టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, సినీ నటి పూనమ్ కౌర్(Poonam Kaur) మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంది. సినిమా అవకాశాల పేరుతో తనను మోసం చేసేందుకు ప్రయత్నించారని,కోరిక తీర్చకపోవడంతో ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసారనేది పూనమ్ ఆరోపణ.
అయితే ఆమె ట్వీట్స్‌పై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రం నిజంగానే పూనమ్‌కి అన్యాయం జరిగిందంటారు. మరికొంత మంది ఏమో ఫేమ్ కోసమే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారని విమర్శిస్తారు. అయితే పూనమ్ మాత్రం తన పోరాటం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ని డిమాండ్ చేస్తునే ఉంది. కానీ ‘మా’ మాత్రం పట్టించుకోవట్లేదని పూనమ్ ఫైర్ అవోతుంది.తాజాగా మరోసారి ‘మా’పై తన అసంతృప్తిని వెల్లడిస్తూ పూనమ్ సంచలన ట్వీట్ చేసింది.
(చదవండి: డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)
‘త్రివిక్రమ్(Trivikram Srinivas)పై నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసి చాలా కాలమైంది. ఇప్పటి వరకు ‘మా’ దానిపై స్పందించలేదు. త్రివిక్రమ్‌ని ప్రశ్నించడం కానీ అతనిపై చర్యలు తీసుకోవడం కానీ జరగలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన అతన్ని ఇప్పటికీ ఇండస్ట్రీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తుంది’ అని పూనమ్ ట్వీట్ చేసింది.
గతంలో కూడా పూనమ్ ఇలాంటి ట్వీట్స్ చాలానే చేసింది. త్రివిక్రమ్‌పై ‘మా’లో ఫిర్యాదు చేస్తే సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పూనమ్ డిమాండ్ చేసింది.
పూనమ్ విషయానికొస్తే.. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు సంపాదించుకుంది. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, నిక్కి అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి?, గగనం లాంటి చిత్రాల్లో నటించింది. 2022లో వచ్చిన నాతిచరామి సినిమాలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.
No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment