సాక్షి, కోలకతా: దేశంలో ఒకవైపు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై తీవ్ర చర్చ కొనసాగుతుండగా దేశీయ ఐటీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉద్యోగి ఒకరు ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అంశం వెలుగులోకి వచ్చింది. టీసీఎస్ ఉద్యోగి రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అత్యాచారం, హత్య బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించిన సంస్థ రాహుల్‌ని విధులనుంచి తొలగించింది.
వివరాల్లోకి వెళితే టీసీఎస్‌కు చెందిన రాహుల్ సింగ్ ఇద్దరు మహిళలకు అభ్యంతరకరమైన,అసభ్య సందేశాలతోపాటు, మీ భర్త, పిల్లలను హత్య చేస్తానంటు బెదరింపులకు దిగాడు. అయితే బాధిత మహిళల్లో ఒకరు ఆ స్ర్కీన్ షాట్లను సోషల్ మీడియాలో(ట్విటర్, ఫేస్‌బుక్) షేర్ చేశారు. ఇవి వైరల్ అయ్యాయి (ఈ పోస్టులను రాహుల్ తర్వాత డిలీట్ చేశాడు.) దీంతో రాహుల్‌ని తక్షణమే ఉద్యోగంనుంచి తొలగించడంతోపాటు, ఈ విషయాన్ని పరిశీలించేందుకు దర్యాప్తును ప్రారంభించింది టీసీఎస్. మహిళలపై లైంగిక వేధింపులు, ఇతర అసంబద్ధ చర్యలను క్షమించేది లేదని టీసీఎస్ ప్రతినిధి వెల్లడించారు.
ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులకు స్పందించిన రాహుల్ అభ్యంతరమైన మెసేజ్‌లతో వేధించాడని అసోంకు చెందిన మహిళ తెలిపారు. తను భర్తను, కొడుకును చంపుతానని హెచ్చరించడంతోపాటు, రేప్ చేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసానని పేర్కొన్నారు.
కాగా ఉద్యోగులు అనుచితంగా ప్రవర్తించిన సందర్భాల్లో భారతీయ సంస్థలు తీవ్రంగా స్పందించిన ఘటనలు గతంలో కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత రెండు నెలల కాలంలో ఇది రెండో సంఘటన. మాజీ ఉద్యోగిపై అనైతికంగా వ్యాఖ్యానించిన రిచా గౌతంను టెక్ మహీంద్రా ఉద్యోగం నుంచి తొలగించింది. మరో ఘనటలో కతువా అత్యాచార ఘటనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తన ఉద్యోగిని కోటక్ మహీంద్రా బ్యాంకు సంస్థనుంచి తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment