TCS employee
-
ఫలించిన టీసీఎస్ మంత్రం.. నిండుగా ఆఫీసులు!
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి టీసీఎస్ వేసిన మంత్రం ఫలించింది. వేరియబుల్ పేను కార్యాలయ హాజరుకు అనుసంధానించే కొత్త విధానాన్ని అమలు చేశాక దాదాపు 70 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.అయితే ఇది తాత్కాలిక చర్య అని, దాన్ని ఆ విధంగా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత ఏప్రిల్‌లో ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ చెల్లింపును వారి కార్యాలయ హాజరుతో లింక్ చేసింది. దీని ప్రకారం 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారు త్రైమాసిక బోనస్‌కు అర్హులు కాదు.వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పని చేయాలని ఆదేశించిన నెలల తర్వాత ఈ పాలసీ అప్డేట్ వచ్చింది. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు పూర్తి త్రైమాసిక వేరియబుల్ వేతనాన్ని పొందాలంటే కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు ఉండాలి. 75-85 శాతం హాజరున్న ఉద్యోగులు వారి వేరియబుల్ పేలో 75 శాతం, 60-75 శాతం హాజరు ఉన్నవారు 50 శాతం మాత్రమే వేరియబుల్ పే పొందుతారు. -
భారత్‌లో ఆ దేశాధ్యక్షుడు.. కీలక ప్రకటన చేసిన టీసీఎస్
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశంలో పర్యటిస్తున్న వేళ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీసీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతిపెద్ద భారతీయ ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌కు ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో 1,600 మంది ఉద్యోగులు ఉన్నారు. టీసీఎస్‌కు యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఫ్రాన్స్ కూడా ఒకటి. యూరప్‌లోని ఇతర దేశాల కంటే ఫ్రాన్స్‌లో కంపెనీ వేగంగా వృద్ధి చెందుతోందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ సప్తగిరి చాపలపల్లి పీటీఐతో పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లో టీసీఎస్ మూడు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉందని రానున్న రోజుల్లో వ్యాపారాన్ని మరింత వేగవంతంగా వృద్ధి చేసేందుకు గ్రౌండ్‌వర్క్ సిద్ధమైనట్లు సప్తగిరి చెప్పారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అన్ని ప్రధాన రంగాలలో 80 ఫ్రెంచ్ క్లయింట్లతో టీసీఎస్ పని చేస్తోందని, పారిస్‌లో ఒక ఆవిష్కరణ కేంద్రాన్ని కూడా నడుపుతోందని వివరించారు. టీసీఎస్‌కు ఫ్రాన్స్‌లో ఉన్న 1,600 మంది ఉద్యోగుల్లో ఎక్కువ మంది పారిస్‌లో ఉన్నారు. వీరిలో 60 శాతం వరకు ఫ్రెంచ్ పౌరులు. కాగా అక్కడే ప్రధాన కార్యాలయం ఉన్న ప్రత్యర్థి కంపెనీ క్యాప్‌జెమినీ ఫ్రెంచ్ మార్కెట్లో బలంగా ఉంది. అయితే టీసీఎస్ తన సొంత బలంతో అభివృద్ధి చెందుతుందని టీసీఎస్ యూరోపియన్ బిజినెస్ హెడ్ పేర్కొన్నారు. -
ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా టీసీఎస్ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే..?
TCS Techie Turns Zomato, సాక్షి, చెన్నై: అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్న క్రమంలో ఓ వారం గ్యాప్ దొరికింది. ఇంతలో ఆ వారం రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పార్ట్ టైమ్ జాబ్‌ను ఎంచుకున్నాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన తిప్పులు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేయడం ఎంత కష్టమో వివరించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీసీఎస్ మాజీ ఉద్యోగి, తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ జయరామన్.. జాబ్‌కు రిజైన్ చేసి మరో కంపెనీలో చేరాడు. కొత్త కంపెనీలో జాయినింగ్ కోసం ఓ వారం గ్యాప్ తీసుకున్నారు. ఆ వారం రోజులు ఖాళీగా ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా మారాడు. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ల కష్టాలను స్వయంగా అనుభవించి.. ఇబ్బందుల గురించి లింక్డ్ ఇన్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో పెట్రోల్ ధరలు మొదలుకొని స్పీడ్‌గా ఫుడ్ డెలివరీ చేయడం వరకు సమస్యల జాబితాను తయారు చేసి వివరించాడు. పోస్ట్ ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు త్వరగా డెలివరీ ఇవ్వడానికి కాలంతోపాటు పరుగెత్తాలి. చాలా మంది కస్టమర్లు తమ అడ్రస్‌లను కరెక్ట్‌గా చెప్పరు. లొకేషన్ వివరాలు సరిగ్గా ఉండవు. ఫోన్ నంబర్లను అప్డేట్ చేయరు. ఒక రద్దీ ప్రాంతంలో గంటలో మూడు ఫుడ్ పార్సిళ్లను డెలివరీ చేయాల్సి వచ్చిందని జయరామన్ వివరించాడు. తరచుగా డెలివరీ కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. తాను ఓ సారి ఏకంగా 14 కిలో మీటర్లు ప్రయాణించి డెలివరీ ఇవాల్సి వచ్చిందని తెలిపాడు. గూగుల్స్ మ్యాప్స్ సాయంతో కొన్ని సార్లు అడ్రస్‌లు సరిగా తెలియవు. ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘డెలివరీ ఏజెంట్లకు సాయం చేయండి. పెరిగిన పెట్రోల్ ధరలను కంపెనీలే భరిస్తాయనే వార్తలను చూశాను. అది నిజమైతే చాలా బాగుంటుంది. వాళ్లను తప్పక ఆదుకోవాలి” అని చెప్పాడు. కాగా, ఇటీవలే ఇక నుంచి తాము కొన్ని ఆహార పదార్థాలను పది నిమిషాల్లోనే డెలివరీ ఇస్తామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెలివరీ విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి చేయమని వివరణ ఇచ్చారు. -
సరికొత్త రికార్డుకు చేరువలో టీసీఎస్
భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ, ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటి కంపెనీలలో ఒకటైన టీసీఎస్ సరికొత్త రికార్డుకు చేరువలో ఉంది. టీసీఎస్ వచ్చే మూడు నెలల్లో 5 లక్షల ఉద్యోగుల గల సంస్థగా అవతరించనుంది. దేశంలో ఈ ఘనత సాధించనున్న తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ నిలవనుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో ప్రపంచ స్థాయి ప్రతిభ గల ఉద్యోగులు ఇండియాలో కూడా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తి నాటికి ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,88,649. గత సంవత్సరంలో 40,185 మంది ఉద్యోగులు కొత్తగా చేరారు. కేవలం జనవరి-మార్చి 2021 కాలంలోనే 19,388 మంది ఉద్యోగులను సంస్థ చేర్చుకుంది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.2 బిలియన్ డాలర్ల ఒప్పందాలను ఇతర కంపెనీలతో కుదుర్చుకుంది. భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ అమెరికా సహా పలు విదేశాలకు కూడా సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తోంది. దేశం నుంచి అత్యధిక సాఫ్ట్ వేర్ ఎగుమతులు చేస్తున్న ఐటీ కంపెనీగా గుర్తింపు సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు యాజమాన్యం తెలిపింది. నాల్గవ త్రైమాసిక ఆదాయాల విడుదల సమయంలో జర్నలిస్టులతో జరిపిన సంభాషణలో టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ మాట్లాడుతూ.. కొత్త ఉద్యోగుల నియామకం ఎక్కువ భాగం క్యూ 1(ఏప్రిల్-జూన్), క్యూ 2(జూలై-సెప్టెంబర్)లలో జరుగుతుందని పేర్కొన్నారు. 1968లో ఏర్పాటైన టీసీఎస్ అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగింది. ఐటీ సేవలతో పాటు, బిజినెస్, కన్సల్టెన్సీ, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్స్ విభాగాల్లో సేవలందిస్తూ కోట్లాది రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. రికార్డు స్థాయి సాఫ్ట్ వేర్ ఎగుమతులతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జూన్ నెలాఖరునాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5 లక్షల మార్క్ ను అధిగమించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనుంది. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బిట్ కాయిన్ -
అమెరికా రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ వాసి మృతి
సాక్షి, అనంతగిరి (వికారాబాద్): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ పట్టణానికి చెందిన నిఖిల్(35) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణం గంగారం ప్రాంతానికి చెందిన వినోద్‌కుమార్, హిమజ్యోతి దంపతుల కుమారుడు నిఖిల్ అమెరికాలోని టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పది రోజుల క్రితం కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వెళ్తుండగా న్యూ మెక్సికో రహదారిలో ఎదురుగా రాంగ్ రూట్ వచ్చిన మరో వాహనం ఇతడి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున ఉదయం నిఖిల్ మృతదేహం వికారాబాద్ చేరుకుంటుందని కుటుంబీకులు తెలిపారు. -
వందలమంది యువతుల్ని మోసం చేశాడు...
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం అంటూ ఆశ చూపి...వందలాది మంది యువతులను మోసం చేశాడో కేటుగాడు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి...ఆ తర్వాత నిజ స్వరూపం చూపించేవాడు. ఆకర్షణీయమైన ఉద్యోగం కావాలంటే శరీరమంతా కనిపించేలా ఫోటోలు పంపాలంటూ వేధింపులకు దిగాడు. చివరకు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడు కటకటాలపాలయ్యాడు. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి చెన్నైలోని టీసీఎస్ కంపెనీలో పని చేస్తున్నాడు. యువతుల నగ్న చిత్రాలను సేకరించేందుకు పథకం పన్నాడు. ప్రముఖ కంపెనీల్లో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయంటూ ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించి ప్రకటనలు గుప్పించాడు. ఉద్యోగం కావాలంటూ ఎవరైనా ప్రదీప్‌ను సంప్రదిస్తే... ‘ఈ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే .. ఆకర్షణీయమైన రూపం ఉండాలి. ఫ్రంట్, బ్యాక్, చెస్ట్ కనపడేలా ఫోటోలు పంపించాలి’ అని మాయమాటలు చెప్పేవాడు. ఫోటోల్లో ఆకర్షణీయంగా ఉంటేనే ఉద్యోగం సొంతమవుతుందని నమ్మించేవాడు. అతని మాటల్ని నమ్మి 16 రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది యువతులు తమ ఫొటోల్ని పంపించారు. అయితే మియాపూర్‌కి చెందిన ఒక బాధితురాలికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు చివరకు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని దగ్గర వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేప్ బెదిరింపులు : టీసీఎస్ ఉద్యోగిపై వేటు
సాక్షి, కోలకతా: దేశంలో ఒకవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై తీవ్ర చర్చ కొనసాగుతుండగా దేశీయ ఐటీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉద్యోగి ఒకరు ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అంశం వెలుగులోకి వచ్చింది. టీసీఎస్ ఉద్యోగి రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అత్యాచారం, హత్య బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన సంస్థ రాహుల్‌ని విధులనుంచి తొలగించింది. వివరాల్లోకి వెళితే టీసీఎస్‌కు చెందిన రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అభ్యంతరకరమైన,అసభ్య సందేశాలతోపాటు, మీ భర్త, పిల్లలను హత్య చేస్తానంటు బెదరింపులకు దిగాడు. అయితే బాధిత మహిళల్లో ఒకరు ఆ స్ర్కీన్ షాట్లను సోషల్ మీడియాలో(ట్విటర్, ఫేస్బుక్) షేర్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి (ఈ పోస్టులను రాహుల్ తర్వాత డిలీట్ చేశాడు.) దీంతో రాహుల్‌ని తక్షణమే ఉద్యోగంనుంచి తొలగించడంతోపాటు, ఈ విషయాన్ని పరిశీలించేందుకు దర్యాప్తును ప్రారంభించింది టీసీఎస్. మహిళలపై లైంగిక వేధింపులు, ఇతర అసంబద్ధ చర్యలను క్షమించేది లేదని టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులకు స్పందించిన రాహుల్ అభ్యంతరమైన మెసేజ్‌లతో వేధించాడని అసోంకు చెందిన మహిళ తెలిపారు. తను భర్తను, కొడుకును చంపుతానని హెచ్చరించడంతోపాటు, రేప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తించిన సందర్భాల్లో భారతీయ సంస్థలు తీవ్రంగా స్పందించిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత రెండు నెలల కాలంలో ఇది రెండో సంఘటన. మాజీ ఉద్యోగిపై అనైతికంగా వ్యాఖ్యానించిన రిచా గౌతంను టెక్ మహీంద్రా ఉద్యోగం నుంచి తొలగించింది. మరో ఘనటలో కతువా అత్యాచార ఘటనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తన ఉద్యోగిని కోటక్ మహీంద్రా బ్యాంకు సంస్థనుంచి తొలగించింది. -
పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం
-
ఉద్యోగంలో చేరిన 3 నెలలకే..
* సెలవులో వస్తూ ప్రాణాలు కోల్పోయిన స్వాతి గుంటూరు, న్యూస్‌లైన్: గువాహటి ఎక్స్‌ప్రెస్ పేలుళ్లలో మరణించిన గుంటూరు లోని శ్రీనగర్ 7వ లైనుకు చెందిన స్వాతి మూడు నెలల కిందటే బెంగళూరులోని టీసీఎస్‌లో చేరారు. మరికొద్ది నెలల్లోనే ఈమె వివాహం కానున్నట్టు సమాచారం. గుంటూరులో ప్రాథమిక విద్య అనంతరం హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్, ఎంటెక్ చేసిన స్వాతి క్యాంపస్ సెలక్షన్స్‌లో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. స్వాతి తల్లిదండ్రులు పరుచూరి రామకృష్ణ, పరుచూరి కామాక్షి. వీరికి ఇద్దరే సంతానం కాగా.. స్వాతి తమ్ముడు ప్రద్యుమ్న ముంబై ఐఐటీలో చదువుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఉద్యోగంలో చేరిన స్వాతి, అదే నెల చివర్లో స్వస్థలానికి వచ్చి వెళ్లింది. వేసవి కావడంతో ఏడు రోజులు సెలవు తీసుకుని గుంటూరు వచ్చేందుకు బుధవారం గువాహటి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. రాత్రి 11.30 సమయంలో ఫోన్ చేసి ఈ మేరకు సమాచారం అందించింది. ఉదయం ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న తల్లిదండులకు ఊహించని విషాదం ఎదురైంది. ఆమె మరణవార్త తెలుసుకుని చెన్నై వెళ్లిన కుటుంబసభ్యులు పోస్టుమార్టం అనంతరం స్వాతి మృతదేహాన్ని తీసుకుని తిరిగి గుంటూరుకు బయలుదేరారు. వ్యవసాయం చేసే రామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి కాగా కొంతకాలంగా నగరంలోనే స్థిరపడ్డారు. ఆయన భార్య కామాక్షి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. -
రైల్లో బాంబు పేలుళ్లు
* గుంటూరుకు చెందిన యువతి మృతి * 14 మందికి గాయాలు.. చెన్నై సెంట్రల్ స్టేషన్లో దుర్ఘటన * బెంగళూరు నుంచి గువాహటి వెళుతున్న రైల్లోని ఎస్-4, ఎస్-5 బోగీల్లో పేలిన బాంబులు * మరో రెండు పేలని బాంబులు స్వాధీనం! * దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు అప్రమత్తం * పేలుళ్లను ఖండించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి * మృతురాలి కుటుంబానికి లక్ష ఎక్స్‌గ్రేషియూ: రైల్వే మంత్రి * సీబీ-సీఐడీ విచార ణకు ఆదేశించిన తమిళనాడు ప్రభుత్వం.. దర్యాప్తులో కేంద్ర సహాయానికి నిరాకరణ సాక్షి, చెన్నై/ న్యూఢిల్లీ/ బెంగళూరు: స్థలం: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్.9 సమయం: గురువారం ఉదయం 07.10 గంటలు బెంగళూరు నుంచి చెన్నై, విజయవాడ మీదుగా గువాహటి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. రైలు అప్పటికే సుమారుగా గంటన్నర లేటు. ఇంతలో రైలు రాకగురించిన ప్రకటన విన్పించడంతో ప్రయాణికుల్లో హడావుడి మొదలైంది. రైలు ప్లాట్‌ఫామ్ మీదకి వస్తోందనగా ఐదు నిమిషాల వ్యవధిలోనే ఒకదాని వెంబడి మరొకటిగా రెండు పేలుళ్లు సంభవించాయి.. ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణికులు పరుగులు పెట్టారు. పేలుళ్లు సంభవించిన గువాహటి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-4, ఎస్-5 బోగీల్లో హాహాకారాలు చెలరేగాయి. ఎస్-5లో ప్రయూణిస్తున్న బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగి, గుంటూరుకు చెందిన పరుచూరి స్వాతి (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. గాయపడిన వారిని పోలీసులు స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమిళనాడు ప్రభుత్వం పేలుళ్లపై తమ ప్రత్యేక పోలీసు విభాగం సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించింది. ఛిద్రమైన స్వాతి శరీరం గువాహటి ఎక్స్‌ప్రెస్ బెంగళూరులో బుధవారం రాత్రి 11.30లకు బయలుదేరింది. ఉదయం 07.10 ప్రాంతంలో రైలు స్టేషన్ సమీపిస్తుండగా మొదట ఎస్-4 బోగీలో సీటు నంబరు 28 కింద, స్వల్పతేడాతో ఎస్-5 సీటు నంబరు 69 కింద అమర్చిన తక్కువ తీవ్రత కలిగిన రెండు బాంబులు భారీ శబ్దంతో పేలాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులు తలోదిక్కుగా పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే పోలీసులు ప్లాట్‌ఫామ్ నంబర్ 9లో గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు. పేలుళ్ల ధాటికి మరణించిన స్వాతి ఎస్-5లో సీటు నంబరు 69లో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. పేలుడు తీవ్రతకు ఆమె శరీరం ఛిద్రమైంది. రెండు బోగీల అడుగు భాగంలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డారుు. ఎస్-4లో సీటు నంబర్లు 25-32, ఎస్-5లో 65-72 సీటు నంబర్ల మధ్య పేలుళ్లు సంభవించడంతో ఆయా సీట్లలో ప్రయాణిస్తున్న వారే తీవ్రంగా గాయపడ్డారు. లోయర్ బెర్త్ కింద బాంబు అమర్చడంతో అధిక శాతం మందికి కాళ్లు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే, జీఆర్ పోలీస్, ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు బాంబు స్క్వాడ్లు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారుు. బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న అనేక రైళ్లను నిలిపివేశారు. కొన్నింటిని రద్దుచేశారు. ఎస్-4లో పేలుడు ధాటికి ఎస్-3 బోగీ కూడా దెబ్బతింది. బెంగళూరు నుంచి వచ్చిన వారితో పాటు చెన్నైలో ఎక్కాల్సిన వారి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేసి బోగీల్లోకి ఎక్కించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు రైలు గువాహటి బయలుదేరింది. స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న ఆంజనేయులు (29) అనే వ్యక్తి గొంతులో ఏదో దిగబడడంతో తీవ్ర రక్తస్రావమైంది. అతనికి శస్త్రచికిత్స చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మురళి (27), లోక్‌నాథ్ (విశాఖపట్నం)లు కూడా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. సుమంతో దేవనాథ్ (37), గుర్తు తెలియని మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రైలు సుమారు గంటన్నర ఆలస్యంగా నడుస్తుండటంతో పేలుళ్లకు కుట్రదారుల లక్ష్యం చెన్నై కాకపోవచ్చనే అనుమానాన్ని తమిళనాడు డీజీపీ కె.రామానుజం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నట్టైతే.. పేలుళ్లు సంభవించిన 7.10 సమయూనికి ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్లూరుపేటకు సమీపంలో రైలు ఉండేదని అంటున్నారు. టైమర్లను అమర్చి పేలుళ్లకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఎలాంటి పరికరాన్ని వినియోగించారో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. టిఫిన్ బాక్సు, సిలిండర్ రూపంలో ఉన్న రెండు పేలని బాంబులను నిర్వీర్యం చేశారు. గత కొన్నేళ్లలో చెన్నైలో పేలుళ్లు సంభవించడం బహుశా ఇదే మొదటిసారి. 1998లో వివిధ ప్రాంతాల్లో జరిగిన 12 పేలుళ్లలో సుమారు 60 మంది చని పోయారు. ఉగ్రవాది అనే అనుమానంతో రెండురోజుల క్రితం శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, అతనికి మన దేశానికి చెందిన ఉగ్ర మాడ్యూళ్లతో సంబంధాలున్నట్టుగా విశ్వసిస్తున్న నేపథ్యంలో తాజా పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ పేలుళ్ల దర్యాప్తులో కేంద్ర సహాయం తీసుకునేందుకు తమిళనాడు సీఎం జయలలిత నిరాకరించారు. దీనిని బట్టి ఇది ఉగ్రవాదుల చర్యగా ఆ రాష్ట్రం భావించడం లేదని తెలుస్తోంది. బుద్ధిలేని హింసాకాండ... ప్రణబ్ రైల్లో పేలుళ్లను బుద్ధిలేని హింసాత్మక చర్యగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభివర్ణించారు. పేలుళ్ల వార్త తెలుసుకుని తానెంతో విచారానికి గురైనట్టు తమిళనాడు గవర్నర్ రోశయ్యకు పంపిన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్, తమిళనాడు సీఎం జయలలిత, కాంగ్రెస్, బీజేపీ సహాపలు పార్టీల నేతలు పేలుళ్లను ఖండించారు. మృతురాలి కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియూ అందిస్తున్నట్లు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 వేలు, స్వల్ప గాయాలైన వారికి 5 వేలను పరిహారంగా ఇస్తున్నట్టు తెలిపారు. 044 - 25357398 హెల్ప్‌లైన్‌ను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ముష్కరుల ఫొటోల్లో చెన్నై సెంట్రల్! సాక్షి, చెన్నై: గువాహటి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్లకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ప్రకటించకున్నా ఇది ఐఎస్ఐ తీవ్రవాదుల పనేనని అధికారులు విశ్వసిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ జాకీర్ హుస్సేన్ పాత్ర ఉందేమో నని అనుమానిస్తున్నారు. అతన్ని గత నెల 29న చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. జాకీర్ అనుచరులు పలువురు అప్పటికే నగరంలో సంచరిస్తున్నట్లు తెలియడంతో గాలింపులు చేపట్టి 30న ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఈ ముఠా నగరంలో విధ్వంసాలు సృష్టించేందుకు అనువైన ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ప్రాంతాలను ఫొటోలు తీసి శ్రీలంకకు పంపుతున్నట్లు తేలింది. ఈ ఫొటోల్లో సెంట్రల్ రైల్వే స్టేషన్, నగరంలోని జెమినీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుళ్లకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఎస్-4లోని విశాఖపట్నం వాసి ఆనంద్ వినయ్, ఎస్-5లోని బీహార్‌కు చెందిన మహ్మద్ ఖాద్రీలను పోలీసులు విచారిస్తున్నారు. విమానాశ్రయాల్లో బందోబస్తు పెంపు న్యూఢిల్లీ: చెన్నైలో పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అప్రమత్తం చేసింది. బందోబస్తును తీవ్రం చేయడంతో పాటు క్విక్ రియూక్షన్ బృందాలను పెంచాల్సిందిగా, ప్రయాణికులకు వివిధ రకాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలోనూ నిఘా విస్తృతం చేశారు. -
ఉగ్రపంజాకు రాలిన స్వాతిముత్యం
గుంటూరు రూరల్, న్యూస్‌లై న్ :‘అమ్మా ఇప్పుడే చెన్నై స్టేషన్లోకి వచ్చా... ప్లాట్‌ఫాం నంబర్ నైన్లో ఉన్నా, ఇప్పుడే బోగిలోకి ఎక్కుతున్నాను. కాసేపట్లో ఇంటికి చేరుకుంటానంటూ’ తల్లితో మాట్లాడిన స్వాతి కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబులు పేలుతాయన్న పది నిమిషాల ముందు వరకు అమ్మతో మాట్లాడిన స్వాతి అంతలోనే మృత్యుఒడిలో చేరింది. ఉన్నత చదువు..ఉన్నత ఉద్యోగం.. భవిష్యత్తుపై కోటి ఆశలు.. ఇంకా కొన్ని గంటలు ప్రయాణం చేస్తే సొంతింటికి వెళ్లి తల్లిదండ్రులతో గడపవచ్చని ఆశగా బయలుదేరిన స్వాతిని మృత్యువు నీడలా వెంటాడింది. గురువారం తెల్లవారుజామున చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలుళ్లలో గుంటూరుకు చెందిన పరుచూరి స్వాతి (22) దుర్మర ణం పాలయింది. ఈ విషాద వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యు లు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడికి చెం దిన పరుచూరి రామకృష్ణ వ్యవసాయం చేస్తుంటారు. ఆయన భార్య కామాక్షి పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలు. కొంతకాలంగా గుంటూరు శ్రీనగర్ ఏడో లైన్లో నివాసం ఉంటున్నా రు. వీరికి కుమార్తె స్వాతి, కుమారుడు ప్రద్యుమ్న. కుమారుడు ముంబయి ఐఐటీలో చదువుతున్నాడు. స్వాతి ప్రాథమిక విద్య కేఎల్పీ పబ్లిక్ స్కూల్, ఇంటర్మీడియెట్ సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలోనూ, బీటెక్ త్రివేండ్రంలో, ఎంటెక్ జేఎన్టీయూలో చదివింది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికై జనవరిలో బెంగళూరు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేరింది. అదే నెల చివరలో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి తిరిగి బెంగళూరు వెళ్లింది. వేసవిలో ఏడురోజులు సెలవులు రావడంతో స్వాతి బెంగళూరు నుంచి వయా చెన్నై మీదుగా విజయవాడకు తత్కాల్లో టికెట్ తీసుకుంది. ఇంటికి వస్తున్నానంటూ బుధవారం రాత్రి తల్లిదండ్రులకు స్వాతి సంతోషంగా చెప్పింది. బెంగళూరు నుంచి గురువారం తెల్లవారుజామున చెన్నై సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడే నిలిచి ఉన్న గౌహతి ఎక్సైప్రెస్‌లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిపారు. ఈ దుర్వా ర్త తెలుసుకున్న స్వాతి కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైకు బయలుదేరారు. వారు మార్గంమధ్యలో ఉండగా.. గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్-5, సీటు నంబర్-9లో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన పరుచూరి స్వాతి బాంబు పేలుళ్లకు మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కు లోనయ్యారు. ఇంటి వద్ద ఉన్న స్వాతి అమ్మమ్మ రాజ్యలక్ష్మి, తాతయ్య సత్యనారాయణలు మనవరాలి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందారు. తమ గారాలపట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని భోరున విలపించారు. చిరునవ్వుతో పలకరించే స్వాతి ఆకస్మికంగా మృతిచెందడం స్థానికులను కలచివేసింది. బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు మంచి ఉద్యోగం లభించిందన్న సంతోషంతో ఉన్న తల్లిదండ్రుల్లో విషాదం అలుముకుంది. చెన్నయ్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వాతి మృతదేహాన్ని గుంటూరు తీసుకురానున్నట్లు సమాచారం.