ మనీ’గా పిలిచే తాత్కాలికమైన చంచల పెట్టుబడులే. అనుకూల వాతావరణాన్ని పసిగడితే వచ్చి పడతాయి. ప్రతికూలమనిపిస్తే ఎగిరిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అదే జరిగితే ఐఎంఎఫ్ రుణమే శరణ్యమ వుతుంది. నేటి విదేశీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థను తాత్కాలికంగా స్థిరీకరించి దీర్ఘకాలికమైన ఉత్పత్తి రంగ పెట్టుబడులను పెట్టి వృద్ధిని పెంపొందించే అవకాశాన్ని కల్పిస్తాయే తప్ప అవే వృద్ధిని సాధించి పెట్టలేవు.
పైగా ఐఎంఎఫ్ 2015 ఆర్థిక వృద్ధి ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిగా అంచనా వేస్తున్న 3.4 శాతం కంటే 0.3 శాతానికి మించి పెరగదనే నిరాశాజనకమైన అంచనాను వెలువరించింది. దీనికి తోడు అమెరికా కేంద్ర బ్యాంకు బాండ్ల కొనుగోళ్లను తగ్గించి ప్రపంచ వడ్డీ రేట్లు పెరగడానికి కారణమయ్యే ప్రమాదం కూడా ఉంది. నేడు మనకు దీర్ఘకాలిక పెట్టుబడి వ్యయాల గణనీయమైన పెరుగుదల అవసరం. ప్రైవేటు పెట్టుబడులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పని చేయగలవ నిపించదు. ద్రవ్య లోటు అదుపు తప్పకుండా చూస్తూ ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలను పెంచడమంటే కత్తి మీద సామే. మొదటి రోజు నుంచే నిశిత పరిశీలనకు గురికానున్న మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ లాగా ‘సంకీర్ణ ధర్మం’లాంటి కుంటిసాకులను చూపే అవకాశం లేదు. ఆశలను రేకెత్తించిన వారిపైనే వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉం టుంది. సంక్లిష్ట సమస్యల గుండా మోడీ దేశాన్ని ఎలా నడిపిస్తారనేది వేచి చూడాల్సిందే.
సంక్లిష్ట సమస్యల వలయంలో..
Published Wed, May 21 2014 1:22 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement