ప్రమాదానికి గురైన నిఖిల్ కారు, ఇన్‌సెట్‌లో నిఖిల్
సాక్షి, అనంతగిరి (వికారాబాద్): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ పట్టణానికి చెందిన నిఖిల్(35) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం గంగారం ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్, హిమజ్యోతి దంపతుల కుమారుడు నిఖిల్ అమెరికాలోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పది రోజుల క్రితం కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వెళ్తుండగా న్యూ మెక్సికో రహదారిలో ఎదురుగా రాంగ్ రూట్ వచ్చిన మరో వాహనం ఇతడి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున ఉదయం నిఖిల్ మృతదేహం వికారాబాద్ చేరుకుంటుందని కుటుంబీకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment