వాషింగ్టన్ : అమెరికా సెనేటర్ల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఈ ప్రమాణ స్వీకారంలో డెమోక్రటిక్ పార్టీ నేత, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ సెనేటర్లతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) ప్రమాణం స్వీకారం చేయించారు. వారిలో రిపబ్లికన్ సెనేటర్ డెబ్ ఫిషర్ (Deb Fischer) సైతం ఉన్నారు. డెబ్ ఫిషర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత డెబ్ పిషర్ కమలా హారిస్‌కు కరచాలనం చేశారు. అనంతరం, తన భర్త బ్రూస్ ఫిషర్‌ను కమలా హారిస్‌కు పరిచయం చేయించారు. ముందుకు వెళ్లి హారిస్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వమని కోరారు.
అయితే, అందుకు బ్రూస్ ఫిషర్ అంగీకరించలేదు. కమలా హారిస్ ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో సెనేట్లరతో పాటు కమలా హారిస్ సైతం కొంచెం ఇబ్బంది పడ్డారు. వెంటనే .. ‘ఫర్వాలేదు బ్రూస్ ఫిషర్ నేను తిట్టను.. కంగారుపడకు’ అంటూ సరదాగా అన్నారు.
GOP Senator Deb Fischer’s husband, Bruce, refuses to shake Vice President Kamala Harris’s hand after her swearing-in. Truly classless. pic.twitter.com/a0ZQuDV0t0
— Republicans against Trump (@RpsAgainstTrump) January 6, 2025
ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కానీ పలువురు ఉదారవాదులు బ్రూస్ ఫిషర్‌పై సోషల్ మీడియా (social media) వేదికగా మండిపడుతున్నారు.
పాడ్‌కాస్టర్ బ్రియాన్ టైలర్ కోహెన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘రిపబ్లికన్ సెనేటర్ భర్త బ్రూస్ ఫిషర్ కరచాలనం చేసేందుకు, వైస్ ప్రెసిడెంట్ హారిస్‌ను చూసేందుకు సైతం ఇష్టపడలేదు. ఆయన తీరు రిపబ్లికన్ పార్టీ లక్షణాల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
రచయిత డాన్ విన్స్లో మరో అడుగు ముందుకు వేసి బ్రూస్‌ను పందితో పోల్చారు. బ్రూస్ తీరు అవమానకరంగా ఉంది. హారిస్‌తో కరచాలం చేసేందుకు ఇష్టపడలేదు. ‘ బ్రూస్ వ్యవహరించిన తీరు చూస్తుంటే.. పందులు పొలాల్లోనే ఉండవు. అతను ఒక పంది’అంటూ సంభోదించారు. ఈ అంశంపై డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment