సయ్యద్ వసీం అలీ (ఫైల్)
డబీర్‌ఫురా: అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో పాతబస్తీలోని డబీర్‌పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కాలిఫోర్నియా ప్రీమాంట్‌లోని వాల్‌నట్ ఏవ్‌లో నివాసముంటున్న సయ్యద్ వసీం అలీ (27) ఆదివారం తాను ప్రయాణిస్తున్న కారు అవెన్యూ కూడలి వద్ద మరో కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో సయ్యద్ వసీం అలీ తీవ్ర గాయాలకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు వసీం అలీ కుటుంబ సభ్యులు విదేశాంగ వ్యవహరాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్‌ను కలిసి సయ్యద్ వసీం అలీ మృతదేహన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment