
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలినుంచి హావా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండు కీలక స్వింగ్ స్టేట్స్ నార్త్ కరోలినా, జార్జియాలో విజయం సాధించి మరో నాలుగింటిలో లీడ్‌లో ఉన్నారు. దీంతో ట్రంప్ గెలుపు ఖాయమన్న భావన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
ఈ పరిస్థితుల్లో ఇటు రిపబ్లికన్లలో జోష్ నెలకొనగా అటు డెమోక్రాట్లు నిరాశలో మునిగిపోయారు. ట్రంప్ బుధవారం ఫ్లోరిడాలో తన అభిమానులనుద్దేశించి ప్రసంగించనుండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ మాత్రం బుధవారం తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. నిజానికి బుధవారం ఉదయం ఆమె హవర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాల్సి ఉంది. ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఆమె తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా..
Comments
Please login to add a commentAdd a comment